గురుపౌర్ణమి సందర్భంగా మనకందరకూ ఓ గొప్పకానుక
>> Friday, July 31, 2015
[మా మితృలొకరు గురుపౌర్ణమి సందర్భంగా పంపిన ఈకానుక మీఅందరికోసం]
సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురుపరంపరాం.....
"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
ఒక్క సారి ఆలోచించండి! మన గురుదేవులు వారు తెలుసుకొన్న
జ్ఞానాన్ని పరంపరంగా బోధిస్తూ వచ్చారు.అలా నిరాడంబరంగా అందించకపోతే
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన
రామాయణం, మహాభారతం,
భగవద్గీత, భాగవతాది, వేదాల చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోగలిగే వారమా ? అలా
వారు నిరాడంబరంగా తరువాతి తరాలకు చెప్పకపోతే మన భారత దేశ
పరిస్థితి
ఏమిటి? భారత దేశ గొప్పదనం అంతా మన గురువులలో వుంది. ప్రపంచం అంతా
సాంకేతికతలో గొప్పవారు అయితే, మన దేశానికి గొప్పదనము అంతా మన గురువుల వల్ల
వచ్చింది.
ఎవరైనా ఆద్యాత్మిక సాధన చేయాలంటే అది భారత దేశం, భారతదేశ గురువుల వల్లనే, భారతదేశ ఆద్యాత్మిక గ్రంధాల వల్లనే సాద్యం...
అటువంటి దేశములో జన్మించటం ఒక వరం, ఇంతటి ఖ్యాతిని అందించిన మన
గురువులను స్మరించుకోవటం మహాబాగ్యం. ఎందుకనగా మన గురువులు వారు
తెలుసుకొన్నది పరంపరంగా
పోకుండా కాపాడి అందిస్తూ వచ్చారు,
అటువంటి గురువులకు మనము ఏమి ఇవ్వగలం! ఒక్కసారి వారిని మనస్సులో తలచుకొని
వారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప!
భారతదేశానికి దేనివల్ల అయితే కీర్తి వచ్చిందో, మన గురువులు
పరంపరంగా అందిస్తూ వచ్చిన ఆ ఆద్యాత్మిక జ్ఞాన సంపదను పరిరక్షించి తరివాటి
తరాలకు ఉచితంగా అందిచే లక్ష్యంతో
భారత ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా(www.dli.gov.in ) ఎన్నో పెద్ద లైబ్రరీ ల నుంచి, యూనివర్సిటీల నుంచి సేకరించి ఒకచోటకు చేర్చి ఉచితంగా అందిస్తున్నారు.గురు పౌర్ణమి
సందర్బంగా
వ్యాస భగవానునుని ప్రేరణతో సాయి రామ్ ఉడతా భక్తిగా భారత ప్రభుత్వం
చేపట్టిన కార్యానికి మరింత ప్రచారం, సహాయం గా అత్యంత విలువైన మన
ఆద్యాత్మిక గ్రంధాలను సాధకులకు,
జిజ్ఞాసువులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని వ్యాస భగవానుని పుట్టిన రోజు అయిన గురు పౌర్ణమి సుదినమున అందిస్తున్నాము.
అదీగాక కొందరు సాధకులు, జిజ్ఞాసువులు తమ ఇంటర్నెట్ స్పీడ్ స్లో వల్ల సాయి రామ్ వెబ్ సైట్(http://www. sairealattitudemanagement.org) నుంచి డౌన్లోడ్ చేసుకోలేక పోతున్నామని,
అలాగే
ఇంటర్నెట్ అందుబాటులో లేదని, పుస్తకాలను పంపించమని కోరుతున్నారు.అటుమంటి
సాధకులకు,జిజ్ఞాసువులకు సహాయం చేయడం కన్నా ఇంకేమి కావాలి. ఇలా ఎంతో మంది
డౌన్లోడ్
చేసుకోవటం లో, చదువుకోవటం లో ఇబ్బంది పడుతున్నారని,
వారి కోసం ఈ ఉడతా భక్తి సేవను గురు పౌర్ణమి సందర్బంగా వ్యాస భగవానునుని
ప్రేరణతో ప్రారంభిస్తున్నాము.అలాగే ఈ గ్రంధాలను
ఆన్లైన్ ద్వారా
చదువుకోగలరు, డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికి, ఉన్నా
అంతగా స్పీడ్ లేని వారికి ఈ సేవ మరింత గా ఉపయోగ పడగలదని మనవి
చెసుకొంటున్నాము.
సనాతన ధర్మ సంబంద దాదాపు
3000+ ఆద్యాత్మిక గ్రంధాలను వివిధ వర్గాలుగా విభజించి, PDF రూపంలో పెన్
డ్రైవ్ ద్వారా ప్రస్తుతం అందిస్తున్నాము. సాధకులు, జిజ్ఞాసువులు,
ఆసక్తిపరులు
తమ అడ్రస్,ఫోన్ నెంబర్ తో సాయి రామ్ సేవక బృందాన్ని ఈ మెయిల్ కు(sairealattitudemgt@gmail. com) సంప్రదించగలరు. అనగా మేము పెన్ డ్రైవ్ ద్వారా గ్రంధాలను అడ్రస్ కు పంపిచగలం,
మీరు
కాపీ చేసుకొని, మరొక సాధకునికి, జిజ్ఞాసకులకు అందించగలరు లేదా తిరిగి మాకు
పెన్ డ్రైవ్ పంపించగలరు. ఒక్క సారి ఈ గ్రందాల పేర్లు చదవండి, ఈ గ్రంధాలు
ఎక్కడా లైబ్రరీ లలో కుడా
దొరకటం లేదు.అలాగే ఆయా గ్రంధాల లోగల
సారం చదివిడే అర్ధం చేసుకోగలరు, ఎంతో అమూల్యమైనవి అని!. అలాగే ఈ గ్రంధాలను
భారత ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా (www.dli.gov.in
లేక http://www.dli.ernet.in/ ద్వారా కూడా దిగుమతి, చదువుకోగలరు.
ఈ గోప్పదనమంతా మన ఆద్యాత్మిక సంపద అందరికి అందుబాటులో ఉండాలని
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసిన వారిది, అటువంటి మంచి సంకల్పం చేసిన
పెద్దలది, ఆ సంకల్పానికి సహాయం చేసిన
తిరుమల తిరుపతి దేవస్థానం,
మరి కొన్ని యూనివర్సిటీలు వారికే చెందుతుంది.సాయి రామ్ ఉడతా భక్తి గా వారు
చేసిన పనిని మరికొందరికి తెలియచేయస్తుంది, అంతేగాని మా గొప్పదనం ఏమి లేదు
అని
సవినయంగా తెలియచేసుకొంటున్నాము.ఎందుకంటే వారు డిజిటల్ లైబ్రరీ
స్థాపించకపోతే మేము సేవ చేయగలిగేవాళ్ళం కాదు! అలాగే ఉచితంగా మరికొందరు
మహానుభావులు, సాధకులు,జిజ్ఞాసువుల
కోసం తమ వెబ్ సైట్ ద్వారా తమకు
తగిన విదంగా కొన్ని గ్రంధాలను ఉచితంగా అందిస్తున్నారు. వీరి సేవకు సాయి
రామ్ సేవాక బృందం నమస్కారం ద్వారా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము.
భారత ప్రభుత్వపు డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా : www.dli.gov.in
DLI గురించి మరింత సమాచారం: https://en.wikipedia.org/wiki/ Digital_Library_of_India http://www.ulib.org/ conference/genpub/ balakrishnan.html
గమనిక: ఇది లాభార్జన దృష్టిలేని
ఆధ్యాత్మికపరమైన ఉచిత సేవ. ఎందుకంటే
అంతర్జాలం(ఇంటర్నెట్)లో ఎన్నో అనవసర సంబంద పుస్తకాలు ఉచితంగా
లభిస్తున్నాయి.అటువంటి
సమయంలో అఖండ ఆద్యాత్మిక జ్ఞాన సంపదను భారత ప్రభుత్వమే ఉచితంగా
అందిస్తున్నది అని తెలుసుకొని, ఈ సమాచారాన్ని సాధకులకు, జిజ్ఞాసువులకు
తెలియచెప్పాలనే,
అందించాలనే
ఆరాటమే తప్ప, మేము ఏమి ఆశించటం లేదు. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్)
లైసెన్సు/కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న
మరికొందరు ఉచిత
సేవా సంస్థల గ్రంధాలు కూడా సంగ్రహించి, DLI గ్రంధాల తో పాటు అందించటం జరిగింది. అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే
మమ్ములను మన్నిస్తూ, మాకు తెలియచేస్తే,
మేము సరిదిద్దుకోగలము అని సవినయంగా మీకు
విన్నవించుకొంటున్నాము. అలాగే ఈ గ్రంధాలను వ్యక్తిగత ఆద్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే వినియోగించగలరని
ప్రార్దిస్తున్నాము.
వ్యాపార, ప్రచురణార్ధం రచయిత, పుబ్లిషర్స్ ని సంప్రదించగలరు అని కోరుతున్నాము.
దయతో జతపరిచిన గురుపరంపర చిత్రం చూసి ఒకసారి గురువులను స్మరించుకోగలరు అని మనవి.
సాయి రామ్ సేకరించిన గురువుల సంబంద గ్రంధాలు ఈ లింక్ ద్వారా చదవగలరు/దిగుమతి చేసుకోగలరు:
చివరిగా మా సేవలో ఏమైనా లోపం,పొరపాటు వుంటే మన్నిస్తూ, మాకు తెలియచేయగలరని వేడుకొంటున్నాము.
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!!
సాయి రామ్ సమాచారం: https://www.facebook. com/SaiRealAttitudeManagement
సాయి రామ్ సేవక బృందాన్ని సంప్రదించుటకు: sairealattitudemgt@gmail.com
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
3 attachments — Scan and download all attachments View all images | |||
| |||
| |||
|
0 వ్యాఖ్యలు:
Post a Comment