శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రకంపనలు పుట్టిస్తున్న ది కేరళ స్టోరీ టీజర్

>> Tuesday, May 2, 2023

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న
 #ది_కేరళ_స్టోరీ సినిమా టీజర్ ( trailer) విడుదలైంది. 

ప్రకంపనలు సృష్టిస్తున్న #The_Kerala_ Story
టీజర్.

ఇది కేవలం సినిమా కాదు.. దేశంలో జరుగుతున్న దారుణాలపై కధనం. ఈ సినిమాకు ఆధారం ఏమిటి? దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? NIA నివేదికలో ఏముంది?ఈ అంశాలపై Nijam Today youtube channel వారి విశ్లేషణ క్రింద ఇచ్చిన వీడియోలో చూడండి.

సినిమా మే 5వ తేదీన దేశమంతా విడుదల అవుతోంది. తప్పక చూడండి.

అసలు ఈ సినిమా ఏంటి?

మతమార్పిడి చేయబడి I.S.I.S కి అక్రమ రవాణా చేయబడిన అనేక వేల మంది బాలికల దుస్థితి గురించి ఈ సినిమా కథ చెపుతుంది. దీనిని సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.

ఇదేదో ఊహాత్మక కథనంతో తీసిన సినిమా కాదు. ఈ సమస్య ఎంత ప్రమాదమో సాక్షాత్తూ కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత అచ్యుతానందన్ 2010లోనే ఒక మీటింగ్ లో ఈ #లవ్_జిహాద్ గురించి హెచ్చరించాడు.  ఈ మధ్య కాలం లోనే ప్రస్తుత కేరళ సిపిఎం  కూడా రాష్ట్రంలో కొన్ని శక్తులు ఆడవారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు అని ఆరోపిస్తూ కేరళలోని ఆడపిల్లలను హెచ్చరించింది.

అంతే కాదు, కేరళ చర్చ్ కూడా #లవ్_జీహాద్ ద్వారా మత మార్పిడి మరియు ఉగ్రవాద కోణం పై  క్రిష్టియన్ ఆడపిల్లలను హెచ్చరించింది.

కేరళ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయం పై మాట్లాడుతూ వేరే మతాల ఆడపిల్లలకు ISIS దగ్గర డిమాండ్ ఎక్కువగా వుండడానికి రెండు ముఖ్య కారణాలను చెప్పాడు.

1. కొత్తగా మతం మారిన వాళ్ళల్లో తీవ్ర మతతత్వ మానసికత ఎక్కువగా వుంటుంది, వీరికి ఇస్లాం గురించి పెద్దగా పరిచయం వుండదు కాబట్టి వారిని బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చడం ఐసిస్ వారికి సులువు.

2. స్త్రీలు అయితే వారిని సెక్స్ బానిసలుగా చేసి, పిల్లలను కనే యంత్రాలుగా మార్చి, వారి ద్వారా ఐసిస్ సభ్యుల సంఖ్య పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది అని చెప్పాడు.

ఆ అధికారి ఇంకా ఇలా చెప్పారు.

"అందుకే ఇక్కడ ఇతర మతాల ఆడపిల్లలను మతం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్తగా మతం మారడం వల్ల అందరినీ ఆకట్టుకోవాలనే అత్రం కొత్తగా మతం మారిన అమ్మాయిలకు వుంటుంది. అందుకని వారు చెప్పిన పనులును ఆలోచించకుండా చేసేస్తారు, ఒక సారి పూర్తిగా మునిగిపోయాక, ఇక ఆ ఊబి నుండి బయటకు రావడం కష్టం అని కొందరు అమ్మాయిలను  విచారించినపుడు బయట పడింది". అని అధికారి చెప్పారు 

అదీ కాక, ఒక సారి మతం మారి ఇళ్ళల్లోంచి బయటకు వచ్చిన ఆడపిల్లలు సహజంగా కుటుంబ, సంఘ బహిష్కరణకు గురి అవుతారు, అందుకే వారికి తిరిగి వెనక్కి వెళ్ళే దారులు ఉండవు కాబట్టి, శాశ్వతంగా తమ దగ్గర బానిసలుగా వుంటారు అని ఇతర మతాల ఆడపిల్లలు ఈ టార్గెట్ కి గురి అవుతున్నారు.

అనధికార లెక్కల ప్రకారం 2009 నుండి ఇప్పటి వరకు కేరళ నుండి హిందూ, క్రిష్టియన్ కుటుంబాలకు చెందిన సుమారు 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాం మతం లోకి మార్చబడ్డారు అని కథనాలు వున్నాయి.

ఈ #లవ్_జీహాద్ సమస్య ఒక కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా తరుచుగా పలు కేసులు వింటున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి ఎక్కువ వార్తలు స్థానిక పేపర్లలో వస్తున్నాయి.

ఈ "ది కేరళ స్టోరీ" సినిమా విడుదల తరువాత అయినా ప్రభుత్వాలు, స్వయంప్రకటిత ఉదార హిందూ మేధావులు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటారు అని ఆశిద్దాం.

....చాడా శాస్త్రి....

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP