కాటమరాజు క్షేత్రంలో గాయత్రి హోమము నిర్వహించటం జరిగింది
>> Thursday, August 2, 2018
ఒక మహాసంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టబడింది .
ఇక్కడ బుర్రిపాలెం ,పాతరెడ్డిపాలెం అనే గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఈగ్రామాలలో యాదవులు ఎక్కువ .వ్యవసాయంతోపాటు పశుపోషణ వీరి ప్రధానవృత్తి . గతంలో కాటమరాజు అనే చారిత్రకాపురుషుడు ప్రకాశం జిల్లాలోని గంగదొనకొండ కేంద్రంగా ఈప్రాంతాలను మునుమసిద్ది అనే రాజువద్ద గుత్తకుతీసుకుని పశువులమందల పోషించారని ప్రతీతి. ఆతరువాత వారిరువురు మధ్య విబేధాలు రావటం గొప్పయుద్ద్ధం జరిగి మహావీరులు నేలకొరగటం ఇవన్నీ చారిత్రకాంశాలు. ఆయన తమకులదైవమైన గంగమ్మ తల్లి శక్తిపీఠాన్ని గంగదొనకొండలో స్థాపించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిష్ఠలు అక్కడక్కడా జరిపారు. వాటిలో చాలా క్షేత్రాలు కాలగర్భంలో మరుగునపడిపోయాయి.
ఇకపోతే నేను మేకపాడు అనే గ్రామంలో పనిచేస్తున్నప్పుడు ఒకవిషయం గ్రామస్తులు చెప్పగావిన్నాను సమీప ప్ బీడుభూములలో బుర్రిపాళేనికి చెందిన ఒక వ్యక్తి వ్యవసాయం చేయదలచి అక్కడికంపచెట్లను ,చెత్తను అక్కడ తాటి చెట్లవైపు నెట్టి అక్కడ ఒక విగ్రహమున్నా లెక్కచేయక నిప్పుపెట్టాడట . దానితో విగ్రహం మంటలలో కాలినది. ఆ వ్యక్తికీ వీపంతా మంటలు పుట్టు తీవ్రవేదనను అనుభవించాడని బాధతో మంటా మంటా అంటూ ఆసుపత్రు లన్నీ తిరిగాడని చెప్పారు. అంత మహిమాన్వితమైన విగ్రహం ఏమిటో చూడాలని అను కున్నానుగాని ఎందుకో విలువలేదు ....కాదు కాదు ఆభగవత్ శక్తి దర్శనానికి అనుమతించలేదనుకుంటా. ... అలా గడచిపోయింది.
అప్పట్లో నేను గంగదొనకొండ ఒకసారివెళ్లినప్పుడు అక్కడ పూజారితో ఈవిషయమై ప్రస్తావించినప్పుడు పూర్వం అక్కడ కాటమరాజు స్థాపించిన క్షేత్రం ఒకటుండేదని చెప్పారు. మీరు రమ్మంటే నేనుకూడా వస్తానని చూద్దామని చెప్పాడు కానీ ....కుదరలేదు.
ఈమధ్య కాలంలో పశువులకాపరులద్వారా అక్కడొక విగ్రహం ఉన్నాడని తెలిసి గ్రామస్తులతో కలసి వెళ్లి చూస్తే .... అక్కడ తాళవృక్షముల నీడలో వేణువూదుకుంటూ చిద్విలాసంగా కన్నయ్య దర్శనమిచ్చాడు . పురాతనమైన వేణుగోపాల మూర్తి . అక్కడ గతంలో ఇంకొన్ని విగ్రహాలుండాలి అని వృద్ధులు చెప్పారుగాని కనపడలేదు.
ఇక ఇస్తలం ఒకప్పుడు దివ్య క్షేత్రమని కొంతమంది సాధకుల ద్వారా నిర్ధారణ చేసుకుని అక్కడ ఉన్న చిన్నపాటి కొండా కాటమరాజు క్షేత్రమని దాని ఆధారంగా ఎదో ఒక మహత్తర కార్యక్రమం జరగబోతున్నదని మనస్సుకు తోచినది. ఇరుగ్రామాల పెద్దలను కలిపి ముందుగా ఇక్కడ ఉన్న భగవత్ శక్తి ని జాగృతం చేసే కార్యక్రమాలు చేపడదామని సూచించాను .. వారు కూడా ముందుకు రావటంతో గాయత్రిపరివార్ సభ్యుడు కుందూరుపాలెం సాందీపని ఆశ్రమ స్థాపకుడు పేరి శాస్త్రి గారిని పిలిపించి నిన్న గురువారం గాయత్రి హోమం జరిపించాము. అదికూడా ఎప్పుడొచ్చేద్దాం లే అనుకుంటే హఠాత్తుగా కుదిరింది .అక్కడేమో బోరున గాలి వేసిన టెంట్ కూడా నిలబడేలా లేదు దీపారాధనలు నిలబడటం లేదు అయినా సరే పట్టుదలగా మీ అనుగ్రహముంటే అన్ని జరుగుతాయి స్వామీ అని స్వామికి అని చెప్పుకుని మొదలుపెట్టాము రెండుగ్రామాల నుండి పెద్దలంతా వఛ్చి ఈకార్యక్రమాన్ని నిర్వహించారు .ముందురోజువరకు భగభగ లాడుతున్న సూర్యభగవానుడు ఈరోజు కొద్దిగా తనవేడి ని తగ్గించారు. యజ్ఞం యొక్క ప్రాధాన్యత తెలిపి మొదలుపెట్టగానే హఠాత్తుగా ఒక జల్లు చిలకరించినట్లుగా కురిసింది. ఈకార్యక్రమానికి స్వామి అనుజ్ఞ ఉన్నది అని నిర్ధారణ జరిగినట్లుగా భావించారు భక్తులంతా . యాగప్రసాదాలు తీసుకున్న తరువాత తదుపరి కార్యక్రమానికి రూపకల్పన చేద్దామని చెప్పుకుని గ్రామస్తులంతా ఇళ్లకే మరలారు .... ఇక చూడాలి కన్నయ్య ఏ లీలలు చేస్తాడో
0 వ్యాఖ్యలు:
Post a Comment