రథసప్తమి పూజలకు మీగోత్రనామాలు పంపి ఆదిత్యహృదయం పారాయణములో పాల్గొనండి
>> Sunday, January 18, 2015
ఈనెల ఇరవై ఆరు న రథసప్తమి పర్వదినం .ఇరవైరెండు ఇరవైమూడు తేదీలలో శృంగేరీ జగద్గురుపీఠమునకు ఉత్తరాధికారి నియామకం జరుగుతున్నది. లోక కళ్యాణం కోసం ఆదిశంకరుల నెలకొల్పిన దక్షిణామ్నాయపీఠం లో జరిగే ఈకార్యక్రమం మనకందరకు శుభకార్యము.
ఇక ఆదిత్య హృదయం వాల్మీకిమహర్షిలోకానికి అందించిన దివ్యస్తోత్రము . యుధ్ధరంగంలో విజయంకోసం శ్రమిస్తున్న శ్రీరామచంద్రునకు అగస్త్యమహర్షిద్వారా ఉపదేశింపబడి రావణసంహారమునకు తోడ్పడిన మంత్రరాజమిది.
లోకంలో మనుషులు అనారోగ్యము, అశాంతి, చైతన్యరాహిత్యము, అపజయముల తో బాధపడుతున్నప్పుడు ఆదిత్యహృదయం పారాయణద్వారా శుభాలను పొందవచ్చని పెద్దలద్వారా తెలుపబడి అది నిరూపింబడుతూ ఉన్నది ఆనాటినుండి ఈనాటివరకు కూడా.
లోకకళ్యాణమును కాంక్షిస్తూ ఈనెల ఇరవై నుండి రథసప్తమి [౨౭] వరకు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ఆదిత్యహృదయం సామూహిక పారాయణం జరుపబడుతున్నది. రథసప్తమినాడు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి.
మీరు మీగోత్రనామాలను పంపి ఈకార్యక్రమంలో పాల్గొనవచ్చు.
సూర్యోదయత్పూర్వమే నిదురలేచి స్నాదికములు పూర్తి చేసుకుని సూర్యోదయసమయంలో ఆదిత్యహ్రుదయమును నియమబధ్ధంగా పారాయణచేసి మూడుమార్లు ఆర్ఘ్యప్రదానం చేయాలి.
ఉపనయ సంస్కారములు కలవారు గాయత్రి జపము చేయాలి.
మీపారాయణసంఖ్యను చివరిరోజు మాకు మెయిల్ ద్వారా పంపాలి.
ఆరోజు మీగోత్రనామాలతో కూడా అర్చనలు జరుపబడతాయి. అందుకుగాను మీరు తప్పనిసరిగా ఆదిత్యహృదయం పారాయణము చేయాలి .
గోత్రనామములను
durgeswara@gmail.com నకు పంపగలరు.
ఉపనయ సంస్కారములు కలవారు గాయత్రి జపము చేయాలి.
మీపారాయణసంఖ్యను చివరిరోజు మాకు మెయిల్ ద్వారా పంపాలి.
ఆరోజు మీగోత్రనామాలతో కూడా అర్చనలు జరుపబడతాయి. అందుకుగాను మీరు తప్పనిసరిగా ఆదిత్యహృదయం పారాయణము చేయాలి .
గోత్రనామములను
durgeswara@gmail.com నకు పంపగలరు.
ఆదిత్య హృదయం
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ | జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోzదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః | ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోzస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ |
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోzభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాzగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోzభవత్తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోzభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||
1 వ్యాఖ్యలు:
ఆదిత్య హృదయం, video record చేసే youtube లో పెట్టి దాన్ని ఇక్కడ చేర్చండి
Post a Comment