కార్తీకమాస ముగింపు సందర్భంగా అమావాస్య [శనివారం]నాడుసాగిన విశేషార్చనలు .
>> Sunday, November 23, 2014
పరమపవిత్రమైన కార్తీక మాసం మొత్తం పీఠంలో సాధనా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. శనివారం [అమావాస్య] రోజున విశేష అర్చనలు చేశారు భక్తులు. ప్రభాతకాలం లో మొదలైన ఏకాధశ రుద్రాభిషేకం,ఆతదుపరి సహస్ర లింగార్చన కన్నులపండుగగా సాగాయి. పరమశివుని గుణగానం చేస్తూ భక్తులు సాగించిన అర్చనలతో ప్రకృతి పులకించిపోయింది. ఆపైన రుద్రహోమం పూర్ణాహుతి నిర్వహించబడింది . పూజ ,జపం,తర్పణం,హోమం,అన్నదానం చేయాలనే విధిక్రమానుసారం ఈ ముప్పైరోజులు పార్ధివలింగార్చన సాగిస్తున్న సాధకులంతా అన్నదానం కూడా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న దీక్షాధారులందరినీ ఆహ్వానించి అన్నపూర్ణ భిక్షాశాలలో అమ్మవారి అన్నప్రసాదాన్ని వడ్డించారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment