శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీ పరమాచార్యులు ఉపదేశించిన మంత్రం

>> Monday, August 8, 2016

శ్రీ పరమాచార్యులు ఉపదేశించిన మంత్రం
ఆఫీసులో పని చేస్తున్న ఒక మహిళ పరమాచార్యులను దర్శించడం కొఱకు వచ్చింది. నేటి రోజుల్లో మహిళకు లోలోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులనూ, స్తోత్ర పఠనాదులనూ పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీలుగాలేదు అన్న తాపం ఆమెను దహించి వేస్తుoడేది.
పరమాచార్యుల మనసు కరిగే విధంగా ఈ విధంగా వేడుకొన్నది: “నేను పనికి వెళుతున్నాను. విరామ కాలం చాలా తక్కువగా వుంటున్నది. అంతేకాక మడి, ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి వీలుగావడం లేదు. పొడవైన స్తోత్రాలు, పారాయణాలు చేయడానికి వీలుపడటం లేదు. కానీ, యేదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక వుంటున్నది. మీరు అనుగ్రహించాలి.”
వెంటనే కరుణామూర్తియైన పరమాచార్యులు, ఆ మహిళయొక్క అంతర్భావనను, చింతనను అర్థం చేసుకొని, “చెప్పు” అని అన్నారు.
“హరి నారాయణ దురిత నివారణ
పరమానంద సదాశివ శంకర”
ఉపదేశాన్ని పొందిన ఆ మహిళామణి, మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా పరమాచార్యులకు నమస్కరించింది.
‘ఆచార అనుష్ఠానాలు లేని నీ వంటి దానికి మంత్రోపదేశ మెందుకు?’ అన్న కఠినమైన వాక్కులను యెదురుచూచి వచ్చిన ఆమె, అమూల్యమైన ఉపదేశంచే సంపూర్ణమైన తృప్తిని అనుభవించింది.
కానీ, ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించినది కాదు; మనoదరికీ కూడా!
--- వైఖానస కరుప్పూర్ శ్రీనివాస అయ్యర్, కాంచీపురం.
Inline image 1

Madhu Ankam

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP