పునాదిలేని తంజావూరు శివాలయము
>> Wednesday, August 27, 2008
శివలింగ గోపురంపై 14 రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. శివలింగంపై 216 అడుగుల వరకు కూడా ఖాళీగానే ఉంది. చివరిదైన 14వ నిర్మాణంపై దాదాపుగా 88 టన్నుల బరువు కలిగిన రాతి గుండును నిలిపారు. దీని బరువు మొత్తం నిర్మాణంపై పడుతుంది. ఇది చోళుల శిల్పకళలకు నిదర్శనం. అన్నిటికంటే పైభాగాన 12 అడుగుల కుంభాన్ని ఏర్పాటు చేశారు.
లోపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా శిల్ప, వాస్తు కళలతోనే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో గోపుర నిర్మాణంలోని మెళుకులనే చిదంబరంలోని తిల్లై నటరాజ లయ నిర్మాణంలో కూడా వినియోగించారు. ఈ నిర్మాణ విధానమే చిదంబర రహస్యంగా కీర్తి గాంచింది.
ఇది సాధ్యమా...? అని ఎవరైనా అడగొచ్చు. ఇది సాధ్యమేనని నిరూపణ అయ్యింది కూడా. ఇదే విధానాన్ని అనుసరించి తరువాత కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తుగల తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఖాళీ స్థలంతో కూడి ఉంటుంది. నిర్మాణానికి పునాది ఉండదు. తిరువళ్ళువర్ విగ్రహాలు చెక్కిన రాళ్ళను ఈ నిర్మాణంపై పేర్చారు.
2004లో వచ్చిన సునామీ అలలు ఈ నిర్మాణాన్ని తాకినా చెక్కుచెదరలేదు. దక్షిణ భారత దేశంలోని చాలా దేలాయాలు పెద్ద పెద్ద రాజగోపురాలనే కలిగి ఉన్నాయి. అలాగే చివరలో డోమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బసవేశ్వర దేవాలయంపై నిర్మించినంతటి గోపురం మరెక్కడా లేదు.
కోటలు, దేవాలయాల నిర్మాణానికి భారతదేశం పెట్టింది పేరు. ఇందులోని శిల్ప,వాస్తు కళలను ఊహలకందనివిగా ఉంటాయి.ఇదే దేవాలయంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. దీని ఎత్తు దాదాపు 12 అడుగులు. 19.5 అడుగులు వెడల్పు కలిగి ఉంటుంది. యునేస్కో దీనిని ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. తంజావూర్ వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన నిర్మాణమని సూచించింది. భారత పురావస్తు శాఖ దీనిపై అత్యంత జాగురుకతతో వ్యవహరిస్తోంది.
6 వ్యాఖ్యలు:
బృహదీశ్వరాలయం గురించి తెలుసు కానీ అది పునాదిరహితమని తెలియదు.చక్కని,తెలియని ఈ విషయమును తెల్పినందుకు ధన్యవాదములు.
చాలా ఆశక్తికరమైన విషయాలు చెప్పారు.
మంచి విషయం తెలియచేశారు.ధన్యవాదములు
dhanyavaadamulu .nEnu cheppaDam marachaanu deenini nenu webdunia .com numdi sEkarimchaanu.
మంచి విషయాలు తెలియ చేస్తున్నారు. మరిన్ని తెలియచేయండి
తంజావూరు శివాలయము గురించి బాగా వ్రాసారు.
Post a Comment