శని త్రయోదశి వివరాలు తెలుసుకుందాం
>> Thursday, September 11, 2008
శని త్రయోదశి సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది. అలాగే అతిముఖ్యంగా వృషభ, కర్కాటక, సింహ, కన్య, మకర రాశుల వారు ఈ శని దోషం ఉన్నందువల్ల శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.
ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.
శనికి తైలాభిషేకం చేయండి
శని త్రయోదశి సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది
నవగ్రహాల్లో చంద్రునికి అతి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనస్సుకి చంద్రుడు కారకుడు అవటంవల్ల ఈ చంద్రుడికి శని ప్రభావం ఏర్పడినపుడు అనేక రూపాలలో మానసిక ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఈ శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఉదాహరణకు వర్తమానం శని సింహరాశిలో సంచరించటంవల్ల కర్కాటక, సింహ, కన్య రాశులను శని దోషం ఏర్పడినది. శని ఉన్న రాశికి వెనకరాశి ముందురాశికి ఏలినాటి శని దోషం అంటారు. చంద్రుడున్న రాశి నుంచి నాల్గవ స్థానంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని దోషం అని చంద్రుడున్న రాశి నుంచి ఎనిమిదవ స్థానం శని ఉన్నచో అష్టమ శని అని అంటారు.
అర్ధాష్టమ శని వర్తమానం వృషభ రాశికి నాల్గవ స్థానంలో శని సంచరించటంవల్ల ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఏర్పడినది. ఈ శని దోషం వల్ల ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, పెద్దల గురించి ఆందోళన, చంచలత్వం అధికం కావటం, ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం అనగా శని సంచరిస్తున్న స్థానానికి వెనక భాగం అనగా పన్నెండవ స్థానం తాను ఉన్నస్థానం, రెండవ స్థానాన్ని ఏలినాటి శని దోషం అంటారు.
వర్తమానం సింహరాశిలో శని సంచారం జరుగుతున్నందువల్ల కర్కాటక రాశికి, సింహ రాశికి, కన్యా రాశికి ఏలినాటి శని దోషం జరుగుతోంది. కర్కాటక రాశికి ద్వితీయ స్థానం నందు అనగా కుటుంబస్థానం, ధన స్థానం నందు శని సంచారం వల్ల ఊహించని ఖర్చులు, కుటుంబీకులు మధ్య విభేదాలు, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు, విద్యార్ధులకు ఏకాగ్రత లోపం వంటివి ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు.
సింహరాశి మీద శని సంచారం వల్ల సింహరాశి వారు ఆకారంలో కొంతమార్పు జుట్టు అధికంగా ఊడటం, శరీరం బలహీనపడటం, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి, కొంత తగ్గటం అందరికీ సహాయం చేసి మాటపడటం, ఆందోళన పడటం వంటివి ఎదుర్కొంటారు. కన్యా రాశి వారికి వ్యయం స్థానంలో శని సంచారం వల్ల నిద్రాభంగం, ఎముకలకి సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి కొంత తగ్గటం, ఉన్నట్టుండి ఉద్రేక పడటం, వ్యాపారస్తులకు ఆందోళన కలగటం, నిలకడ లేకపోవటం వంటివి ఎదుర్కొంటారు.
తదుపరి అష్టమ శని... ఈ అష్టమ శని మకరరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని ఏర్పడినది. ఈ అష్టమ శని దోషం వల్ల మానసిక ఆందోళన పెరగటం, చిన్న చిన్న ప్రమాదాలు, తలపెట్టిన పనులు వాయిదా వేయటం, మాటపడటం, కుటంబీకుల మధ్య చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఈ దోషాలన్నింటికీ శని కారకుడు అయినందువల్ల శనివారం, త్రయోదశి కలిసినది శని త్రయోదశి. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. శనికి ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు నువ్వుల నూనె, నలుపు వస్త్రం, నల్ల నువ్వులు, బెల్లం, నీలిరంగు వర్ణం కలిగిన పుష్పాలతో శనేశ్వరునికి అర్చించినట్లైతే ఈ శని దోషం తొలగిపోయి శుభం చేకూరుతుంది.
మానసిక అశాంతి తొలగిపోవటానికి, ఆరోగ్యం చేకూరటానికి, అన్నివిధాలా కలిసివచ్చేందుకు ఈ శనేశ్వరునికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం కలుగుగలదు.
0 వ్యాఖ్యలు:
Post a Comment