భజన ఎందుకు?
>> Saturday, June 7, 2008
భగవదారాధనలో మన సంప్రదాయ0 లో భజనకు ప్రత్యేక స్థానముంది. రెండుచేతులు తడుతూ, నామాన్ని లేదా కీర్తనలను పాడుతూ భగవంతుని ఆరాధిస్తుండం మనపద్దతి. ఇందులో రెండులాభా లున్నాయి. ముందుగా భౌతికమైన మేలు చూద్దాం. రెండు అర చేతులు తగిలేటట్లు, 15 నిముషాలు పాటు తట్టడంవల్ల నాడీకణాలు ఉత్తేజితమౌతాయని, అంతస్స్రావ గ్రంధులు చైతన్య వంతంగా పనిచేసి శరీరం లో పలురుగ్మతలు నయమవుతాయని ఇటీవల వైద్యరంగములోపరిశోధకులు, నిరూపించారు.
ఇక ఆధ్యాత్మిక మార్గం లో చూద్దాం. ఒకచెట్టు మీద వాలి ఉన్న కాకులన్ని పెద్దగాచప్పట్లు కొడితే యెగిరి వెల్లిపోతాయి. అదే విధంగా భగవన్నామస్మరణతో చప్పట్లు (భజన) చేయటం వల్ల మన శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న పాపాలన్నీ, లేచి ఎగిరి వెళ్ళి పోతాయి. యెటు చూసినా లాభమే.
చైనావారి ఆక్యుప్రెషర్ వైద్యం లో అరచేతిలో ఉన్న చానల్స్ పై సున్నితంగా వత్తిడి కలిగించడం ద్వారా పలు రోగాలు నయం చేస్తారు. ఇదీ అలానే ఫలితం చూపుతుంది. ఇక మొదలు పెడదామా!
0 వ్యాఖ్యలు:
Post a Comment