మీ గోత్రనామాలు పంపి హనుమత్ రక్షాయాగం త్రయోదశ ఆవృతిలో పాల్గొనండి
>> Monday, April 12, 2021
అనంత కాలగమనంలో సంవత్సరం ప్రారంభమవుతున్నది . కలిపురుషుని మహిమలు వెల్లువలై మనుషులను పతనదిశగా నడుపుతున్నవి. కాలములో భక్తులైనవారికి కూడా కష్టాలు తప్పవు. అయితే భగవత్ కృప ఈ కష్టాల సుడిగుండాలనుండి రక్షిస్తూ కలిమాయలనుండి కాపాడుతూ ఉంటుంది. అందులోనూ భక్తజనరక్షకుడైన హనుమత్ప్రభువుల ఆరాధన సులభతరమై మనలను తరింపజేసి శ్రీరామ పాదసన్నిధికి చేరుస్తుందనేది ఋషివాక్యము. పరమప్రమాణము. అనుగ్రహాన్ని చవిచూసే ఆత్యాత్మిక సాధనా మార్గంగా శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ఇప్పటివరకు పన్నెండు ఆవృతులుగా "హనుమత్ రక్షాయాగం " అనే క్రతువు జరుపబడినది. ప్రత్యక్షంగానూ పరోక్షం గానూ ఇందులో పాల్గొన్న వేలాదిమంది జీవితాలలో స్వామివారి కృప అద్భుతాలు చవిచూపినది. భౌతిక,సాంసారిక జీవితాలలో పలు కష్టనష్టాలను నివారించటమే గాక ఆథ్యాత్మిక మార్గంలో ను ఆటంకములు తొలగి సాధనాపరులకు స్వామి వారి కరుణను తోడై నడుపుతున్నది.
ఈ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినం మంగళవారం నుండి "త్రయోదశావృతిగా " హనుమత్ రక్షాయాగం ప్రారంభమవుతున్నది. . 54 రోజులపాటు పారాయణములు ,శ్రీరామనామ లేఖనములు జరిపి వైశాఖ బహుళ ఏకాదశి శనివారం నాడు నాడు పూర్ణాహుతి జరుపబడుతుంది. . ముందుగా మీ గోత్రనామాలు మెయిల్ ద్వారా లేదా వాట్సాఅప్ ద్వారా పీఠమునకు పంపాలి
ఎప్పటి వలెనే మీరు . మీ యొక్క సమస్యలను పరిష్కరించమని స్వామికి సంకల్పం చెప్పుకుని ప్రతిరోజూ నియమిత సంఖ్యలో అనగా మొదటిరోజు ఎంత సంఖ్యలో చేయాలనుకున్నారో చివరిరోజువరకు అదే సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణము చేయాలి. అలాగే స్వామి ప్రీతికొరకై శ్రీరామ నామ మును మీ శక్త్యాను సారం లిఖియించాలి.రోజువీలుకానివారైనా .శని లేదా మంగళవారములలో ఒక్కరోజైనా మీ సమీపంలో హనుమదాలయమునకు వెళ్లి ప్రదక్షిణలు చేయవలెను. ఇక నియమములు మీ మీ సంకల్పాలననుసరించి నిర్ణయించుకోవాలి. మీరు లిఖియించిన శ్రీరామ నామ లేఖన ప్రతులను హనుమాన్ చాలీసా జప సంఖ్యను పూర్ణాహుతి సమయానికి ప్రత్యక్షంగావఛ్చిగాని లేక మాకు చేరువిధంగా చూడాలి.
పూర్ణాహుతి హోమములో మీ అందరి తరపున సంకల్పం చెప్పి ఆహుతులివ్వబడతాయి. కోరినవారికి హనుమత్ రక్షలు ప్రసాదంగా పంపబడతాయి
ఇందుకొరకు స్వామి పట్ల భక్తిప్రపత్తులతో మీసాధన కొనసాగించుకొనుట హనుమత్ మహిమలను మరికొందరికి చెప్పి వారిని స్వామి రక్షణలోకి తెచ్చ్చుతమాత్రమే మేము దక్షిణగా కోరుతున్నాము.
మీ గోత్రనామములను పంపవలసిన చిరునామా .. cell
durgeswara@gmail.com
9948235641
మీ గోత్రనామాలు పంపి హనుమత్ రక్షాయాగం త్రయోదశ ఆవృతిలో పాల్గొనండి
0 వ్యాఖ్యలు:
Post a Comment