సంస్కారం నేర్పలేని తల్లిదండ్రులవల్ల ఇలాంటి ఒళ్ళు కొవ్వెక్కిన నీఛులైన పిల్లలు తయారవుతారు ...
>> Sunday, August 24, 2014
ఎంత అపచారం? ఒళ్ళు కొవ్వెక్కి ఉఛ్చనీచాలు తెలియని ఇలాంటి పిల్లలు తయారవ్వటానికి కారణం ఎవరు?
అంతర్జాలంలో ఈచిత్రంచూసి గుండెమండి వ్రాస్తున్నాను. సంస్కారహీనులైన పిల్లలవల్ల జాతి ఎలాదిగజారిపోతుందో మనలో ఓ చర్చజరగటానికి దీన్నిక్కడుంచాను ,త్వరలో తొలిగిస్తాను.
క్షమించు తండ్రీ..నందికేశ...
11 వ్యాఖ్యలు:
ఇలాంటి వాళ్ళ వల్లే హిందువులను ఆక్షేపిస్తున్నారు అనుక్షణం
అసలా ఫోటొ నిజమోకాదో (ఫోటోషాపో) మీకు తెలియదు. ఒకవేళ ఫోటోషాపుకాదనుకున్నా అసలా అమ్మాయికి మీనమ్మకాలతో కనీసం పరిచయమైనా ఉందో లేదో తెలియదు. మీ అభిప్రాయాలప్రకారం అలా చేయడం తప్పని ఆ అమ్మాయికి తెలుసని మీరెలా ఒక నిర్ధారణకు వచ్చేసారు? ఏకంగా 'నీచం' అన్నమాట వాడేశారు?
మీ 'సంస్కారాధిక్యత'నూ, పటాటోపాన్నీ ప్రదర్శించుకోడానికి నీచులూ, సంస్కారహీనులంటూ ఏదో రాశారు. మీరు చేసిన పని libel అవుతుందనీ, అదొక నేరమనీ మీకు తెలుసా? మీరు చేసిన ఏదైనా ఒకపని ఇంకొకరి విశ్వాసాలను గాయపరిస్తే, అప్పుడు వారు మీపై ఇదేవిధంగా నోరుచేసుకుంటే మీరెలా ఫీలవుతారు? విశ్వాసాలకన్నా మనుషులు ముఖ్యం. మనుషులపై ఇలా నోరుచేసుకోవడమ్మాత్రం సంస్కారమా?
అంటే నమ్మకాలతో పరిచయం లేకుంటే నమ్మనవసరం లెదుకాని కోట్లాదిమంది నమ్మకాన్ని ఇలావమానించటం సంస్కారం కాదు.
ఇతరులవిశ్వాసాలను గాయపరచటం వలన వీరు సమాజధూషణకుధూషణకు గురవుతామన్న విషయం తెలియని పసిపిల్లలు కాదు.
ఇంతకీ మీబాధ ఇదికాదు. ఇదే అవమానం ఇంకొక మతవిశ్వాసపట్లజరిగుంటే మీ స్పందన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నా విశ్వాసానికిఘాతం జరిగినప్పుడు నేను స్పందిమ్చాల్సిందే
ఇక రేపెవరన్నా మన జాతీయజెండాకు అవమానంజరిగేలాప్రవర్తిస్తే ,దాన్నికూడా మీరు ఈవిధంగానే సమర్ధిమ్చగల మేధావులు అనితెలుస్తుంది మీవాదన ద్వారా. దేశభక్తి మికుంటే ఇతరులకుండాలని రూలేమిటి అని మీరు ప్రశ్నించనైనాగలరు , మీవాదన ఆధోరణిలోసాగుతుంది,
*నిజమోకాదో (ఫోటోషాపో) మీకు తెలియదు*
@Iconoclast ,
ఆయన బ్లాగులో ఆయన రాసుకొంటే మీకేమి? మీరు నిజనిర్ధారణ కమిటి వేసి ఆ పోటో పోటొషాప్ ను ఉపయోగించి చేశారని, అబద్దమని నిరూపిస్తూ, ఇక్కడ కొచ్చి దుర్గేశ్వర రావుగారిని విమర్శిస్తే బాగుండేది. అప్పుడు కూడా దుర్గేశ్వర రావు గారు మొండిగా వ్యవహరిస్తే, మీరు చెప్పినవి వర్తిస్తాయి.
ఎవరినైనా పేరుపెట్టి అకారణంగా, రుజువులు లేకుండా అవమానిస్తేనే అది లైబెల్ అవుతుంది. On the other hand, ఇతరుల మతవిశ్వాసాల్ని కించపర్చడం అసలుసిసలైన నేరం. తమకి విశ్వాసం లేకపోయినంత మాత్రాన ఇతరుల విశ్వాసాల్ని అవమానించవచ్చునా? అదొక దేవాలయమనీ, టూరిస్టు స్పాట్ కాదనీ, అక్కడి విగ్రహాలు కేవలం ప్రదర్శనకి పెట్టిన బొమ్మలు కావనీ, అది అనేకమంది విశ్వాసాలతో ముడిపడ్డ ప్రదేశమనీ, అక్కడ ఏది పడితే అది చెయ్యకూడదనీ అక్కడికెళ్ళినవాళ్ళకి తెలీదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదా?
జయహో: చాలాగాబా చెప్పారు.
మీరు తీర్పులిచ్చేసి, నోరుచేసుకొంటే, మిగిలినవారు పరిశోధించాలన్నమాట. శిక్షవిధించేశాక, ఆచరణన్నమాట. ఇదేదో చాలా బాగుంది. కవితల్లో విజ్ఞాన వచనాలని వెదగ్గల తర్కమున్నమనం. నిజాల్లో, రంధ్రాలు వెదకలేమా? ఎన్ని నిజాలు చూపించినా తీర్పనేది ఇచ్చేశాక దాన్ని సమర్ధించుకోవడం ఒక లెఖ్ఖా? సంయమనమన్నది ఎదుటివారికి మాత్రమే వర్తించే నీతన్నమాట. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ధన్యవాదాలు!
ముఖాన అంత కుంకుమ,విభూది కనిపిస్తే వారేదో మత చాంధసవాదులని, కొందరి పనిపాట లేని వారి అభిప్రాయం. అంతేనా వీళ్లు చాలా హృదయ వైశాల్యం ఉన్న ఆధునికులని ఫీలైపోతుంటారు. ఇదే అసలైన అహంకారం అంటే! పెద్ద లాయర్ లా చట్టం గురించి చెప్పటానికి వచ్చాడు. ఎంతో చెత్త రాసిన వెబ్ సైట్లు, వ్యాఖ్యలు నెట్ లో లక్షలలో ఉన్నాయి. అందరి నెత్తిన పోలిసుకేసులు పెట్టి జైలోకి తోస్తే , ప్రపంచ వ్యాప్తంగా జైళ్లన్ని, ఈపాటికే కిక్కిరిసి పోయి ఉండేవి.
ప్రతిస్పందించటమనేది మానవ స్వభావం. అది ఎంతో సహజమైనది. మనుషులకు ఉండేవి అభిప్రాయాలు. కోర్టులు ఇచ్చేవి తీర్పులు. దుర్గేశ్వరరావు గారు అభిప్రాయం కాదనటానికి నువ్వేవరు? ఎమిటి ఇక్కడ ఆయన విధించిన శిక్ష? పైన హ్యుమనిస్ట్ వ్యాఖ్య చదవలేదా?
@కవితల్లో విజ్ఞాన వచనాలని వెదగ్గల ర్కమున్నమనం@
నీకుందేమో ఆ నైపుణ్యం, నాకు లేదు.
అయ్యా ఐకనోక్లాస్టు గారూ, అక్కడ వున్నది దేవాలయం అని తెలియడం లేదా తమకి?అక్కడికి యెవరో వెళ్తారో యెందుకు వెళ్తారో కూడా తెలియదా?
యిదే యింకో మతం వాళ్లకి జరిగ్తే వూరుకున్టారండీ మనం నిర్లిప్తత వహిస్తే అంతే నందీస్వరుదంటే ఎవరో తెలియని మూర్ఖులు వాళ్ళు మతం మార్చుక్వకోవడం పెద్ద తప్పు దాని పర్యవసానం వాలకి తెలియడం లేదు చాలామంది యీజన్మ లో అనుభవిస్తున్నారు కొంతమంది పై జన్మలలో అనుభవిస్తారు వివేఅకానందుడు చికాగో సభలో అదే చెప్పేరు మతం మార్చిన వాలు ఈ రోజు గర్వ పడవచ్చు కాని తరువాత వాళ్ళు ఆ మారిన వాళ్ళు అనుభవించే రోజు వస్తుంది
పిల్లలకి నేర్పవలసిన వి నేర్పాలి ఎంతసేపూ టీ వీ లో ఏ సీరియలు వస్తూంది అని గడిపేస్తే అంతే పోయేది వాళ్ళు వాళ్ళ పిల్లలూ
మన మతం ఎప్పుడూ బాగానే వుంటుంది
iconoclast - విగ్రహవిధ్వంసకుడినని బాహాటంగా చాటుకుంటున్న ఈ ఆకాశరామన్న గారు ఎవరో తమ సహవిగ్రహధ్వంసకుల చిత్రాన్ని సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్య వారికి తగినదేను. ఇప్పుడు వార్తా పత్రికల్లోనూ, వాటి Internet పాఠాంతరాల్లోనూ, బ్లాగుల్లోనూ అనేకానేక వార్తలను కనీసం అనుమానప్రమాణాలైనా లేకుండా రాసి వార్తలుగా చలామణీ చేస్తుంటే చదువుతున్నామా లేదా? వాటికి సాధికారత, నిరూపణ ఎవరూ కావాలని demand ఎవరూ చేయడం లేదేమి చెప్మా? సినిమాల్లోనూ, TV లొను అనేకానేక వర్గాల వారిని, విశ్వాసాల వారిని కించ పరుస్తూ చాలా చాలా వికృతచేష్టలే వచ్చినట్లు గుర్తు. వీటన్నిటినీ సమ్యమనంతో భరించాలని, ఇవన్నీ మానవహక్కుల్లో భాగాలేననీ విగ్రహాసురుల వారి ఉవాచ. సినిమాల్లో వికలాంగులనీ, కొన్ని సమాజవర్గాల్నీ, కొన్ని మతవర్గీయులనీ అవహేళన చేస్తూ చూపుతున్నారు. సినిమాలన్నీ స్త్రీలని భోగవస్తువులుగా చూపించి సొమ్ముచేసుకుంటూ ఒక మానవార్ధాన్ని అనునిత్యం అవమానిస్తూనే వున్నాయి. విగ్రహాసురుల వారు ఈ విధమైన హక్కుల ఉల్లంఘనలన్నింటికీ గొంతెత్తి నిరసన చాటుతున్నారా? లేదా తమవంటి విగ్రహవ్యతిరేకుల హక్కులు ప్రశ్నింపబడ్డపుడు మాత్రమే అక్రోశిస్తున్నారా?
ఒక వేళ ఈ చిత్రాన్ని ఎవరైనా వారు సూచించినట్లుగా photoshop చేసి ఉన్నట్లైతే, ఈ వ్యాఖ్య ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికి గాకా అలా ప్రక్షేపన చేసిన వారికి చెందుతుంది. ఆ libel అభియోగం వారి చిత్రాన్ని అనధికారికంగా వాడుకున్నా వారి పైన ఆ చిత్రంలోని వ్యక్తి వెయ్యాలి. మీకెవరైనా బజార్లో నకిలీ సరుకు అమ్మజూపితే అది నేను కొనుక్కుని 'ఫలానా కంపెనీ నన్ను మోసం చేసిందీ అని చెపితే తప్పు నాది అవుతుందా. ఆ అభిప్రాయాన్ని బహాటంగా ఖండించవలసిన బాధ్యత ఆ కంపెనీకున్నది. అంచేత, ఎవడు ముందుగా సిద్ధాంతం చేస్తున్నాడో, ఋజువు చేసే బాధ్యత కూడా వాడిదేను. ఇది photoshop చెయ్యబడిందని నిరూపించడం ఆకాశరాం గారి వంతేను.
"నీ కర్ర తిప్పే స్వేచ్చ నా నాసాగ్రం దాటి రాలేదు" అని బెర్నార్డుషా కాబోలు ఈ రకమైన విపరీత స్వేచ్చావాదానికి ఓ చురక ఇచ్చారు.
Post a Comment