మాయ మొసలి
>> Wednesday, September 3, 2008
సంసార సాగరంలో మాయ ఒక మొసలివలే ప్రవేశించి మానవుని బాధిస్తుంది. గజేంద్రుని కధ మీరు చదివేయుంటారు. స్ధాన బలం కలిగి మొసలి ఏనుగువంటి బలవర్ధకమగు జంతువును కూడా పట్టి పీడిస్తుంది. అట్లే మాయ మొసలికూడ జ్ఞానాత్ముని బుద్దియనే పాదాన్ని పట్టుకొనుటలో దిట్ట. సముద్రంలో మొసలి పైకి కనబడకుండా పొంచి యుంటూ సునాయాసంగా జంతువులను కబళించివేసినట్లు మాయకూడా భవసాగరంలో దిక్కూ తెన్నూ తోచక పయనించే మనుష్యాత్మలనే ఏనుగులను రహస్యంగా పట్టి వేస్తుంది. ఆ సమయంలో మన స్వీయబలం నిష్ప్రయోజనం. ఆ సాగరాన్ని మించిన శక్తిసాగరుడు పరమాత్ముని దివ్యస్మరణే మనలనా ప్రమాదం నుండి రక్షించేది, స్వర్గతీరాలకు చేర్చేది అనిమాత్రం మరచిపోకండి.




0 వ్యాఖ్యలు:
Post a Comment