గంగమ్మ ఒడిలో...శివయ్య పూజలో
>> Friday, August 16, 2024
గంగమ్మ పొంగి పొరలుతూ ఘాట్లపైదాకా ప్రవహిస్తున్నది. ఈరోజు శనిత్రయోదశి .చేతులారంగ శివుని పూజించుకోవాలి.. జనం అలజడి లేకుండా..ఎలా ? అని ఆలోచిస్తూ మానసేశ్వర ఘాట్ పైనుండి ప్రభాతాన్నే వెళ్లి చూస్తున్నాను. ఆహా అద్భుతం. చుట్టూ గంగమ్మ .మధ్యలో మంటపంలో కొలువై ఉన్న క్షేమేశ్వర స్వామి. పూజాద్రవ్యాలు తో మా పెద్దబ్బాయిని తీసుకువెళ్లి మంటపంలో కూర్చుని చూస్తే పైన పావురాల కుటుంబాలు. వాటిని అదిలించబోతే ...ఆయ్ ..ఇది మా తండ్రిఇల్లు ..నీవెవడ్రా. మమ్మల్ని పొమ్మనడానికి అన్నట్లు గోలచేసాయి. పడవలలో బెస్త వాళ్ళు వాటిని ఏమనొద్దని వారించారు.మనసులో లెంపలు వేసుకుని ...అభిషేకం మొదలు పెట్టాము. మధ్యలో ఈఘాట్ పర్యవేక్షకులైన బెస్తవారు మన తెలుగు పురోహితులవారిని వెంటనిడుకుని ప్రత్యేకంగా వారు చేసే పూజకోసం వచ్చారు.వారుకూడా పూజ మొదలెట్టారు. స్వామివారి ని చుట్టూఉన్న గంగమ్మ ప్రవాహాన్ని చూస్తూ అభిషేకం..అర్చన. ..హారతి...ఇంకేమి చెప్పగలను. గంగమ్మ పాంగులా...మనసు నిండిపోయిందలా....
0 వ్యాఖ్యలు:
Post a Comment