శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సాయిబాబా గొడవ [face book ]

>> Friday, October 21, 2016

Gopireddy Srinivas Reddy చిత్రంని భాగస్వామ్యం చేసారు.
Gopireddy Srinivas Reddy   
Baba--- blacksheep.
అతను మంచి హోదాలో ఉన్న ఉద్యోగం చేస్తున్నాడు,ఆకర్షణీయమైన వేతనం వస్తున్నా ఎక్కడో అసంతృప్తి...ఒక బాబా ను ఆశ్రయించాడు..ఈ బాబా ఆ షిర్డీ సాయిబాబా గురించి ప్రవచిస్తుంటాడు...అడవైనా అయోధ్య,సీతమ్మ నడిచిందీ రాముడి వెంట అంటూ భర్తను అనుసరించిందా ధర్మపత్ని.. ఆశ్రమం చేరారు...బాబా అంతేవాసులయ్యారు....మూడంతస్తుల భవంతిలో ground floor లో దంపతులు...ఆ పైన బాబా....సేవలు చేస్తూ గడుపుతున్నారు...ఒకరోజు బాబాను కలవాలంటూ ఎవరో వచ్చారు...ఉండండి బాబాకు చెప్పి వస్తా అంటూ పైకెళ్లిందా ఇల్లాలు...లోపలి దృశ్యం చూసి షాక్ కు గురయ్యింది...బాబా గదిలో ఉన్న 40 inches LCD tv (అప్పటికింకా LED రాలేదు మరి)లో నీలిచిత్రం చూస్తూ స్వరతిలో ఉన్నాడు(భక్తాదులు మనోభావాలు గాయపరచుకోకండి...వీళ్ల వెదవ్వేషాలు మెజారిటీ మతం బాబాలవైతే పెద్దక్షరాల్లో మొదటి పేజీల్లో వస్తాయి...మైనారిటీ తీరని పిల్లలతో అసహజరతి చేసే మైనారిటీ మతగురువుల వార్తలు లోపలిపేజీల్లో బాక్స్ ఐటెంస్ గా వస్తాయి..అంతే తేడా)...ఆ ఇల్లాలు చూసింది ఆ బాబా కటపడింది...ఆ తర్వాత ఆవిడ కిందకు వచ్చి భర్తకు విషయం చెప్పింది...ఇక అక్కడ ఒక్క క్షణం ఉండకూడదని బయటకు వచ్చేసారు.
ఆయనో ప్రముఖ magazine editor..వారు అనువదించిన ఒక చిన్న పుస్తకానికి(నవల)అభిమానులు కోకొల్లలు...ఒకరోజు తీరుబాటు దొరికి మిత్రుల ఫోన్ నంబర్లున్న పుస్తకం చూస్తూ ఒక పాతమిత్రుడికి కాల్ చేసాడు...land line phone ను మిత్రుడి నాన్న తీసి వీరి గొంతు వినగానే బావురుమన్నాడు...విషయం ఏమంటే ప్రాణభయం తో వీరి మిత్రుడు దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు..మొత్తానికి వెదికి ఆ మిత్రున్ని కలుసుకున్నాడు..ఆ మిత్రుడు,భార్య మరెవరో కాదు మన భక్తాగ్రేసరులే...
ఆ రోజు బాబా వెద్దవేషాలు భార్యా,భర్త చూసారు..భర్త కెమెరాలో రికార్డ్ చేసాడని బాబా అనుమానం...వీళ్లను చంపాలని ఎన్నో ప్రయత్నాలు...
చివరికి మన ఎడిటర్ ఆ బాబా trust board members ను పిలిపించాడు....నగరంలోని ప్రముఖులు వాళ్లు...ఇక వీళ్లకూ బాబా వెకిలి వేషాలు తెలుసు కానీ ఆదాయం రుచి మరిగారు కదా..దొంగకుక్కల్లా పడున్నారు...చివరికి వారితో ఏడిటర్ బాబా వీళ్ల జోలికొస్తే ఆ cds బయట పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ బుకాయించాడు..ఇక మీవాళ్ల జోలికి రామంటూ ఆ పెద్దమనుషులు(?) వెళ్లిపోయారు....
------ఆ ఏడిటర్ స్వయంగా నాతో చెప్పిన యదార్థగాధ ఇది...ఆ బాబా పోస్టర్లు,హోఋడింగ్స్ bus stands,railway stations లో తెగ కనిపించేవి..ఆ తర్వాత ఈ బాబా చస్తే ఈయన సమాధీ షిర్డీ లో కట్టారంటూ ఆయన భక్త పరమాణువులు గొప్ప achievement లా చెప్పుకున్నారు..
-------------
ఈ బాబా ఒక్కడేనా?సాయిబాబా పేరుతో ఊరికో మాఫియా బాబాలు వెలిసారు..అసలా అసలు బాబా చెప్పిందేమో ఎవరికీ తెలియదు..అంతా కలిసి మహా అయితే 250 పేజీల జీవిత చరిత్ర పుస్తకం దొరుకుతుంది...అదేమన్నా భగవద్గీతలా అర్ధం కానీ సంస్కృతంలో ఉందా..టీకాతాత్పర్యాలు తెలుసుకోవడానికి!
సాయి ప్రవచనాలు అంటూ ప్రతి బేవార్సోడూ దుకాణం తెరవడమే...వాడొకడు ఏకంగా కొన్ని వందల తిక్క విషయాలతో పుస్తకం తెచ్చాడు...కళ్లుమూసుకుని పుస్తకం తెరిచి చూస్తే వచ్చిన విషయం జరుగుతుందట...
అసలీ మాఫియాకు మూల పురుషుడు ఆ ఎక్కిరాల అనుకుంటా...అదేదో సినిమాలో కొంపంతా ఉప్మాలు తిని బతికినట్టు వీళ్ల కొంపంతా ఇలాంటోళ్లే ఉన్నట్టున్నారు..ఒకాయన మాస్టర్ సీవీవి అంటాడు,మరొకాయన సాయిబాబా అంటాడు..ఇంకొకాయన IAS వెలగబెట్టి 1999 లో ప్రళయం అంటూ పుస్తకాలు రాసి సంపాదిస్తాడు..పాపం ప్రళయం రాకుండానే చచ్చి చచ్చాడు....
ఇంతకూ వీళ్లంతా కొంపలో వాళ్లనన్నా ఉద్దరించారో లేదో నాకు తెలియదు కానీ మా కర్నూల్లో ఇలాంటి శాల్తీ ఒకరున్నారు..ఎన్నో దీనజనోద్ధరణ కార్యక్రమాలు చేస్తుంటాడు...తమ్ముడు పాతికేళ్ల క్రితం తార్పుడు పనులు చేసేవాడు..ప్రస్తుతం మట్కా నడిపిస్తుంటాడు(భక్తాదులారా మళ్లీ గాయపరచుకోకండి...నాకెక్కడో బీరకాయపీచు చుట్టరికం ఉంది)....
-------------------------------------------------------------------------------------------
మన దేశం మతసహనానికి పుట్టిల్లని నా అభిప్రాయం...రామాయణ విషవృక్షం,ఇదండీ భారతం పుస్తకాలను spiritual books తో పాటూ ఉంచే నాలాంటోళ్లు కోకొల్లలు...ఆ మధ్య సాయిబాబా మీద నరసరావుపేట కు చెందిన ఒకాయన పుస్తకం రాస్తే దాడికి దిగారు...ఇప్పుడు ఈ ద్వారకా పీఠాధిపతి మీదా అసహనం ......
అవును.. బాబా ఒక ఫకీరులా చిరిగిన బట్టలతో కాలం వెళ్లదీసాడు...ఇప్పుడో..ఏ పల్లెకొంపలో చూసినా 50 లక్షల విలువకు తక్కువున్న ఆలయం కనిపించదు....
ఆయన నేను హిందువునో,ముస్లిం నో చూడమని బట్టలూడదీసినా చూసి చెప్పినోళ్లు లేరు...
అంతెందుకు అప్పట్లో అన్ని మతాల పూజా విధానం జరిగేదేమో కానీ ఇప్పుడంతా ఒకే మతం కబ్జా చేసారా అనిపిస్తుంది...
దీనికి ఉదాహరణ అమర్ అక్బర్ ఆంతోని సినిమాలో అక్బర్ షిర్డివాలే సాయి బాబా అంటూ పాడుతాడు....
సరే దైవం మానుష రూపేణా అంటారా...కానివ్వండి..మరి ఈ శంకరాచార్య అన్నదాన్లో తప్పేముంది?
బాబానే మీ దైవంగా భావిస్తే కొలవండి..కాదన్నదెవరు?
ఆలయం మెట్ల మీద గణేష ప్రతిమలు..ఒక మూలగా రామ,కృష్ణ ప్రతిమలెందుకు?
అంటే పాత దేవుళ్లకు కోపమొస్తుందనా? లేక ఆథ్యాత్మిక సూపర్ బజారా?
----------------------
సరేగానీ.. సాయి కోటి రాస్తూ,సాయిరాం అనే ప్రింట్ ఉన్న బట్టలేసి ఊర్లో సేవ చేస్తూ శ్రద్ద,సబూరి అనే చిలకపలుకులు పలికే భక్తులు ఇంట్లో ముసలి తల్లిదండ్రులు,అత్తమామల మీదా కొంచం దృష్టి పెడితే బాగుంటుందేమో.....
మాతృదేవోభవ నుంచి మనమంతా సినిమావరకూ...ఆబ్బా మేమెంత ఏడ్చామో అని చెప్పుకునే సున్నిత మనస్కులారా ఆ కన్నీళ్లు కొన్ని ఇంట్లో వాళ్లకోసం దాచారా లేదా?
ఆ ఇంగీషోడు ఏదో అన్నాడుగా...charity begins at home అని...కొంచం దాని సంగతీ చూడండి....
ఆడామగా తేడా కూడా చూడకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ "సాయి" అని పిలిచే మీకింత అసహనమెందుకు?ఎవరి అభిప్రాయం వాళ్లను చెప్పనివ్వండి.....

p.s-మనోభావాలు గాయపడుంటే unfriend,block options ఉన్నాయని మరవకండి.

2 వ్యాఖ్యలు:

శ్యామలీయం October 21, 2016 at 6:51 AM  

కొన్నేళ్ళ క్రిందట తిరుమలలో దర్శనం చేసుకున్న తరువాత మాకొక వింత అనుభవం ఎదురైనది. ఎవరో అథ్యాత్మికవిజ్ఞాగ్రంథాలు పంచుతున్నారు అదేదో వ్రతం అన్నట్లుగా మమ్మల్ని చూడగానే మాలో అందరి చేతుల్లోనూ అ గ్రంథాలు రెండింటినీ చేతుల్లో పెట్టారు. ఎవరో గోవిందరఘునాథులట ఆయన వ్రాసినపుస్తకానికి అనువాదం 800 పేజీలు పెద్దప్రింటు పుస్తకమూ మరొకటి ఎవరో రమణానంద మహర్షి అట ఆయన వ్రాసిన పుస్తకమూ అవి. తిరుమల కొండపై సాక్షాత్తూ శ్రీనివాసుడి సన్నిథిలో ఇలా మత ప్రచారం చేయవచ్చునా అన్నది ప్రశ్న. తమాషా ఏమిటంటే ఈ ప్రశ్న మాలో నా ఒక్కడికే మనస్సులో తోచింది కాని మిగిలిన అందరూ ఎంతో ఎంతో సంతోషించారు. అది గమనించినా గమనించకపోయినా నేను ఇతరులతో ఇలాంటి విషయాలలో చర్చించటం నిరుపయోగం అన్న కారణంగా ఏమీ ప్రశ్నించకుండా మిన్నకున్నాను.

ఈరోజున ఒక శంకరాచార్యపీఠాధిపతి నోరు తెరచి ప్రశ్నించారు. ఆయనపై కొందరు విరుచుకొని పడుతున్నారు. ఊహించినదే. కాని ఆదిశంకరాచార్యస్వాముల వారు కూడా ఇలా ఎవరిని పడితే వారిని దేవుడంటూ కొలవటం తగదని అనేక చిల్లర మతసంప్రదాయాలను ఖండించి నిలుపుదల చేసినవారే. ఆయనా ఇలాగో ఇంతకన్నా తీవ్రంగానో విమర్శలు ఎదుర్కొన్నవారేను. అతినిరాడంబరజీవి అయిన షిర్దీబాబాకు అత్యంతవైభవోపేతమైన మందిరాలూ ఆయన వజ్రవైఢూర్యాద్యాభరణాలూ స్వర్ణకిరీటాలూ వంటి ఆర్భాటాలు ఆయన్ను గౌరవించం క్రిందకు వస్తాయా? అజ్ఞానంతో అగూరవించటం క్రిందకు వస్తాయా అన్నది ఆలోచనీయం కాదా?

ఒక నానుడి ఉన్నది. గురువు చనిపోగా శిష్యుడు విలపించినాడు. ఇద్దరూ బోధను వ్యర్థపరచారు అని.
పరమ సత్యం!

Anonymous October 23, 2016 at 7:01 AM  

బాగా చెప్పారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP