శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రద్ధ లేనివారికి,అడగనివారికి మహా మంత్రాలు చెప్పరాదు.

>> Wednesday, August 27, 2008



లలితా సహస్రనామము మహిమలు మీరు వినివుంటారు. కానీ నాకు
అనుభవపూర్వకంగా నిరూపణలు వున్నాయి. దీనిని ఎవరికిబడితే
వారికి,శ్రద్దాభక్తి లేనివారికి చెప్పరాదు.
ఒక నవరాత్రులలో నాకు జరిగిన విషయాన్ని చెబుతాను వినండి.
లలితా సహస్రనామ మహిమలు ఇంత గొప్పవయి భక్తులకోరికలు నెరవేరుస్తున్నప్పుడు,
మరింతమందికి ఇవి అందించాలిగాని ,తెలిసీ మనవరకే వుపయోగించుకుంటే స్వార్ధం
కదా అనే అతితెలివి ఆలోచనవచ్చినది. కనుక లలితా సహస్రనామాలతో ఒక్కొక్క
నామంతో ఒక్కొక్కరకమయిన సమస్యను పరిష్కరించుకోవాలొ తెలియజేసి ,ఇక్కడపీ
ఠములో వారిచేత ఎలా సాధన చేయాలో నేర్పుతామని ,పాంప్లెట్ల ద్వారా ,మరిన్ని
పద్దతులద్వారా ప్రచారం చెయ్యాలని మధ్యాన్నం నిర్ణయించుకున్నాను.
సాయంత్రానికి ఊర్లోనుంచి కబురువచ్చినది. [మనపీఠం ఊరికి కొద్దిదూరంగా
వుంటుంది] విషయమేమిటంటే రోగగ్రస్తుడయిన ఒకవ్యక్తిని పూజకోసం పీఠమునకు
తీసుకువస్తున్నామని . అతనికి ఎయిడ్స్. ఎక్కడకూర్చుంటే అక్కడే మలమూత్ర
విసర్జనకూడా చేసే స్తితి. అన్ని ఆశలు వదులుకుని ,దేమునిదగ్గరకు పూజకోసం
తీసుకురావాలని నిర్ణయించి కబురుపంపారు. నాపరిస్తితి అయోమయమయిపోయింది.
వద్దందామా అంటే అతను అతని కుటుంబము వాళ్ళు మనమంటే అభిమానము కలవాళ్ళు ,
అబ్బో వీళ్ళుగాంగ గుడి కట్టారు, బాగలేదంటే రానివ్వరా అని విమర్షిస్తారు.
రమ్మందామా అంటే ,అతనిపరిస్తితి చూస్తే మిగతా భక్తులకు ఇబ్బంది, ఇక్కడ
భోజనాలుకూడా చెయ్యలేరు. ధర్మసంకటం. నాకయితే మనస్సు కకా వికలమయినది.
ఎప్పుడూరాని సంకటం . అర్ధరాత్రిదాకా ఆందోళనగా తిరుగుతున్న నన్ను నా
మేనత్త ఏమిజరిగినదిఅని అడిగింది. అందరూ నిద్రపోతున్నారు. నాపరిస్థితి
వివరించాను. అమ్మవారు తాతగారి కాలము నుండి మనకు ఎప్పుడూ సంకటాలు
కల్పించలేదు. ఏదో కారణముంటుంది. ఏమిటది నిజంచెప్పమన్నది. వేరే ఏమీ
లేదత్తా ! నేను ఇలా అనుకున్నాను అని చెప్పాను. అప్పుడు అయ్యో ! ఎంతపని
చేసావు. చదువుకున్నవాడివి . అడగనివాడికి పాపులకు చెప్పరాదు. అని
అగస్త్యులవారికి, హయగ్రీవస్వామి చెప్పారని అం టారు. నువ్వు ఇలా ప్రచారం
చేస్తే ఇక్కడ సిద్దపీఠములో కొంతమందికి తగ్గితే,
చచ్చేస్థితిలోవున్నవారినికూడా మోసుకువస్తారు అప్పుడు ఏమిచేస్తావు. నీవలన
అనర్హులు కూడా ప్రయత్నిస్తే కలిగే అనర్ధ ములకు బాద్యులెవరు. అని రెండవ
తరగతిమాత్రమేచదివిన ఆమె నోట్లోనుంచి ప్రవాహం గా సాగుతున్న బోధకు
నాతలతిరిగిపోయినది. చెంపలువేసుకున్నాను. అత్తా ఇప్పుడు ఈ గండము గడిచేదెలా
అని ఆందోళనగా అడిగాను. కల్పించిన తల్లే పరిస్కరిస్తుంది ఏమో వాడికూతురే
పెద్దమనిషయి,వాళ్ళే రాకూడదని మానుకోవచ్చుకదా? అని యధాలాపముగా అన్నది.
సరే అమ్మకు క్షమాపన చెప్పుకుని పనుకున్నాను. తెల్లవారగనే వూరిలోనుంచి
కబురు, రోగి కూతుఱు పెద్దమనిషి అయినందున మేము రావటములేదుఅని .
నాతలతిరిగిపోయినది. అందుకే అడగనివారికి చెప్పకూడదనుకుంటాను. కానీ
చంచలమయిన నాబుద్ది అప్పుడప్పుడూ ఎవరికో చెప్పాలని చూస్తుంది, కానీ అమ్మ
కు ఇస్టం లేకపోతే సాగనివ్వదు.

3 వ్యాఖ్యలు:

Anonymous August 27, 2008 at 9:41 AM  

And also we ensure that when we enter in this specific blog site we see to it that the topic was cool to discuss and not a boring one.

Kathi Mahesh Kumar August 27, 2008 at 8:29 PM  

చాలా నిర్హేతుకమైన అపోహలాగావుంది. వ్యాధిగ్రస్తుడు (అది ఏవ్యాధైనా సరే)"అడగనివాడు పాపి"ఎలావుతాడు?

durgeswara August 27, 2008 at 11:18 PM  

అడగనివాడు, అడిగినా శ్రద్ధ్ చూపని వాడికి ,మందయినా మంత్రమయినా ఎట్టిఫలితమీయవు. అంతేకాని అడగనివాడు పాపి అని ఎవరూ అనలేదు. ఇతరులను పాపులు అనే సాంప్రదాయము వారికి పాప పరిహారపత్రాలనిచ్చే సదుపాయము మన పద్దతులు కావు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP