విబేధాలు బాపిన వి.అప్పాపురం వీరాంజనేయుడు.
>> Thursday, June 26, 2008
వి.అప్పాపురం నూజండ్ల మండలం లోని ఒక పెద్ద గ్రామం .ఇది అగ్రహారం . రాజా వెంకటాద్రి నాయుడు నరసింహ శాస్త్రి అనే బాలావుపాసకునికి మెచ్చి ఇచ్చిన అగ్రహారం. ఈగ్రామములో శివ,చెన్నకేశవ ఆలయాలున్నాయి. గ్రామము లో 90శాతంెడ్లు. అయితే పార్టీల రాజకీయాలవలన రెండు వర్గాలుగా చీలి వున్నారు. తరచుగా గొడవలు పడటం కేసులు పెట్టుకోవడం . నిరంతరం తగాదాలు. ఎన్నిక లప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలలో ఇది ఒకటిగా పోలీసులు గుర్తించడము,దీనిచరిత్ర. రిజర్వ్ బ్యాంక్ వుద్యోగి హైదరా బాదులో వుండే వెంకయ్యగారూ, సచివాలయములో వుద్యోగి విశ్వనాధం గారూ తదితరులు తమస్వంత గ్రామమయిన ఈవూరి బాగుకోసం చాలా ఖర్చుచేసి నాభిశిల ప్రతిష్ట కూడా చేసారు. అయితే ఈకార్యక్రమము లో కూడా పంతాలకు పోయి చెరిఒక రోజు వూరేగింపు, ఎవరి భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని అసలు వుద్దేశ్యాన్నే నీరుగార్చారు. ఆకార్యక్రమం లోకూడా వీళ్ళ శ్రద్ద కు తగ్గట్లు పొరపాట్లు జరిగాయి అదినేను చూడటానికి వెళ్ళి గమనించినా సభ్యత కాదుకనుక నోరు మూసుకున్నాను. నాభిసిల ప్రతిష్ట సమయమ్లో కుర్రవాళ్ళు పంతాలకుపోయి తీవ్ర వుద్రిక్తత ఏర్పడినా భగవంతుని దయవలన ఏ గొడవలు జరగ కుండా ముగిసింది.
ఇక ఈగ్రామములో నామిత్రులు చాలామందివున్నారు. వారిలో కొందరు సహపాఠులు కూడా. వారిలో ఒకరు మీరు సామూహిక హనుమదభిషేకాలు చేసిన వూరిలో నల్లా మంచి జరుగుతుందంటున్నారు. మావూరిలో కూడా చేపించవచ్చు కదా. అని అడిగారు. చూద్దామంటూ ఒక సంవత్సరం తరువాత ప్రయత్నం ప్రారంభించాను. గ్రామము లో ఒక వర్గానికి అల్లూరిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా , రెండవవర్గానికి నా క్లాస్ మేట్ పెద్ద ఈస్వర రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఇద్దరూ శాంత పరులే కానీ , కుర్రకారు వుద్రేకాలమూలంగా ఎవరి వర్గాన్ని వారు కాపాడు కోవటం కోసం వాళ్ళు చెప్పిన ట్ళల్లా వినక వీళ్ళకు తప్పడములేదు.
ముందుగా వీళ్ళిద్దరినీ కలసి మాట్లాడగా ఈ నిరంతర వత్తిడి, ఎవడు ఎప్పుడేమి చేస్తాడోననే ఆందోళన మాకూ బాధగానే వుంది స్వామి దయవలన మాగ్రామములో శాంతి ఏర్పడితే చాలని వాళ్ళు చెప్పారు. అయితే మే మెవరము ప్రయత్నించినా రెండవ వర్గము వారు దీనికి అంగీకరించరు అని తమ నిస్సహాయత వ్యక్తం చేసారు. మీమనసులో మంచి సంకల్పము వుంటే " అసాధ్యాలు సాధ్యం చేసే స్వామి ఆయనే చూసుకుంటాడు ,అని వారికి ధైర్యం చెప్పి. కార్యక్రమములోకి దించాను. మాపద్దతి ఇంతకు ముందే చెప్పాను కదా గ్రామములో అన్ని ఇళ్ళనుంచివా రి వారి శక్త్యాను సారం పూజాద్రవ్యాలు ఆకార్యక్రమానికి తేవాలి. ఇక గ్రామములోకి వెళ్ళాము అందరినీ పలకరిస్తూ కార్యక్రమం గురించి మాట్లాడుతూ వెళుతున్నాము . గొడవలకు రడీగా వుండే కుర్ర బ్యాచ్ మమ్మల్ని గమనిస్తూ వున్నారు . ఎవరినడిగినా చేస్తే మం చిదే చెయ్యండి అంటున్నారు గానీ చేద్దామన్న మాట రావటము లేదు. ఇకలాభం లేద నుకుని అక్కడవున్న డీలర్ని ఏమయ్యా ఈకార్యక్రమానికి నీవంతుగా ఏమితెస్తావు అని అడిగాను . ఏమి కావాలి అని అడిగాడు , లిస్ట్ చెప్పగానే పానకం పంచడానికి 1000 గ్లాసులు[దిస్పోజబుల్] వి ఇస్తా నన్నాడు. ఈలోపల అతని వర్గానికి చెందిన వాళ్ళు చేరారు ఈ కార్యక్రమం ఏలా చేస్తారు అనిప్రశ్నించారు. పక్కనే వున్న అల్లూరిరెడ్డి, ఈశ్వరరెడ్డి అందుకుని విషయం చెప్పారు అంతే వాదనకు దిగారు .కలిసి చేయడమేమిటి ? ఎవరికి వాళ్ళు చేద్దాం .లక్షరూపాయలు ఖర్చయినా సరే అంటూ . అలాకాదు గ్రామం కోసం ... అమూ సర్దబోయినా వాళ్ళమాటలు లెక్కచేయకుండా... అంటే ఎలక్షన్లప్పుడు ఎవరికి వారు కావాలా మీకు , మీరుచెప్పినట్ళల్లా వినాలా మేము అంటూ వాదన పెద్దది చేస్తున్నారు. వీళ్ళు మింగలేక కక్కలేక వీళ్ళను సముదాయించలేక బాధపడుతున్నారు. నాగొతు కొచెం పెద్దది లేండి, అగవయ్యా బోమాట్లాడారు, ఇందులో వాళ్ళ ప్రమేయమేమీ లేదు , మేము ఈకార్యక్రమం చేద్దామని వచ్చాము మిమ్మల్నడిగిన ట్లే వాళ్ళనూ అడుగుతున్నాను ఇష్టమయిన వాళ్ళు ఇవ్వండి లేకుంటే లేదు . మీ వూర్లో ఎవరూ రాకున్నా ఈ కార్యక్రమం ఆపను. రెండుబిందెలు నీళ్ళుతెచ్చయినా పురోహితులు మేము చేసి వెళతాము అంటూ గొంతుపెంచి వాళ్ళకంటే పెద్దగా వీరంగం వేస్తూ మాట్లాడేసరికి వాళ్ళుతగ్గారు .ఇక కాసేపు దీనిగురించి ఎక్కడెక్కడ ఎలా చేసాము అన్న విషయాలు మైకు సౌం డ్ లో 15 నిమిషాలు మాట్లాడాను. ఈ లోపల జనం ముఖ్యంగా ఆడవాళ్ళూ చేరారు . ఇక వాళ్ళనుండి స్పందన మొదలయింది. మాష్టరు గారు ,వాళ్ళవూరినించి వచ్చి చేస్తామంటంటే మీకేంది నెప్పి. వస్తేరాండి లేకుంటే లేదు. అంటూ నాకు సపోర్ట్ మొదలయింది పంతులుగారూ పాలబిల్లు వచ్చింది ఇవిగో డబ్బులు ,నాతరపున తమలపాకులు ఎన్ని కావాలో తేండి అని ఒక తల్లి ముందు కొచ్చింది . అలాకాదమ్మా ఎవరి వస్తువులు వాళ్ళే తలపై పెట్టుకుని ఆలయందగ్గరకు ఆరోజు తేవాలి అని వివరించాను. అలాగే చేస్తామంటూ వాళ్ళు వస్తువులు వాగ్దానం చేయటం ప్రవాహములా సాగుతున్నది . కావలసినవన్నీ ఒక్క వీధిలోనే అయిపోయాయి. అందుకని రక రకాల ప్రసాదాలు అదనపు పూజలకు కావలసిన సామానుల లిస్ట్ పెంచి చెప్పాము . వూరు వూరంతా చెబుతుండటముతోటి మన యూత్ కూడా ముందుకు వచ్చింది. మావూర్లో కార్యక్రమానికి మావస్తువులు లేకుండానా? మావికూడా రాసుకోండి అంటూ డంబముగా వాల్లు తెచ్చేవికూడా చెప్పారు. నిష్కల్మషమయినది గ్రామీన అంతరంగం నేటి రాజకీయాలు, పాశ్చాత్య సంస్క్రుతీ ప్రభావాలే వారి మనసులను కల్లోల పరచి కలుషితం చేస్తున్న సత్యం అక్కడ నాకు గోచరించింది. దిగ్విజయంగా ఈకార్యక్రమం జరిగేందుకు స్వామి చూపినలీల కు నేను నమస్కరించుకుని పూజ జరిపే తారీఖు వాళ్ళూ పాటించాలసిన నియమాలు తెలియజేసి వీడ్కో లుతీసుకుని బయలుదేరాను.
వూరు దాటుతుండగా వూరిచివర వున్న సుబ్బారావు అనే ఆగ్రామస్తుడు నాకు స్నేహితుడున్ను తమ ఇంట్ళోకి పిలచి ఏంటి దుర్గా ఈపనులు నువ్వు మా వూరికి కొరివి పెట్టే తట్లున్నావు . నీ అభిషేకాలప్పుడు బిందెలతో ఆడవాళ్ళూ వస్తారు ఆసమయములోనఏకొంగరి నా యాలో ఎవర్నో ఒకర్ని గిల్లుతాడు అక్కడే కర్రలు తీసుకుని తలలు పగలగొట్టు కుంటారు. అని నన్ను నానా రకాలుగా చెప్పి ఈకార్యక్రమం నుండి మరల్చాలని చూశాడు. కానీ అలా ఏమీ జరగదులేవయ్యా ,అంతామంచే జరుగుతుందని చెప్పి వచ్చేశాను.
కానీ ఇంటికి వచ్చి పనుకున్నా నిద్రపట్టడములేదు. లేనిపోనిది ఏదన్నా జరిగితే ఎలా? ఏమిటీ విషమ పరీక్ష స్వామీ అనుకుని నిద్రపోయాను. మీరునమ్మండి లేక నమ్మకపోండి. స్వప్నములో అప్పాపురం చెన్నకేశవ ఆలయములోవున్న ఆంజనేయస్వామి విగ్రహం నిలువెత్తుగా అభిషేకానంతరము చేసిన అలంకరణ అవే వస్త్రాలు ,అవే మాలలు తో కనబడి నేనున్నాగా నీకు భయమెందుకని అ న్నట్లు వినిపించింది.
కార్యక్రమం రోజు రానేవచ్చింది వాగ్దానము చేసినవాళ్ళు టెంట్లు వేశారు వస్తువులు తెచ్చారు. ప్రతి ఇంటినుంచి భార్యా భర్తలు తాము తెస్తామన్న పూజాద్రవ్యాలు ప్రసాదాలు తీసుకుని వస్తున్నారు. రుద్రసూక్త,మన్యుసూక్తములతో అభిషేకాలు సాగుతున్నాయి. గొడవలు చేసే పదిమంది కుర్రకారు రెండువర్గాలలోనివారు మాత్రం ఇంట్ళో వాళ్ళచేత తమ సామాగ్రి పంపించి, తాముమాత్రం గుడిప్రహరీ అవతల రోడ్డుమీదనిలుచుని గమనిస్తున్నారు తప్ప గుడిలోనికి రావటము లేదు. ఇదిగమనించి గ్రామ పెద్దలు మేము పలుసార్లు లోపలకు రమ్మని పిలిచినా వాళ్ళు తొం గిచూచి వెళుతున్నారే తప్ప లోపలకు రాలేదు. పాపం అల్లూరిరెడ్డి, ఈశ్వరరెడ్డీ మరికొందరు మాత్రం ఎక్కడ ఏగొడవ అవుతుందోనని కళ్ళల్లో వత్తులు వేసుకుని పరిసరాలు గమనిస్తున్నారు. అయి తే స్వామి అనుగ్రహంవలన కారుఅక్రమం అద్భుతముగా సాగింది. ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు ,తమ విబేధాలు మరచి ఆత్మీయతతో వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఒకరివి మరొకరికి పంచుకున్నారు. పండగవాతావరణముఏర్పడింది అరోజు. సాయంత్రం కొందరు పెద్దలు నాతో ఈతరములో మావూరిలో కలసి అందరమూ చేసిన కార్యక్రమ మిదే మాస్టర్ గారూ అని అన్నారు. మామిత్రులయితే ఆ గొడవ బ్యాచ్ లోపలకొచ్చాక ఎక్కడ గొడవవుతుందోనని భయ పడ్డాము,వాళ్ళనసలు లోపలకడుగు పెట్టకుండా స్వామి చూపిన లీల అద్భుతమని అన్నారు.
ఈకార్యక్రమానంతరం గ్రామములో అన్నీ కలసి కట్టుగా చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరి పార్టీ వాళ్ళదయినా గ్రామ విషయాలు మాత్రం వుమ్మడిగా చూసుకుంటున్నారు. ప్ర్తిసంవత్సరం అయ్యప్ప మాలలు వేసుకుంటున్న కుర్రకారు కలసి మెలసి దీక్షలు సాగిస్తున్నారు. ఈమధ్యే 10లక్షల రూపాయల ఖర్చుతో చెన్నకేశవాలయం పునర్నిర్మాణం జరిపి మొన్న మాఘమాసములో 6లక్షల తో ప్రతిష్టజరిపారు. నీనామ సంకీర్తనల్ జేసిన శుభముల్ బడయవే అనుకుంటూ వేట్ఱాయని అప్పాపుర వాసులు ప్రతికార్యక్రమానికి ముందు ఆయనకు పూజ జరిపి ప్రారంభించు కుంటున్నారు.
4 వ్యాఖ్యలు:
హనుమంతుని లీలలు చదివి నా మనస్సు భక్తి భావం తొ నిండిపొయుంధి.నమ్మిన వారిని కాపాడటం,వారు తలపెట్టిన కార్యాన్ని ఎలా పూర్తి చేయుంచాడొ మీ అనుభవాన్ని బట్టి తెలుస్తుంధి. చక్కగా వివరించారు.మీకు నా ధన్యవాదాలు. ఇది చదువుతున్నప్పుడే నాకు కూడా ఒక శుభవార్త వినిపించాడు ఆ ఆంజనేయుడు.
జై ఆంజనేయా
జై వీరాంజనేయ
జై ప్రసన్నాంజనేయ
--ఆదిత్య కొడూరి.
రెండుగా చీలిన ఊరిని కలిపిన మీకు నా ధన్యవాదములు.మీ వెంట సదా ఆ రామభక్తుడుండాడనే దానికి ఇదే నిదర్శనం.
ఆయన తలచుకున్నప్పుడు,మనలాంటివాళ్ళచేతకూడా అద్భుతాలు చేపిస్తాడు. అది ఆయనశక్తిమాత్రమే. మనం వస్తువులము మాత్రమే. వస్తువులకు ప్రత్యేకత ఏమీ వుండదు, వాటిని వుపయోగించేవారిలోతప్ప.
what about mekapadu school.
Post a Comment