శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీకమాసములో జరుగుతున్న మహాదేవుని అర్చనలకు మీ గోత్రనామాలు పంపండి.

>> Wednesday, October 26, 2016

శివకేశవులకు ప్రీతికరం కార్తీకం. మహాపుణ్యప్రదమైఅన ఈ కార్తీకంలో లోకమంతా ఆథ్యాత్మికవాతావరణం వెల్లివిరుస్తుంది.. జపతపాదులతో, అభిషేక అర్చనలతో  వైభవంగా సాగుతుంటాయి పూజలు. ఇక్కడ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో కార్తీకమాస సాధనశిబిరం అత్యంత భక్తిశ్రధ్ధలతో  సాగుతుంది.  బ్రాహ్మీముహూర్తసమయంనుండి భక్తులు పార్థివలింగాలను ఏర్పరచుకుని నియమనిష్ఠలతో పరమశివుణ్ణి అర్చించి ఆయన గుణగానములతో తరిస్తుంటారు.  లోపల మూలమూర్తికి పూజ జరుగేసమయంలోనే అదేప్రకారంగా ఇక్కడ భక్తులు స్వయంగా స్వామిని అర్చించుకుంటారు.   ఈసంవత్సరం కూడా ఈ సాధనాశిబిరం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 ఇక్కడకు  భగవంతుని పట్ల ప్రీతికలిగిన ఎవరైనా వచ్చి స్వయముగా ఈ పూజాధికములలో పాల్గొనవచ్చు.  వారందరికీ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించబడుతుంది .

 ఇక ఇక్కడకు స్వయముగా  రాలేనివారికోసం   వారిగోత్రనమాదులతో కార్తీక సోమవారము లందు పూజలు జరుపబడతాయి. భక్తులు వారి గోత్రనామాలను పంపవచ్చు.
గోత్రనామాలను పంపవలసిన  సంప్రదించవలసిన  చిరునామా
  durgeswara@gmail.com        cell      9948235641         
          


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP