శ్రీవారి ప్రసాదంలో మహాపచారం .ఇప్పుడీ పాపం ఎవరికి చుట్టుకుంటుంది ?
>> Sunday, September 22, 2024
జరగకూడని మహాపచారం జరిగింది . కాదు జరుపబడింది. కలియుగ ప్రత్యక్షదైవం సన్నిధిలో అధికారం ,అహంకారం కలసి కొవ్వెక్కిన రాక్షస మూకలు జరిపిన ఈ అపచారం వలన లోకానికి ఉపద్రవం కలుగుతుంది. ఆది తథ్యం .ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అలజడులు ,ప్రక్రుతి విలయాలు ఇవన్నీ భగవత్ సన్నిధానంలో జరిగే అపచారాలమూలంగా ప్రక్రుతి శక్తులు కోపగించటం వలన కలుగుతున్న పరిణామాలే. లోకమంటే అందరం కదా .. మరి తప్పుచేసిన వాడికి కదా శిక్ష పడాలి కదా అని మనం అనవచ్చు . రాజుచేసిన పాపం రాజ్యానికంతటికీ వర్తిస్తుంది. ఇప్పుడు రాజునెన్నుకునేది ప్రజలే కనుక ఆపాపంలో ప్రజలందరికీ భాగం ఉంటుంది. ఇక సామాన్య భక్తుల మనుకునే మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ గుడికి వెళ్ళినా ఆదేవుని ు పట్ల మనకు నిజమైన భక్తి ఉన్నవాల్లమయితే అది మన తల్లీ తండ్రి స్థానంగా భావించాలి. అక్కడ ఏదైనా అపచారం జరుగుతున్నట్లు తెలిస్తే కనీస స్పందన తెలియజేయాలి. అక్కడ ఉన్న కంప్లైంట్ పుస్తకాలలో నైనా ఒకముక్క మన నిరసనను తెలియపరచాలి. ఎంతసేపటికీ మనదొడ్డి దారి దర్శనాలు బోడి గుండ్లు ,కొబ్బరికాయల వరకు మాత్రమే ఆలోచిస్తూ ఏదైనా అపచారం జరిగినట్లు తెలిసినా మనమేం చేస్తామండి.. అని తప్పుకోవచ్చు.కానీ కర్మదేవతలు వదలి పెట్టరు. మహాభారతయుద్దంలో దుష్టులతో పాటు మహానుభావులైనవారుకూడా శిక్షను అనుభవించాల్సి రావటానికి కారణం. తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని గొంతు ఎత్తకపోవటమే.దుర్మార్గానికి పాల్పడిక కారకుల వంశాలు నాశనమవుతాయి. నోరు మెదపకుండా చోద్యం చూస్తుంటే మనకూ శిక్ష లో భాగం పంచబడుతుమది సామూహికముగా ఉత్పాతాల రూపంలో . ఇక ఇప్పుడు మనలో ఇంకొక ప్రమాదకరమైన ధోరణి మొదలైంది. దీనికి రాజకీయాలు ఆపాదించి సమస్యను పలుచన చేయాలని చూడటం. కులగజ్జి ముదిరి దైవద్రోహం చేసినవాడు మనవాడైతే మౌనంవహిమ్చటం అనే ధోరణి పెరిగిపోయింది.ఈ బలహీనతలు రాక్షసమూకలకు అత్యుత్సాహాన్ని తెస్తున్నాయి. ఇక న్యాయస్థానాలు కూడా దేవాలయాలల్లో జరిగే అనాచారాలపై కేసులు వచ్చినప్పుడల్లా విచిత్రమైన తీర్పులను ఇస్తున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఇంత పెద్ద దుర్మార్గాన్ని తెలుసునున్న కోర్టులు సుమోటాగా కేసును స్వీకరించి న్యాయవిచారణకు ఆదేశించ వచ్చునే ? మనం కూడా ఒకార్డుముక్క పై ఈ అన్యాయానికి కారకులపై చర్య తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి గారికి ,ప్రధాన న్యాయాదిపతి గారికి పంపవచ్చు కదా ? ఏంం ఆపైనున్న వాళ్ళు చూసుకోవచ్చు కదా అని మిన్నకుంటే మనం భగవంతుని పట్ల నిజమైన భక్తిలేనివారమవుతాము . ఇదే నీ తల్లిదండ్రుల పట్ల జరిగిన అపచారమైతే ఇలానే మౌనం వహిస్తావా ? దేవదేవుని పట్ల నీకున్న భక్తి ఇదేనా ? ఈపాపం మనకు శాపమవ్వకుండా ఉండాలంటే ,లేచి నీను చేతనైన మార్గంలో నీపోరాటం చేయటమొక్కటే మార్గం .నిజమైన దోషులను తీవ్రంగా శిక్షించాలని మనసులో సంకల్పించి దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మాలు మనసునదలచి నీ ధర్మం నిర్వర్తించాలి .హైందవ సోదరసోదరీమణులందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను .కదలండి.ధర్మద్రోహుల పట్ల ఉగ్రనరసింహులవ్వండి
0 వ్యాఖ్యలు:
Post a Comment