శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అనాచారాలకు కారణం

>> Wednesday, September 3, 2008

ఇపుడు ప్రపంచమందంతటా చోటు చేసికొన్న అనాచారత్వానికి భ్రష్టాచారానికి కారణమేమిటి అనేది మన కంతుపట్టక వేధించే చిక్కు ప్రశ్న. మనిషి కర్మలో చెడు స్ధావరమేర్పరచుకోగానే ఒడిదుడుకుల జీవితం ప్రారంభమవుతుంది. క్రమంగా మన పూర్వజన్మ సంచితమైన పుణ్యం క్షీణిస్తూ వస్తుంది. అప్పటినుండే మనము కోరుకునే వస్తుప్రాప్తి కలగకుండా పోతుంది. అందువలననే మనవాళ్ళు దురదృష్టవంతుణ్ణి బాగుచేసే వాళ్ళు లేరు. అదృష్టవంతున్ని చెడగొట్టనూలేరు అన్నారు. ఒకసారొకతను తన మిత్రునితో ఒక్కనిముషం ముందుగా మా అమ్మగారికి ఆక్సిజన్ ఎక్కిస్తే బ్రతికేది అన్నాడట. ఆమెకు ప్రాణవాయువు సమయానికి లభించకుండా ఉండటమే విధివిలాసమని విన్న మిత్రుడాతడిని ఓదార్చి వెళ్ళి పోయాడట. కానీ విషయమేమిటంటే పుణ్యమెపుడు క్షీణిస్తుందో అపుడే భాగ్య రేఖ నామరూపాలులేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఆలాగని పురుషార్ధం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోమనికాదు. ప్రారబ్ద కర్మ పురుషార్ధ మార్గంలో అడ్డంకులనూ వేస్తుంది. సహాయాన్నీ యిస్తుంది. కావున మన కర్మలలో శ్రేష్ఠత్వాన్ని తెచ్చుకోవటం తప్పనిసరి. మనలోని లోపాలే అనాచారానికి కారణం. లాపానికి, లోటుపాట్లకు కారణం కర్మ, భ్రష్టత్వం. ఇవి రెండూ నామరూపాలులేకుండా నశించాలనుకుంటే జ్ఞానయోగాల ననుసరించక తప్పదు. శరీర పోషణకు ఆహారం తప్పనిసరి అయినట్లు మానవుడు ఉత్తమోత్తముడగుటకు జ్ఞానయోగాలు అత్యావశ్యకములవుతాయి.

2 వ్యాఖ్యలు:

Anonymous September 3, 2008 at 10:28 AM  

చాలా బాగా రాశారు.

మనిషి చేతిలో 99 శాతం ఏమీ లేదు. ఉన్న ఆ ఒక్క శాతం స్వేచ్ఛనీ నవ్వుతూ వెధవపనులు చెయ్యడానికే ఉపయోగించుకుని ఆ తరువాత ఏడుస్తూ అనుభవిస్తాడు మనిషి. ఆ వెధవపనుల కర్మఫలాన్ని అనుభవించడం ఇష్టం లేక ఆ ఏడుపులో దేవుణ్ణి నిందించి, దేవుడు లేడని వాదించి మఱింత కర్మఫలాన్ని మూటగట్టుకుంటాడు. అంతే తప్ప లోపం తనలో ఉందని ఒప్పుకోడు.

సుజాత వేల్పూరి September 4, 2008 at 1:07 AM  

బాగా రాశారు! కానీ మీరు రాసినంత 'స్థితప్రజ్ఞత ' , 'కర్మల గురించిన పరిజ్ఞానం' ప్రతి మనిషికీ వస్తే ఈ లోకంలో దుఃఖం అనేదే ఉండదేమో! మీరు చెప్పిన మిత్రుడి విషయం తీసుకోండి, మామూలు మనిషి ఎవరైనా తన రక్త సంబంధం మీద(తల్లి మీద) ఉన్న ప్రేమతో అలాగే(ఒక్క నిమిషం ముందు ఆక్సిజన్ అందిస్తే అమ్మ బతికేది అని)స్పందిస్తారేమో!

దేవుడిని నిందించడం సగతి కూడా అంతే! భరించరాని కష్టం కలిగినపుడు ఇది 'తన పూర్వ జన్మ కర్మలవల్ల తనకు సంభవించిందని ఎవరో మహారుషులైతే తప్ప భావించరు. ఉదాహరణకు గౌతమీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తీసుకొండి. కళ్లముందు అయిన వాళ్ళు ఆర్తనాదాలమధ్య కాలి బూడిదవుతుంటే చూసిన వారెవరైనా 'ఇదంతా నా పూర్వ జన్మ పాప ఫలితం 'అనుకోగలడా..కనీసం ఆ క్షణంలో?

మీరు చివరి వాక్యంలో చెప్పినట్టు "శరీర పోషణకు ఆహారం ఆవశ్యకమైనట్టు మానవుడు ఉత్తమోత్తముడవుటకు జ్ఞానయోగాలు అత్యావశ్యకాలవుతాయి ' అనే జ్ఞానం అందరికీ కలగాలంటే అది వారు పెరిగే వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది! దాని కోసం ప్రయత్నించే వారెందరు?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP