అమ్మా!నాన్నా! అనిపిలవడం ఛాదస్తమట
>> Tuesday, July 8, 2008
ఇది సత్యన్నారాయణ రెడ్డి అనే మిత్రుడు చెప్పినవిషయం. సత్యన్నారాయణరెడ్డి గారు ఒకసారి తన పిన్నికూతురు చంద్రకళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి రాత్రి 7గంటల సమయమైనది. ఆసమయములో ఈయన చెల్లెలు చంద్రకళ తనబాబును చంకనేసుకుని చంద్రుడిని చూపిస్తూ అన్నంపెడుతున్నది. ఇదిసాధారణ విషయమే. అయితే ఒకాసాధారణవిశయం ఈయనగమనించాడు. ఆవిడ చంద్రున్ని చూపిస్తూ, ట్వింకిల్ ట్వింకిల్ లి.టిల్ స్టార్...ఒక్కముద్దతినమ్మా..హౌఐ వండర్ వాట్ యు ఆర్ ...ఇంకొక్క ముద్ద పట్టునాన్నా, ......అప్ అబౌ సోహై మమ్మగదూ ఇంకొక్క ముద్ద తినాలి .... అంటూ పాడుతూ అన్నం పెడుతున్నది. ఈయనను చూసి రా అన్నయ్యా అంటూ పలకరించి మరలా తన పిల్లవానికి అన్నంపెడుతూ పాట సాగిస్తున్నది. ఈయన కుబోలెడు ఆశ్చర్యం వేసింది. అమ్మాయ్ చ0ద్రకళా చందమామ రావే ...జాబిల్లి రావే అంటూ ఆడవాళ్ళు పిల్లలకు అన్నంపెట్టడము చూసాను..అలాగే చాలా సినిమాల్లో కూడా అలాగే పాటలు పాడుతూ అన్నం పెట్టడంపిల్లలు తినడం చూశాను కానీ... నువ్వుమాత్రం చాలా వెరైటీగా ..పాట ..అన్నంపెట్టడం చూస్తున్నానమ్మా. ఏమిటీ ప్రత్యేకత అని అడిగాడు. అప్పడు ఆవిడ ఈయన అజ్ఞానం తొలగించేలా ,అన్నయ్యా మనం ఇలా చిన్నప్పటినుండే ఇంగ్లీషులో అలవాటు చేశామనుకో వీడు బడికెల్లేటప్పటికి బోలెడు ఇంగ్లీష్ పదాలు విని వుండటము వల్ల ఇంగ్లీష్ చాలా చురుగ్గా నేర్చుకుంటాడు. ఈరోజులలో ఇంగ్లీష్ లేకుండా బ్రతకటం కష్టం అని విషయ బోధ చేసినదట. ఇక ఆపసివానిచేత ఏదీ అనునాన్నా ... డాడీ.. మమ్మీ ... అంటూ సంవత్సరమ్ గుంటవెధవ చేత పలికించాలని పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఇక ఈయన వుండబట్టలేక అమ్మాయ్, రేపు మీవాడిచేత ఇలానే పిలిపించాలంటావా ? అది అవసరమా ? అనగా ఆవిడ అంతేకదన్నయా చిన్నప్పటినుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడితే వాడు నలుగురిలో మెప్పు పొందుతాడు ,అలాపిలిపించుకోవడమే నాకిష్టం అన్నదట.
ఔ నమ్మా నీకో విషయం చెప్పనా అని అడుగగా ఆవిడ చెప్పన్నయ్యా అన్నది. మమ్మీ అంటే అర్ధము తెలుసమ్మా నీకు, ఈజిప్టులో చనిపోయిన శవాలను భద్రపరచి వాటిని మమ్మీలంటారు. ఇకడాడీ అన్నపదానికి తండ్రి అనే కాక డాడ్ అంటే మూర్ఖుడు అనే విశేషణము కూడా అర్ధముగా వున్నదమ్మా నువ్వూ ఇంటర్ చదివావుగా కావాలంటే డిక్షనరీలో చూడు. వేలకు వేలు ఫీజులు పోసి వీడిని చదివించి వీడిచేత చచ్చినదానా...అని నిన్ను , మూర్ఖుడా అని బావగారిని పిలిపించుకోవాలంటావా ? అని అనగానే ఆవిడ ఇంతెత్తునలేచి మీరు ఎదగలేరన్నాయ్ ..తెలుగులో చదివి తెలుగు మాట్లాడుతూ మీరిలా గుమస్తావుద్యోగాలు చేసుకోవలసినదే అని ఎగతాళి చేసినదట. భాష నేర్చుకోవటం పెద్ద సమస్య కాదమ్మా దాని కోసం మనంకృత్రిమంగా మన మాటను పాటను మార్చుకుని జీవించాలా? మన భాషలో మనం ఏవిషయాన్నయినా తేలికగా నేర్చుకోవచ్చు. అవసరమయినప్పుడు పరాయి భాషలు నేర్చుకోవచ్చు అంతేగానీ...అని ఈయన చెబుతుంటే.... ఆవిడమాత్రం ...మీచాదస్తం ..మీరూనూ అంటూ ...విషయాన్ని కట్ చేసినదట. పాపం అమాయకులను ఏ ప్రచారం అమ్మా నా న్నా అనే తీయని పదాలనుంచి దూరం చేస్తున్నదోకదా!
4 వ్యాఖ్యలు:
ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు అలాగే భావిస్తున్నారండీ! పిల్లల ఇంగ్లీషు చదువులకు 'మమ్మీ ' అనే మాట తొలిమెట్టుగా ఊహించుకుంటున్నారు. మా అయిదేళ్ల పాప 'అమ్మ ' 'నాన్న గారు ' అని పిలుస్తుందని మా వాచ్ మన్ పిల్లలు (వాళ్ళు పుడుతూనే మమ్మీ అంటూ పుట్టారు లెండి) కూడా నవ్వుతారు.
నిజానికది మమ్మీ కాదు. మామీ(mommy). అయినా సరే అది మన సంస్కృతి కాదు. మీరు ఆంజనేయస్వామి గురించి రాసినవి మా పాపకి చదివి వినిపిస్తే ఉత్సాహంగా వింటుంది. ఆమె గారు హనుమజ్జయంతి రోజు స్వామి తీర్థ ప్రసాదాలు నేను సేవించాక ఈ లోకంలోకి వచ్చింది మరి! ఈ సారి మా వూరు (NRPT)వెళ్ళినపుడు తప్ప్క వినుకొండ లోని ఆంజనేయ స్వామిని చూడాలి.
తెలుగుభాష గురించి మీ ఆందోళన అభినందనీయం. ఈ విషయంపై వాదోపవాదాలు నా టపాలో చూడండి.
http://saradaa.blogspot.com/2008/07/blog-post_07.html
నాకు తెలిసినవాళ్ల పిల్లలు అందర్నీ 'అంకుల్' అనో 'ఆంటీ' అంటేగానీ ఆ తల్లిదండ్రులొప్పుకోరు. అది మర్యాదివ్వటమట. ఆ పిల్లలు 'మమ్మీ, ముష్టి అంకులొచ్చాడు. బియ్యమెయ్యి' అనో, 'చాకలి ఆంటీ ఈ రోజు పన్లోకి రాటంలేదంట' అనో చెబుతుంటారు. ముష్టివాళ్లని, పని వాళ్లనీ గౌరవించొద్దని కాదుగానీ, ఆ పద ప్రయోగాలు వినటానికి వింతగా లేవూ!
నిజంగా మనం తెలుగు భాష గురించి అంత బాధపడక్కరలేదు. కాలానుగుణంగా మారితే ఉంటుంది, లేకపోతే సంస్కృతంలా పోతుంది. మీరు చర్చిస్తున్న సమస్య అమ్మానాన్నల్ని ‘మమ్మీడాడీ’ అనిపిలిచే లేక పిలిపించుకునే సంస్కృతి గురించనుకుంటా.
మా అబ్బాయి మాట్లాడేది హిందీలో అయినా నన్ను పిలిచేది ‘నాన్నా’ అనే. కానీ ఉత్తర భారతదేశలో ‘నానా’ అంటే తాతయ్య అని అర్థం. ఇక కలిసిన ప్రతివాళ్ళూ ‘తుమ్హారా ‘పాప’ కా నామ్ క్యహై?’ అంటే మొదట్లో అర్థం కానట్టు ముఖం పెట్టేవాడు. ఇప్పుడు ఈ తేడాలన్నీ మహచక్కగా తెలిస్తున్నాయి.
ఏ భాషలో నాన్ననీ అమ్మనీ పిలిచినా ప్రేమల్లో పెద్ద తేడా రాదు.దానికీ సంస్కృతికీ, భాషకూ పెద్ద లంకె ఉంది అనికూడా నాకు సందేహమే! ఉపయోగ్యమైన తెలుగు, జీవితంలో ఆస్వాదించదగ్గ తెలుగు లేనంత,రానంతకాలం ఈ భాష వలసలు తప్పవు.
Post a Comment