శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆలయం సర్వశక్తుల సమీకృతం

>> Monday, March 21, 2016

ఆలయం సర్వశక్తుల సమీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆలయాలను ధర్శించటం వెనుక శాస్ర్తియ ప్రయోజనాలు వున్నాయి. చాలామంది తమ కోరికలు తీరటానికో లేక మానసిక ప్రశాంతత కోసమో, యింకేమైనా పుణ్యం వస్తుందనో వెళుతుంటారు. కానీ అసలు దేవాలయాలు నిర్మించటానికి కారణాలు తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. గుడి అనేది ఎపుడు ఎందుకు -అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? అనే విషయమై వేదాలు చెప్తున్న అంశాలు-
మన దేశంలో చిన్న పెద్ద అనేక వేల దేవాలయాలు వున్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థల మహాత్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ వుంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి వుంటుందో అలా భూమిలో సానుకూల శక్తి ప్రసరించే చోట ప్రసిద్ధ దేవాలయాలు వున్నాయి. అందుకే దేవాలయాలలో అడుగుపెట్టగానే తనువు, మనసూ ప్రశాంతత పొందుతాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగిరేకు) నిక్షిప్తం చేసి వుంచుతారు. రాగి లోహానికి భూమిలో వుండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం వుంటుంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్లి మూలవిరాట్టు వున్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు వున్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎపుడో ఒకసారి గుడికివెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో సానుకూల శక్తి చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
గర్భగుడి మూడు వైపులా మూసి వుండి ఒకవైపు మాత్రమే తెరిచి వుంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర సానుకూల శక్తి కేంద్రీకృతమై మరీ అధికంగా వుంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోగినదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తిగీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు కుంకుమలనుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో వుండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది. తీర్థంలో పచ్చ కర్పూరం, యాలుకలు, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికివెళ్లిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా వుత్సాహంగా వుండేందుకు తోడ్పడుతుంది. త్వరితంగా గ్రహించే శక్తివుంటుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి. తీర్థప్రసాదాలు యిస్తారు. అలా అన్నీ సానుకూల శక్తులు సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళటం దేవుని దర్శించటం, ప్రదక్షిణ చేయటం కాలక్షేపం కోసం కాదు. ఎన్నో శక్తి తరంగాలు మనలో ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. ఆలయ దర్శనం వెనుక దాగున్న రహస్యాలను తెలుసుకున్న అందరూ ప్రతినిత్యం దైవదర్శనం మనసుకు ప్రశాంతతను, మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా గుడికి వెళ్ళటం ఒక మంచి అలవాటుగా మార్చుకుంటే అంతా మంచే జరుగుతుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP