శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాదనమస్కారాలు చేపించుకునేప్పుడు బానే ఉంటుంది... కర్మఫలాలు నెత్తినపడ్దప్పుడుంటుంది అసలుపండుగ

>> Wednesday, October 19, 2016

నమస్కారం

ఇది ఓ సాంప్రదాయం. ఇందులో అతిరహస్యమైన విషయాలు దాగున్నాయి. నమస్కారం చేయటం ద్వారా ఎదుటి వ్యక్తి మనస్సును ప్రభావితం చేసి వారినుండి మన వైపు శక్తి ప్రసరణజరిగేలా  చేస్తుంది. సహజంగా ప్రసన్నతతో కూడినవారినుండి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. అందుకే పెద్దలు నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారానికి గుర్తు అని   మనకు చెప్పి  మనశక్తి వృధాకాకుండా ఉండేలా కీలకమైన రహస్యాన్ని మనకు నేర్పారు.

ఇక పాదనమస్కారాలు . అతి శక్తిశాలురైన సాధకులకు,పెద్దలకు  నమస్కరించటం ద్వారా అంటే వారి పాదాలను తాకటం ద్వారా సహజంగా సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాలవలె నమస్కరింపబడేవారినుండి నమస్కరించేవారివైపు శక్తిప్రసరణ జరుగుతుంది.  అందువలన పీఠాధిపతులు సహితం అందరినీ పాదాలు తాకనివ్వరు.  ఇక్కడ మరొకవిషయమేమిటంటే   శక్తిప్రసరణద్వారా తమశక్తిని కోల్పోవటమే కాదు ఆ నమస్కరించేవారి చెడుకర్మలను కూడా తాము స్వీకరించవలసి వస్తుంది . త్యాగబుధ్ధిగలమహానుభావులు తమపాదాలను తాకనిచ్చినా తరువాత ప్రాయశ్చిత్త కర్మలద్వారా ,తమ సాధనలద్వారా ఆచెడు కర్మలను నిర్మూలించుకుంటారు.

ఇక ఎదుటివాడు  పాదనమస్కారాలు చేస్తుంటే అమాయకత్వంగా ఉప్పొంగిపోయేవారు కొందరుంటారు. ఇంకా కొందరికి తాము లోకాతీత జీవులమని భ్రమలుంటాయి. మన రాజకీయనాయకులలో ఇప్పుడున్న ఆథ్యాత్మిక  సమాజంలో  ఈబాపతు జనాన్ని ఎక్కువగా చూస్తుంటాము . . పాదనమస్కారాలు చేస్తుంటే విపరీత గర్వంతో స్వీకరించటం తామేదో దైవాంశ సంభూతులమని భావిస్తూ గంభీరంగా ఫోజులివ్వటం చూస్తుంటాము.
నాకు మా నాయనమ్మ గారు చిన్నప్పుడు చెప్పినమాటలు ,నేను పరిశీలనగా చూసి తెలుసుకున్న విషయం ఓ నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఎవరైతే   ఈ పాదనమస్కారాలకు పొంగిపోయి జనానికి అవకాశమిస్తున్నారో వాల్లు తరువాత కాలంలో నరకయాతనలననుభవిస్తున్నారు. 
మావూర్లో  ఓ అయ్యప్ప గురుస్వామి ఉన్నాడు. మంచివాడు అమాయకుడు . ఫోటో లన్నా పాదనమస్కారాలన్నా  ఒళ్లు ఉబ్బిపోతుంది. ఛాతీ విరుచుకుని నిలబడతాడు . అక్కడ  భజనల వద్ద మాలధారులేకాదు వచ్చినవాల్లంతా నమస్కారాలు చేస్తుంటే తన్మయత్వంతో తేలిపోతాడు.
ఏమయ్యా ! నీ కవసరమా ఇవన్నీ?  అన్నామనుకో ... ఇంతెత్తున లేస్తాడు. నువ్వు ఎవరినీ  నమస్కరించనీయవు..ఎవరికీ మాలలు వేయవు  , నీకు ఇదొక ఈర్ష్య అంటాడు. నీ  ఖర్మ అని వదిలేశా.
అతి శీఘ్రంగా అనారోగ్యం పాలయ్యాడు .ఇప్పుడు అల్లాడిపోతున్నాడు.

ఇక మన కు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నది ఓ జీవి.   పాదనమస్కారాలు ...అందుకుని ....అందుకుని ఆకర్మఫలితాలన్నీ నెత్తికెక్కి తొక్కుతుంటే హాస్పిటల్ లో పైపులు ముక్కుల్లోకి దూర్చి వైద్యం అందిస్తుంటే నరకయాతననుభవిస్తూ ..
అందుకే    జీవితమంతా మనం అప్రమత్తులమయి  ఉండాలి . అజాగ్రత్తతో అహంకరిస్తే  ఆఫలితాలు ఎక్కడికీపోవు మన నెత్తినే తిష్ఠ వేసుకుని  కాసుకుకూర్చుంటాయి సమయం కోసం.
సర్వేజనాః సుఖినో భవంతు

1 వ్యాఖ్యలు:

astrojoyd October 20, 2016 at 8:16 PM  

ఇక మన కు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నది ఓ జీవి. పాదనమస్కారాలు ...అందుకుని ....అందుకుని ఆకర్మఫలితాలన్నీ నెత్తికెక్కి తొక్కుతుంటే హాస్పిటల్ లో పైపులు ముక్కుల్లోకి దూర్చి వైద్యం అందిస్తుంటే నరకయాతననుభవిస్తూ ..
అందుకే జీవితమంతా మనం అప్రమత్తులమయి ఉండాలి . అజాగ్రత్తతో అహంకరిస్తే ఆఫలితాలు ఎక్కడికీపోవు మన నెత్తినే తిష్ఠ వేసుకుని కాసుకుకూర్చుంటాయి సమయం కోసం.

మాష్టారూ.. రాజకీయనాయకులకి చేసే పాద నమస్కారాలు భిన్నమైనవి.వారి పాదాలకు నమస్కారం చేస్తే వారి పాపం మనకి అంటుకొని,మన చేసిన ఆ బటాని గింజంత పుణ్యం వారిని చేరుతుంటుంది.అందుకే వారు ఏన్ని రోజులు ఆసుపత్రులలో ఉన్నా వీజీగా బయటకు రాగలరు.ఇది ధర్మ సూక్ష్మం.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP