శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మృగంలా. మారుతున్నామా??????//

>> Thursday, November 15, 2018


*"రాబందును చూసి తన చేతిలో ఉన్న ముద్ద ఎక్కడ లాక్కుంటుందో అన్న భయంతో ఆ చిన్నారి దోసెటని ఒంటికింద దాచుకుంది. కానీ.. రాబందు అసలు వేట.. బక్కపలచగా మారి ఏ క్షణాన్నయినా చనిపోతుందని ఎదురు చూసిన ఆ చిన్నారే అని ఆ పసిప్రాణానికి కూడా తెలియదు."*

♻ "ది వల్చర్ & ది లిటిల్ గర్ల్" పేరుతో 1993 మార్చి 26న న్యూయార్క్ టైమ్స్ పత్రిక.. సుడాన్ కరువు పై కథనం ప్రచురించింది.

*ఈ ఫొటో యావత్ ప్రపంచాన్ని కలచివేసింది.*
👉 అప్పుడప్పుడే ఇంటర్నెట్ అడుగుపెడుతున్న రోజులైనా కూడా.. ఈ చిత్రం ఆ కథనం రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తం పాకాయి.
*ప్రతి మనిషితో కన్నీళ్ళు పెట్టించాయి.*

👉 *ఫొటోగ్రాఫర్లందరూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పిలిచే పులిట్జర్ (Pulitzer) ప్రైజ్.. 1993కు గానూ కెవిన్ ఫొటోకి దక్కింది.*

👉 అంతే.. 32 ఏళ్ళ కెవిన్ పేరు దశదిశలా‌ వ్యాపించింది. కెవిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని వేల ఉత్తరాలు, కానుకలూ వచ్చాయి. తీరిక దొరకనంత సత్కారాలు కెవిన్‌కు జరిగాయి.

♻ తర్వాత
ఏమైందో ఏమో..
*ఆ మరుసటి ఏడు 1994 జులై 27న కెవిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. (కెవిన్‌కు అప్పుడు 33 ఏళ్ళు)*

♻ *కారణం*
సన్నిహితులు, మిత్రులూ తెలిపిన కారణాలు ఇలా.

👉 "పులిట్జర్ అవార్డ్ వచ్చాక‌ కొన్ని రోజుల పాటు కెవిన్‌కు కొన్ని వందల ఉత్తరాలూ, కానుకలూ వచ్చాయి. కెవిన్ కూడా అభినందన సభలంటూ బిజీబిజీగా తిరిగాడు.

👉 *రెండు నెలల తర్వాత కెవిన్‌కు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వ్యక్తి, ఆ పాపకు తర్వాత ఏమైంది అని అడిగాడు. ఫ్లయిట్ టైం అయిపోతుండటంతో తను అత్యవసరంగా బయల్దేరి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత పాపకేమైందో తెలియదు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న అవతలి వ్యక్తి.. ఆ క్షణంలో అక్కడ ఉన్న రాబందు ఒకటి కాదు, రెండూ అన్నాడట. ఒకటి చనిపోతే పాపని తినాలని‌ ఎదురు చూసిన రాబందు అయితే.. రెండోది చేతిలో కెమెరాపట్టుకుని కూర్చున్నది అంటూ ఫోన్ పెట్టేశాడు.*

👉 అప్పటినుంచి కెవిన్‌లో మార్పు మొదలైంది. కొన్నిరోజుల తర్వాత కెవిన్ జనంతో మాట్లాడటం, కనిపించడం తగ్గించేశాడు. చాలా అంతర్మధనానికి లోనయ్యాడు.
*తను తప్పు చేశానా అంటూ కుమిలిపోయాడు. మేము కూడా ఓదార్చడానికి ప్రయత్నించాము కానీ తను మారలేదు" అని చెప్పారు.*

👉 ఆ తర్వాత కెవిన్ తిరిగి సౌతాఫ్రికా వెళ్ళాడా? ఆ పాపకోసం కనుక్కున్నాడా? ఆ పాప ఏమైంది?
*నిజంగానే కెవిన్ అక్కడినుంచి వచ్చేశాక ఆ రాబందు పాపను తినేసిందా అనేది ఎవరికీ తెలియదు. ఒక్క కెవిన్‌కు తప్ప.*

👉 తను ఏం తెలుసుకున్నాడో, ఎంత కుమిలిపోయాడో.. తను చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఆడుకున్న పార్క్‌కు వెళ్ళి.. తన కార్ ఎగ్జాస్ట్ పైప్‌ని మూసెసి.. కారు అద్దాలు ఎక్కించుకుని, లాక్ చేసి.. ఇంజిన్ ఆన్ చేసి.. దాంతో కారు లోపల అబ్బిన కార్బన్ మానాక్సైడ్‌ను పీలుస్తూ చనిపోయాడు.

👉ఎంత బాధని అనుభవించి ఉంటే తను ఇంత ఘోరంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు.

🔺 *ఈ కథతో మనం గ్రహించాల్సిందేమిటి?*

🔺 *..ఈ క్షణంలో మనం కూడా కెవిన్‌లా తయారవుతున్నామేమో?*

🔺 *..మన చేతిలో కెమెరాలు, ఇంటర్నెట్ ఉంది కదా అని.. సాటి మనుషులను అర్ధం చేసుకోవడం మానేస్తున్నామా?*

🔺 *..ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న ఆతృతతో నిజానిజాలు గ్రహించకుండా నీలాపనిందలు వేస్తూ తిరుగుతున్నామా?*

🔺 *..దానివల్ల ఒకరికి నష్టమే జరుగుతుంది కానీ ఎటువంటి క్షేమం చేయదు.*

🔺 *మనిషి చనిపోతుంటే సెల్ఫీలు దిగుతున్న మనకూ కెవిన్‌కు తేడా లేదేమో?*

🔺 *..ఎవరో తమ అభిప్రాయాలను తమ పరిధిలో రాస్తున్నా, చెప్తున్నా.. విచక్షణ లేకుండా దాడికి దిగుతున్న మనకూ కెవిన్‌కూ తేడాలేదేమో?*

🔺 *అక్కడ కెవిన్ మరిచిందీ, ఇప్పుడు మనం విస్మరిస్తున్నదీ ఒకటే..... "మానవత్వం"*

👉 *ఓమృగాడా లోపలి మృగాన్ని చంపెయ్*

🙏🙏🙏

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP