శివునికేపూలంటే ఇష్టం
>> Wednesday, September 3, 2008
చాలామంది భక్తులు శవుని ఉమ్మెత్త పూలతోటి జిల్లేడు పూలతోటి పూజ చేస్తుంటారు. శివుడు ఉమ్మెత్త, జిల్లేడు పూలతోటే ప్రసన్నుడై మనకు ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించినట్లయితే పదిరవైపైసలు పెట్టి వూలుకొని పూజచేస్తే చాలు, ఈ జప తపారాధనాది పురుషార్ధం చేయనవసరమే లేకపోయేది. సూక్ష్మంలో మోక్షమన్నట్లు ఈ పనికిరాని వూలతోనే జీవన పరమలక్ష్యం సిద్దించేది, ఇంతపాటి కార్యమేచేతకానివాడయినా చేయగలుగుతాడు. ఇక జ్ఞానయోగ తపో శాస్త్రాధికాలనడిగే నాధుడే కనపడడు. ఇంత మాత్రానికే పరమాత్ముని సర్వశక్తి సంపన్నుడనీ, పాపకటేశ్వరుడనీ, ముక్తేశ్వరుడనీ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ, వచ్చామా? లేదు.
పనికిరాని జిల్లేడుపూలు, ఉమ్మెత్తపూలు కాదు శివుని కర్పించేది, ఇవికాదు శివుని సంతోష పరచేవి. మీలోని కామాది విషయ వికారాలనే పనికిరాని ఉమ్మెత్తపూలను శివునకు సర్వ స్వదాన మొనర్చి ఉత్తమోత్తములుకండి. ప్రాపంచిక వస్తువ్యామోహమనే జిల్లేడుపూలను సమర్పించి కల్లా కపటంలేని స్వర్ణయుగ సామ్రాజ్యాన్నధిష్టించి ధన్యాతి ధన్యులు కండి.
3 వ్యాఖ్యలు:
చాన్నాళ్లు గా ఉన్న కొన్ని సందేహాలు తీరినయ్యి
వినాయక చవితి శుభాకాంక్షలతో
బొల్లోజు బాబా
చాలా మంచి విషయం తెలియచేశారు.
dhanyavaadamulu
Post a Comment