2 వతేదీ ఆదివారం నాడు హనుమత్ రక్షా యాగం పూర్ణాహుతి కి ఇదే హృదయపూర్వక ఆహ్వానం
>> Friday, May 31, 2024
భగవద్ బంధూ
స్వామి అనుగ్రహంచే కొనసాగుతున్న హనుమత్ రక్షాయాగం పదహారవ ఆవృతి గా ఉగాదినాడు ప్రారంభింపబడి దేశ విదేశములలో ఉన్న భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణములు,రామనామ లేఖనములు కొనసాగింప బడుతున్నవి .వైశాఖ బహుళ దశమి ఒకటవ తేది న హనుమత్ జయంతి కార్యక్రమములు తో ప్రారంభింపబడి . ఆదివారం నాడు యజ్ఞం పూర్ణాహుతి , 108 కలశములతో స్వామివారికి విశేష అభిషేకములు జరుగుతాయి. . పీఠం లో కొలువై యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారికి, భవానీ సమేత రామలింగేశ్వర స్వామివారలకు కళ్యాణోత్సవము లు నిర్వహింపబడుతున్నవి . తదనంతరం స్వామివారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది . హనుమత్ రక్షలు ప్రసాదంగా ఇవ్వబడతాయి.
ఆపైన భక్తులచే లిఖిం పబడిన రామనామ లేఖన ప్రతులను అయోధ్య లో శ్రీరామ చంద్ర ప్రభువుల పాద సన్నిధికి చేర్చు కార్యక్రమము గూర్చి సంబంధిత తేదీలను ప్రకటించి ఆ కార్యక్రమముల వివరాలు తెలియ జేయుట జరుగుతుంది ..
ఈ కార్యక్రమములలో పాల్గొనవలసినదిగా మీ అందరినీ ఆహ్వానించు చున్నాము.
భక్తజన దాసుడు
దుర్గేశ్వర
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం
0 వ్యాఖ్యలు:
Post a Comment