నామస్మరణ ఎందుకు?
>> Tuesday, April 25, 2023
*👉ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు*🙏
👉 *ఒకటి మనశ్శాంతి.*🙏
👉 *రెండు సంతృప్తి.*🙏
👉 *ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.*🙏
👉 *సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు*🙏
👉 *కులదైవ(ఇలువేలుపు) నామ స్మరణ చేస్తే చాలు.ఆ వెలకట్టలేని రెండు సంపదలనూ ఇస్తాడు.*🙏
👉*ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి.*🙏
👉 *అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.* 🙏
👉ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని*
*మన మదిలో నిలుపుతాయి.*
*నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం.*🙏
*👉”బెల్లం బెల్లం”అంటే బెల్లం రుచి మనకు తెలియదు.తేనె తేనె” అంటే కూడా తేనె రుచి*
*మనకు తెలియదు.* 🙏
👉*బెల్లాన్ని కొరికి తినాలి.*
*తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి.అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.*🙏
👉 *దైవనామం, దైవం వేరు కాదు.*ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.ఇది అనుభవైకవేద్యం.*🙏
👉*నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు.*🙏
👉 *ఎంతకాలం నిరీక్షించాలి.* *ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం.*
*అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.*🙏
👉 *అక్కడే మనం నిలబడాలి.దైవం ఒక అనుభవం.*
*ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది.*🙏
👉*అందులో వేడి కనిపించకపోవచ్చు.*
*ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.* 🙏
👉*నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది.*🙏
👉 *నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది.ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.*🙏
👉*భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది.*🙏
👉*దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటారు.*🙏
👉 *పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి.* *మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు* *అందుకు సాధనయే తరుణోపాయం*,🙏
👉*పూజ కోసం సామగ్రి కొనాలి.*
*ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు అయితే కఠోర నియమాలుంటాయి.యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి.*🙏
👉*అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు.*🙏
👉 *ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు.*🙏
👉 *పనికి ముందు, పనిచేసుకుంటూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది.అందులోని దోషాలు హరించిపోతాయి.*🙏
👉*ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*🙏
👉*ఎవరి పేరు వాళ్లకు ఇష్టం.* *మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది.*🙏
👉*భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి.*🙏
👉 *దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.*
*సందేహమే లేదు.*🙏
👉 *నిరంతర భగవన్నామ స్మరణమేఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.*🙏
0 వ్యాఖ్యలు:
Post a Comment