శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కమలంలోనే జీవ రహస్యం

>> Monday, March 11, 2019

అనంతసాహితి: కమలంలోనే జీవరహస్యం ఉంది - శాస్త్రవేత్తలు!!!

పొద్దున్నే లేచి  దేవీ దేవతా పటాలకు నమస్కారం చేయని హిందువు ఉండడు. ప్రపంచం వ్యాప్తంగా అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలోని  దాదాపు 70 మంది శాస్త్రవేత్తలు కూడా భారత  దేవీ దేవతలను నిత్యం పరిశోధిస్తున్నారు. వారి చేతుల్లో ఎందుకు కమలాలు ఉన్నాయి? వారు కమలాసనం మీద ఎందుకు కూర్చున్నారు? అనే దాని మీదే వారి దృష్టి అంతా ఉంది.  దేవతల చేతుల్లోని కమలం మీద ఉంది. దేవీ ఆసనమైన కమలం మీద వారి దృష్టి ఉంది.

మన సంకుచిత స్వభావం గల నేతలకూ అంతర్జాతీయ పరిశోధకులకూ చాలా తేడా ఉంది. మన నేతలు హిందూ దేవతలకు నమస్కారం చేసినా హారతి ఇచ్చినా ఎన్ని ఓట్లు రాలతాయాని మనసులో లెక్కలు వేస్తారు. అంతేకానీ ఆ దేవత కరుణించాలని నమస్కారం చేయరు. కానీ ఆ శాస్ర్తవేత్తలు మన నేతల మాదిరి మానసిక వ్యభిచారం చేయడం లేదు. వారు సరాసరి పద్మాలనే చూస్తున్నారు. వాటి మీదే తమ పరిశోధన లగ్నం చేశారు. వారు సెక్యులర్ వ్యభిచారం చేయడం లేదు.  కనుకనే హిందువుల నిత్య ఆరాధనీయమైన కమలం రహస్యాలు కనుగొంటున్నారు. వారు ఇప్పటికే కమలంలోని రహస్యాలు ఎన్నో కనుగొన్నారు. వారి పరిశోధనలు పూర్తి అయితే కలియుగంలోని మానవుడు కూడా సత్యయుగం నాటి మానవుడి మాదిరి వార్థక్యం, రోగాలు లేకుండా వందల ఏళ్లు బ్రతికేస్తారు.

ఇంతకీ వారు చేస్తున్నది ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారు కమలపుష్పంలోని జన్యువుల చిట్టా రాస్తున్నారు. దీన్ని సీక్వెన్సింగ్ అంటారు. ఇప్పటికి కమలంలోని దాదాపు 87 శాతం జన్యువుల (అంటే దాదాపు 27 వేల జన్యువుల) చిట్టా తయారు చేశారు. వారి పరిశోధన మొత్తం మూడు దశల్లో ఉంటుంది. జన్యువుల చిట్టా రాయడం మొదటి దశ. త్వరలో జన్యుచిట్టా పూర్తి చేస్తున్నారు. సాంకేతికంగా నెలుంబో న్యూసిఫెరా అని పిలుస్తున్న కమల జాతి పుష్పం వారికి తవ్వేకొద్దీ సృష్టి రహస్యాలు తెలియచేస్తోంది.

ఆధ్యాత్మికతలో స్వచ్ఛతకు, దీర్ఘాయువుకు కమలాలు చిహ్నాలు. ముఖ్యంగా భారత దేశంలో పుష్పరాణి కమలం. ఇది హిందువులకు, భారతజన్యమైన బౌద్ధులకు కూడా కమలాలు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవి. వ్యవసాయంలో, ఆయుర్వేదంలో, సంప్రదాయంలో, వాణిజ్యంలో, పర్యాటకంలో కమలాలు ముఖ్యమైనవి. దాదాపు 7వేల ఏళ్లుగా పద్మాలను చెరువుల్లో సేద్యం చేసి ఆహారంగా స్వీకరించారని చరిత్ర చెబుతోంది.

భూమి మీద ఉన్న జీవ రాశిలో కమలం ఉభయ చరం వంటది. నీటిలో పుట్టిన ప్రాణికోటి తాబేలు మాదిరిగా ఉభయచరం అయి భూమి మీద ఎలా పెరిగి మానవ జీవపరిణామానికి దారి తీసిందో, అదే విధంగా వృక్షజాతి కూడా నీటిలోనే పుట్టి భూమిపై చెట్లుగా అవతరించింది అనే వారు కూడా లేకపోలేదు. ఆ విధంగా  వృక్షపరిణామ సిద్ధాంతంలో అతి ముఖ్యమైన ఉభయచరం పద్మాలు. ఇవి నీటిలో పుట్టి భూ వాతారణంలో పెరుగుతాయి.

కమలాలు భూమి మీద దాదాపు 14 కోట్ల సంవత్సరాల నుంచీ ఉన్నాయని రాక్షస బల్లుల పుట్టుక మరణం కూడా చూశాయని షెన్ మిల్లర్ అనే పరిశోధకులు నిగ్గు తేల్చారు. ఆయన తన విస్తృతమైన పరిశోధనల్లో భాగంగా 1996లో ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. చైనాలోని ఈశాన్యప్రాంతంలో ఒక చెరువులో తామర పూల గింజలు దొరికాయి. వీటిని చూసిన ఆయన మతిపోయి యురేఖా అని అరిచారు. ఎందుకంటే ఆ పద్మాల గింజల వయసు దాదాపు 1300 ఏళ్ళ పై మాటే. అంటే కలువ పూల గింజలు సుదీర్ఘమైన జీవిత కాలం కలిగి ఉంటాయని, ఇంత పెద్ద వయసు మరో జీవి గింజలకు అరుదుగా ఉంటుందని ఆయన కనుకొన్నారు.

చైనాలో ఆయన పరిశోధనలు చేసి అతి తేలిగ్గా 450 నుంచీ 500 ఏళ్ళ వయసు కలువ గింజలు చాలా కనుగొన్నారు. మిగిలిన వృక్షాలు, మొక్కల గింజలు 20 ఏళ్ళు జీవించడమే కష్టం అయితే తామర పూల గింజలు వేల ఏళ్ళు బ్రతికేయడం ఆయనను ఆశ్చర్యంలో ముంచేసింది.  దీంతో ఆయన కమలానికి ఉన్న దీర్ఘాయురహస్యంపై పరిశోధన మరింత లోతుగా చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కమలపుష్పం జీవరచన అయిన జన్యచిట్టా రాయడం మొదలు పెట్టారు.

ఇప్పటికి దాదాపు 27 వేల జన్యవులును గుర్తించారు. ఆయన తన పరిశోధనలో తొలి దశను త్వరలో పూర్తి చేయనున్నారు. కమలం జన్య రచన పూర్తి చేసిన తరువాత రెండో దశలో కమలానికి దీర్ఘాయుస్సు ఇస్తున్న జన్యువులను, నాశనం నుంచీ కాపాడుతున్న జన్యువులను గుర్తిస్తారు. మూడో దశలో కమలానికి దీర్ఘాయుస్సు ఇస్తున్న జన్యవులను పోలిన జన్యువులను మానవులలో గుర్తిస్తారు. దీని నుంచీ మానవుడికీ వేలాది ఏళ్ళు బ్రతికే శక్తి కలిగిస్తారు. (కనీసం వందల ఏళ్ళు గ్యారంటీ.) 

కమలాలు వెయ్యి ఏళ్ళు సునాయాసంగా బ్రతికేస్తాయట. ఇవి ఎటువంటి ప్రకృతి విపత్తులు ఏర్పడినా తమ జీవం కోల్పోవు. కనుకనే రాక్షసబల్లులు నాశనం అయినా ఇవి జీవించాయి. భయంకరమైన దుర్భిక్షాలు వచ్చినా, ప్రపంచం మంచులో గడ్డకట్టుకు పోయినా కమలం బ్రతుకుతుంది. ఈ దివ్యశక్తులు ఏ ఇతర వృక్షజాతికీ లేవని చెబుతున్నారు. తమ పరిశోధనలు విజయవంతం అయితే మనిషిని కూడా వేల ఏళ్లు బ్రతికించేస్తామని అంటున్నారు. జీవ రహస్యం కమలంలో ఉందని అంటున్నారు.

నిజానికి ప్రపంచానికి కమలం ప్రాముఖ్యత తెలియచెప్పింది హిందువులే. వేద పురాణ రామాయణ భారత భాగవతాల్లో కమలం గురించి ఉంది. పురాణాలలో మానవులు వేలాద

ి ఏళ్ళు జీవించారని కూడా ఉంది.

కమలాలను కేవలం అర్చించడానికే కాకుండా భారతీయ వంటకాల్లో నేటికీ ఉపయోగిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిలో తామర పూలను ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కమలంలో పనికిరాని భాగం లేదు. ఇది అనేక రకాల రక్తస్రావాలను అరికడుతుంది. ముక్కునుంచీ కారే రక్తాన్ని అరికడుతుంది. అసాధారణ రుతుస్రావం వంటివి కూడా కమలాలు అరికడతాయి. మానసిక వత్తిడి పోగొడతాయి. భ్రాంతులు పోగొడతాయి.

చర్మం పగిలిపోతే చికిత్స చేస్తాయి. చర్మం మండుతుంటే అదుపుచేస్తాయి. చక్కెర వ్యాథుల వంటి వాటిలో వచ్చే విపరీత దాహాన్ని అదుపు చేస్తాయి. కొన్ని రకాల విషాల దుష్పరిణామాలు కలుగకుండా నివారిస్తాయి.

ఒక్కో రంగు కలువలకు ఒక్కో రకమైన ఆయుర్వేద శక్తులు ఉన్నాయి. కమలాల గింజలు వలన గర్భధారణ సమస్యలు తొలగుతాయి. రక్తహీనతలు తొలగుతాయి.

కింజల్కవసన అని పూర్వం కవులు వాడారు అంటే తామర తూడుల  నారతో తయారు చేసి బట్టలు శ్రీకృష్ణుడు ధరించాడని అర్థం.

నేడు అనేక బ్యూటీషియన్లు కళ్ళ మీద దోసకాయ ముక్కలు పెడుతున్నారు. దీనికి ఆది ఆయుర్వేదంలో కమలాలలో ఉంది. పూర్వం శరీరానికి స్వేదనచికిత్స (బాగా చెమట పుట్టించే వైద్యం) చేసేటప్పుడు కళ్ళు గుండె మీద కమలాలు ఉంచేవారు. పూర్వం సైనస్ ( ముక్కులోని సంచులు) సర్జరీలు చేసే రుషులు తామర తూడులు ఉపయోగించేవారు.

చైనాలో గత 3000 ఏళ్ల నుంచీ మాత్రమే తామర పూల వ్యవసాయం ఉంది. అయితే భారతదేశంలో కోట్ల ఏళ్ల నుంచీ తామరపూల వ్యవసాయం ఉంది. దీని నుంచీ నేటికీ ఆహారపదార్థాలు కేరళ వంటి ప్రదేశాలలో తయారు చేస్తున్నారు. రాక్షసవాస్తు శిల్పి మయుడు కృత్రిమంగా రామాయణంలో సృష్టించిన అశోకవనంలో తామరపుష్పకొలనుల ప్రస్తావన ఉంది.

సెక్యులరిజం సేవలో మననేతలు తరిస్తూ ఉంటే, ప్రపంచం ఏ అద్భుత రహస్యం కనుగొన్నా అది భారతీయ హైందవంలో అత్యంత ఆరాధనా మార్గం కావడం గమనార్హం. భారతదేశాన్ని, హైందవాన్ని ‘‘పుర్ర -చేయి‘‘ నాకిస్తున్న నేతలు వర్ధిల్లాలి. వ్యభిచార సెక్యులరిజం వర్ధిల్లాలి. సంస్కృతభాషను నాశనం చేస్తున్న రాక్షసపాలకులు వర్థిల్లాలి.

కొసమెరుపు: దురదృష్టసమాచారం ఏమిటంటే భారతదేశంలోనే పుట్టిన అనేక రకాల కమలాలు అంతరించాయి. మిగిలినవి కూడా అంతర్ధాన దిశలో పరుగు తీస్తున్నాయి.

🙏🙏🙏
ఆనంతసాహితి.    వాట్సాఅప్ గ్రూప్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP