శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సద్గురువును పూజించటం కాదు సేవించాలి

>> Sunday, February 18, 2018

"సద్గురువును మనం అనుసరించిన కొద్ది వారు అర్ధమౌతారు. మనకు  అర్ధమౌతున్న కొద్దీ వారు దగ్గరౌతారు. "

కేవలం గురువును స్తుతించటం,  భజనలు చేయటం,  మందిరాలను కట్టటం,  పూలదండలను తీసుకువెళ్ళి ఆయన మెడలో వేయటం కాదు.  ఇవన్నీ చేయటం  మనం ఆయనను అనుసరించటం క్రిందకు రావు. 
వారు చెప్పింది చేయటం,  వారి వద్ద వినయంగా ఉండటం  మాత్రమే వారిని మనం అనుసరించటమౌతుంది.  ఇది కాక కేవలం స్తోత్రపారయణలు చేయటం వంటివాటితో సరిపుచ్చుకోవటం కాలయాపనే అవుతుంది. 
రోజూ ఆయనవద్ద కూర్చున్నాము,  ఆయనతో మాట్లాడాము,  ఆయనవైపు చూస్తూకూర్చున్నాము కనుక మేము ఉధ్ధరించబడ్డాము.  అని ఎవరైనా భావిస్తే... మనకంటే ముందర వారి చెప్పులూ,  వారి వస్త్రాలు,  వారు వాడిన వస్తువులు మనకన్నాముందర ఉధ్ధరించబడినట్లె. 
ఎందుకంటే అవి నిరంతరం వారి సన్నిధిలో ఉంటాయి కనుక. ఇంకా  ఆవిషయానికే వస్తే వారి స్పర్శవలన వాటికి పవిత్రత వస్తుంది.  కానీ మనకదికూడా రాదు. కనుక సద్గురు మూర్తి దగ్గర వినయ విధేయతలతో వారి ఆదేశం ఏది వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగలిగే మనస్తత్వం మనకెప్పుడు కలుగుతుందో,  ఎప్పుడు స్థిరమౌతుందో అనాడే మనకు అర్హత వచ్చినట్లు.అలా గురువాక్యపాలన మాత్రమే నిజమైన గురు శుశ్రూష అవుతుంది...!
ఈ సందర్భంలో మహనీయులు శ్రీ రాఖాడీ బాబావారిని స్మరిద్దాము.  శ్రీ రాఖాడీ బాబాగారి గురించి మనలో కొందరికి తెలిసే ఉండవచ్చు.  వారు తమిళులు.  వారు దేవుని చూడాలన్న తీవ్రకాంక్షతో పదాహారు సంవత్సరాల ప్రాయంలో ఇంటినుండి వెళ్ళిపోయి,  అనేక తీర్ధక్షేత్రాలను సందర్శిస్తూ అన్వేషణ సాగించారు.  ఆఖరుకు సద్గురువు దోరకనిదే ఆధ్యాత్మిక ఉన్నతి లేదని తెలుసుకుని సద్గురువును వెతుకుతూ మహారాష్ట్రలోని గణేష్ పురి చేరారు.  అక్కడ భగవాన్ శ్రీ నిత్యానందులు ఉంటున్నారు.  రాఖాడీ బాబావారిని చూసిన భగవానులు హుమ్... ఏం కావాలి నీకు?  అని అడుగుతారు.  దానికి రాఖాడీ బాబావారు దేవుడిని చూడాలంటారు. 
దానికి భగవానులు అవునా... సరె ఇంతకూ నీకేమి వచ్చో...?  అని అడిగారు. 
దానికి రాఖాడి వారు " నాకు వంటచేయటం మాత్రమే వచ్చని బదులు ఇస్తారు " అలా అయితే మా అన్నదాన సంత్రంలో  అందరికీ వంట చేసిపెట్టుపో అన్నారు.  ఏ ఉపదేశంలేదు,  ఏ మంత్రమూ ఇవ్వలేదు,  రాఖాడీ వారు కూడా అవి ఆశించి రాలేదు.  కేవలం దేవుని చూడాలనే వచ్చారు. గురువు ఏమి చెబితే అది చేయటానికి సంసిధ్ధుడై  వచ్చారు. ఓకటి కాదు,  రెండు కాదు 12 సంవత్సరాల పాటు వంటచేయటం,  వడ్డించటం ఇదే సాధనగా చేస్తుండిపోయారు రాఖాడి వారు.  గురువు ఆదేశం వంటచేయమని,  శిష్యుని కర్తవ్యం వంటచేసిపెట్టమన్న గురువాక్యపాలన. అలా 12 సంవత్సరాలు గడిచాయి.  ఓరోజున భగవానులు అవునూ అప్పుడు ఓ అరవ కుర్రాడు వచ్చాడుకదా ఉన్నాడా?  మనదెబ్బకు పారిపోయాడా? అన్నారు.  ఉన్నాడు స్వామి అని భక్తులు చెప్పగా,  వాడిని పిలవండి అంటారు.  రాఖాడీ వారు చేతులుకట్టుకుని నిలబడ్డారు సవినయంగా.  సరె నీకు సమయం వచ్చింది రా వెళదాము అని భగవానులు బుజంమీద చేయి వేసి తీసుకువెళ్ళారు ఏ ఉపదేశమిచ్చారో తెలేదు.  అనంతరకాలంలో రాఖాడీ మహరాజ్ మహాసిధ్ధుడు అయినారు.  చూడండి రాఖాడీ మహనీయుని వంటి శిష్యుడు ఈరోజుల్లో ఉన్నారా?  రాఖాడీ మహనీయుడు చేసిందేమిటి ?  కేవలం గురువాక్యపాలన.  దానికి ఫలితంగా వారు ఏమి పోందారో వారి చరితము చెబుతూనే ఉన్నది.  అలాకాకుండా భగవానుల మెడలోదండలేసి,  భజనలు చేసి హారతులు ఇచ్చి వారు చెప్పినది చేయకుండా ఉన్నట్లుంటే ఈనాడు మనకు రాఖాడీమహరాజ్ ఉండకపోయేవారు.  భగవానులకు భజన బ్రుందాలు ఉండేవారు కానీ వారు అందరూ రాఖాడీ మహరాజ్ లు కాలేకపోయారు.  అందుకే ఎందరో మహనీయులకు భక్తులు దోరుకుతారుకానీ,  శిష్యులే దోరకరు.  భక్తులు వేరు శిష్యులు వేరు. మహనీయుల దేహం దేవాలయము,  వారికి సపర్యలు చేయటం వలన మనకర్మ నివ్రుత్తి జరుగుతుందని సేవలు చేయమంటారు పెద్దలు.  అంతేకానీ అవిమాత్రమే సద్గురువును  సేవించినట్లు  లేదా అనుసరించినట్లూ కాదు అని మనం తెలుసుకోలేక పోవటానికి కారణమేమంటే  సద్గురువును సేవించటము అనేదానిలో మనం స్తవాలకే పరిమితమై,  వాస్తవాలను  గ్రహించలేకపోవడమే.  రాఖాడీ మహరాజ్ గురువును అనుసరించారు.  ఫలితంగా భగవానులు అర్ధమైనారు,  అర్ధమైనకోద్దీ రాఖాడీ ఇంకా ఇంకా అనుసరించారు.  ఆఖరుకి గురుశిష్యులు ఏకమైపోయారు. 

సద్గురు చరణదాస.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP