రక్షకుడైన రాక్షసాంతకుడు.
>> Saturday, June 14, 2008
నేను నూజండ్లకు ట్రాన్స్ఫర్ అయిన మొదటి రోజులవి అప్పటికి ఆగ్రామం రాజకీఈయ కక్షలతో రగులుతున్నది. ప్రధానముగా మూడుబలమయిన సామాజిక వర్గాల మధ్య బలహీన వర్గాలు నలిగిపోతున్నాయి. ఒకసారి బాంబింగ్ జరిగి ఒక వ్యక్తి మరణించాడు. ఈస్థితిలో గ్రామములో ఒకరిపట్ల ఒకరికి అంతర్గతంగా అనుమానాలు , ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేస్తారోనన్న అనుమానములమధ్య భయపడుతున్న రోజులు. ఒక రోజు అప్పాపురం రోడ్డులోనున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాను నేను అంతకు ముందెన్నడూ పరీక్షగా ఆగుడిని చూడలేదు. పలనాటి బ్రహ్మనాయుని కాలములో నిర్మించబడ్డ చెన్నకేశవ దేవాలయానికి ఎదురుగా వున్నఈ ఆలయానికి చెందిన 7 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎన్. ఎస్ పి కాలనీ మరియు ఎస్. టి. వర్గానికి చెందిన వారికి నగృహాణనిర్మించారు. వాళ్ళలోకొందరు స్వామి గుడిప్రక్కనే ఇతర మతానికి చెందిన ప్రార్ధనాలయంకట్టారు.రాళ్ళు రప్పలు దేవుడా అంటూ మైకులలో తమవిస్వాసాలను కించపరస్తూ ప్రసంగాలు చేస్తున్నా గ్రామములో అనైక్యతవల ఎవరూ పట్టించు కోవడము లేదు. ఐ తే విచిత్రముగా ఆకాలనీలో అకాల మరణాలు ప్రతి సంవత్సరం సంభ విస్తున్నాయి. అటువంటి పరిస్థితి . ఆమరుసటి రోజు నేను పీఠములో పూజ ముగించుకుని ధ్యానములో నున్నసమయములో నూజండ్లలో నున్న స్వామికి గ్రామ ప్రజలందరి చేత సామూహిక ముగా అభిషేకములు జరిపించాలని ప్రేరణ కలిగింది. నేను లేచి బయటకు వచ్చి చూడగా రోడ్డు మీద నూజండ్లకు చెందిన బట్టల వ్యాపారి సుబ్బారావు, తన సైకిలు పై వస్తూ నన్ను చూసి ఆగాడు. ఆయనకు నేను స్వామి వారికి మీవూరిలో అభిషేకా లు జరిపించాలని చెప్పాను. ఆయన మాస్టర్ గారూ ఈ కార్యక్రమమ్లో నావంతుగా ఏ సహాయం చేయమన్నా చేస్తానని చెప్పాడు. సరే సాయంత్రం మాట్లాడదామని చెప్పి స్కూలుకు వెళ్ళాను. అక్కడ ఆ గ్రామ పురోహితులు జన్నాభట్ల వుగ్రం , సుదర్సనం మరియు చెన్నకేశవాలయం పూజారి ఆచారిగారిని పిలచి విషయం వివరించాను. వాళ్ళు గ్రామమ్లో పరిస్థితి బాగలేదు. లేనిపోని తలనొప్పులు వస్థాయి. యెట్టి పరిస్థితిలో అందరూ కలసి రావటం జరగదని నిరాశగా చెబుతున్నారు. ఆసమయము లో మాహెడ్ మాస్టర్ వీరయ్యగారు మావద్దకు వచ్చి ఏవిటి విషయమని అడిగారు. మేము విషయము చెప్పగానే ఆయన అక్కడ పెరిగిన కంప కొట్టించి రెండు ట్రాక్టర్లు మట్టి తోలిస్తానని చెప్పారు. ఏరోజూ గుడికి వెళ్ళటం ,దేవుని పూజలపట్ల ఆసక్తి చూపించని వీరయ్యగారే స్పందించారంటే ఇదేదో స్వామి వారి లీలలాగే వున్నదని వాళ్ళు ఈకార్యక్రమం ఎన్ని ఆటంకాలొచ్చినా చేద్దామని అన్నారు. ఆసాయంత్రం మేము రామాలయం వద్దకు వెళ్ళి వైశ్య ప్రముఖులను పిలచి సంగతి తెలియజేసాము. వాళ్ళుకూడా ఆనందపడి, దీనికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి మొత్తం మేమే భరిస్తామన్నారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు .ఇది గ్రామము మొత్తం చేయవలసిన కార్యక్రమము అందరూ పాల్గొనాలి. మీవంతుగా కరెంట్ జనరేటర్ పెట్టించండి అని అడిగాము వాళ్ళు సరే అన్నారు. తరువాత మేము ఇంటింటికి తిరిగి వస్తుసేకరణ ప్రారంభించాము. అయితే ఒక కండిషన్ చెప్పాము మీ వస్తువులు మీరే తీసుకుని రావాలి వాళ్ళే వాటివినియోగములో పాల్గొనాలి. టెంట్లు, మైకు, కొబ్బరికాయలు తమలపాకులు,పానకాలు,వడపప్పు నిమ్మకాయలు, ఇలా వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. వస్త్రాలు తెస్తానన్న శ్రీనివాసరావు,అన్నా డబ్బులిస్తాను మీరు తెచ్చుకోండి వాటిని మీరు చెప్పినట్లు తలమీద పెట్టుకుని తేవాలంటే నాకు సిగ్గు అన్నాడు. ఐతే, మానుకోవయ్యా ఇంకెవరన్నా తెస్తారు, అన్నాము. వెంటనే అతను లేదు..లేదు నేనే తెస్తాను అన్నాడు. అలా అన్నీ అమరాయి. పాంప్లెట్లు ద్వారా మైకు ద్వారా ప్రచారం జరిగింది . అందరూ సిద్దమవుతున్నారు. కానీ ఏదో తెలియని నిశ్శబ్దం వున్నట్లుగా అనిపిస్తోంది. రేపు కార్యక్రమమనగా వీరయ్య చౌదరిగారు మట్టితోలించి నాపని చేశాను అని చెప్పారు. దానిని సరిచేయటానికెవరూ రాలేదు. ఒకపక్క పరిస్థితి అర్ధం కాక నాకు సహాయముగా వున్నవారు భయపడుతున్నారు ఎందుకంటే ప్రధాన నాయకులెవరూ ఈకార్యక్రమం పట్ల ఏ అభిప్రాయం చెప్పటమ్లేదు. వాళ్ళమనసులో ఏముందో తెలియదు.
ఇక లాభం లేదనుకుని పారతెప్పించి మట్టి సరిచేయటానికి తయారయ్యాను .అక్కడికి దగ్గరలోనే యోగయ్యస్వామి గుడివద్ద కూర్చున్నవాళ్ళు చూసి అరే మాస్టారు చేస్తున్నారు అంటూ వచ్చి తలా ఒక చేయి వేయటముతో ఆపని పూర్తయింది. మరుసటి రోజు వుదయం కార్యక్రమం మొదలయింది. 10 గంటలవరకు జనం అంతగా రాలేదు. అక్కడనుండి జనప్రవాహం మొదలయింది. వూర్లో పిల్లాదిమొదలు పాలు బిందెలతో నీళ్ళు తీసుకువచ్చి షేకించుకుంటున్నారు అర్చకులు రుద్ర సూక్త మంత్రాలతో ఆలయ ఆవరణ మార్మోగిపోతున్నది పక్కగ్రామాలనుంచి కూడా,భక్తులు రావటం మొదలయింది. మేము తయారుచేసివుంచిన 6000 రక్షలు పూర్తిగా అయిపోయాయి మధ్యాన్నం 3 గంటలవరకు జనం వస్తూనే వున్నారు. సాయంత్రం జరిగిన సంకీర్తనలో కూడా తమ మధ్య బేధాలన్నీ మరచిపాల్గొన్నారు. ఇక అక్కడనుండి ఆ ఆలయము లో అర్చనలు వైభవముగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము వందల సంఖ్యలో దీక్షలు తీసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే ఆతరువాత అంటే ఇప్పటికి 7సంవత్సరాలనుండి మరలా ఆవూరిలో రక్తపాతం జరగలేదు. ఎన్ని రాజకీయ విబేధాలున్నా గొడవలు జరగటము లేదుస్వామివారి లీలలు ఆగ్రామములో పాలపొంగులాగ సాగుతున్నాయి.అవి మరొకమారు చెప్పుకుందాం. ప్రస్తుతమా గ్రామము లోని మనుషులకు స్వామివారిరక్షణ సాగుతూ వున్నది . అది నిలుపుకోవటము మనశ్రధ్ధాసక్తులపై వుంటుంది.
2 వ్యాఖ్యలు:
చాలా ఆసక్తికరంగా ఉంది మీరు చెప్పిన విషయం. భగవంతుణ్ణి నమ్మడం అన్నది మన నమ్మకం మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఎక్కడో చదివిన గురుతు... భగవంతుడు, జ్యోతిషం, వాస్తు, వైద్యం విషయాలలో అసలు వాటికన్నా మన నమ్మకమే ఎక్కువగా పనిచేస్తుందని. బహుశా ఊళ్ళో అందరూ మ్రొక్కుకుని ఉంటారు, ఇక మీదట మళ్ళీ రక్తపాతం జరగకూడదని. మానవప్రయత్నానికి భగవత్కృప తోడైతే ఇదిగో ఇలాగే ఉంటుంది అని పునః నిరూపితమైంది.
ఇంతకీ ఏ జిల్లాలో ఉందండీ ఈ నూజండ్ల?
రాఘవగారూ! మీరుచెప్పినది నిజమని నేను అంగీకరిస్తానండి. ఆడుకుంటుంటే అమ్మకూడా మనలను గురించి పట్టించుకోదు.ఎప్పూడైతే అమ్మా అని ఆర్తితో పిలుస్తామో అప్పుడు పరుగు పరుగు న వచ్చి ఎత్తుకుంటుంది. అలాగే పరమాత్మ కూడా. లోకక్షేమము కోసము కోరే కోర్కెలు ఆయనకు మరింత ప్రి యము. అందుకే భక్తులు సామూహికముగా చేసే ప్రార్ధనలకు శక్తి ఎక్కువ. ఈ నూజండ్ల గుంటూరు జిల్లాలోని మండల కేంద్రము.
Post a Comment