లక్ష్మీనివాసం ఎక్కడ?
>> Wednesday, August 27, 2008
లక్ష్మీ నివాసం ఎక్కడంటే...
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీ నివాసముంటుంది
లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. అసలు లక్ష్మీ ఎటువంటి ఇంటిలో నివాసముంటుంది.. ఏఏ పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుందో తెలుసుకుందాం....
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు.
పెద్దలను గౌరవించే గృహంలో, సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది.
రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే.. లక్ష్మి వెళ్లిపోతుంది.
ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది.
ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో లక్ష్మి ఉండదు.
సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.
5 వ్యాఖ్యలు:
సరిగా చెప్పారండీ.ధన్యవాదములు.
మిగిలినవి సరే గానీ రాత్రి కట్టి పడుకున్న బట్టలు మరుసటి రోజు కట్టకూడదంటేనే కష్టం.
లక్ష్మి అంటే ధనమైతే పైనచెప్పినవన్నీ కరెక్టే ! కొన్ని ఆరోగ్యసూత్రాలు, మరికొన్ని జీవితాన్ని క్రమబద్ధం చేసే విధానాలు. ఇలా డిసిప్లైన్ గా వుంటేనే ఆరోగ్యం,ధనం, శాంతీ చేకూరుతాయి.
బట్టలసంగతేకాస్త అందకుండావుంది!
మహేష్ గారూ!
లక్ష్మి అంటే సంపద అని అర్ధం. సంపద అంటే చిత్తుకాగితాలూ, చిల్లర నాణేలూ మాత్రమే కాదు. అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది విధాలైన సంపదలు అందులో ధనం ఒకటి మాత్రమే .ఆరోగ్యం తేజస్సు ఇత్యాదులు మిగతావి. కాస్త మన సంస్కృతికి సంబంధించిన పుస్తకాలుకూడా చదవండి.
మనం నిదరలేవటం ఆలస్యమవుతుందని సూర్యున్ని లేటుగా ఉదయింపజేయటం కుదరదు కదా? అలాగే ప్రక్ర్తి ధర్మాలుకూడా. గాస్ ట్రబుల్ వున్న మాఫ్రెండ్ ఒకాయన బజ్జీలు తింటాడు పొద్దున్నే బాధపడుతుంటే ఎందుకయ్యా తిం టావంటే ఒక్కటేకదా తిన్నది దానికే ఎందుకు జరుగుతుందని విరుచుక పడతాడు. మనపెద్దలు చెప్పిన వి ప్రకృతి ధర్మాలు .రెండులక్ష్లలో రెండేకదా అని తగ్గిస్తే అవి రెండులక్షలు కాలేవు. రెండు రెండ్లు నాలుగే తప్ప మరొకటికాదు.ధన్యవాదములు
Post a Comment