శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణమునకై స్వామి పరివారం ద్వారా అందిన మరో 75 వేలు

>> Wednesday, April 30, 2014
స్వామి అనుగ్రహం తో అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికి స్వమి పరివారం ద్వారా మరో  డెబ్భై వేల రూపాయలు అందాయి.
పాతూరి రాజశేఖర్ దంపతులు [యు.ఎస్] వారి తల్లిదండ్రులు శ్రీ వేంకటేశ్వరరావు _రాఘవతి పుణ్యదంపతుల తరపున  50      వేలరూపాయలను నిర్మాణమునకై సమర్పించారు
అలాగే చెన్నారెడ్డి వంశీధర్ దంపతులు  20 వేల రూపాయలను అందజేయగా
పి సురేష్ దంపతులు 5922 లను ఇందుకొరకై పంపారు


కాగా  ఇక్కడ కూలీల కొరతతో పనులు జాప్యం జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సీజన్  పార్టీప్రచారాలకై తిరిగేవారికి మందు,విందుతో పాటు రెండువందలనుండి మూడువందలదాకా ఇస్తున్నారు. ఇక ఉపాధిహామీ పథకంలో పొద్దుటే వెళ్ళి రెండు మూడు గంటలు  పనిచేస్తే మూడువందలదాకా వస్తున్నాయి. ఇదేసమయంలో మాకిక్కడ దాళ్వా వరి నూర్పిళ్ళు జరుగుతున్నాయి. దీంతో కూలీలు దొరకటం గగనమవుతున్నది.
ఆదివారం గ్రావెల్ తోలించగా దాన్ని చదునుచేయటానికి కావలసిన కూలీలకోసం ఎంతప్రయత్నించినా దొరకలేదు. ఒక వంక పిల్లర్లు తడారకుండా కాపాడుకోవాలి తీవ్రంగా ఉన్న ఎండలనుండి. నిన్న లక్ష్మీ పురం లో ఖాళీగా కనిపిమ్జిన వెంకటరెడ్డిగారనే వృధ్ధుణ్ణి, రెడ్డిపాలెం లో ఉన్న మా పూర్వ విద్యార్థి హరిక్రిష్ణ ను తీసుకువచ్చి మేం ముగ్గురం కలసి వరిగడ్డి తాళ్ళు  తయారు చెశాము, పొద్దుటే మా తమ్ముడు, ఆశ్రమానికి వస్తున్న సుబ్బారావు,హైదరాబాద్ నుండి ఈవేళ తెల్లవారు జామున వచ్చిన మా పెద్దాబాయి కలసి వరిగడ్డి ని ఈతాళ్లతో పిల్లర్లకు  బిగించారు. మూడు రోజులుగా మట్టీ చదునుచేసే పని ఆగిపోయింది. ఈ ఆటంకమేమిటి సమయం చాలదు స్లాబ్ వేయటానికికని రాత్రినుండి బాధపడుతుండగా స్వామి అనుగ్రహం చూపారు. చీరాల ప్రాంతం నుండి ఇక్కడ సుబాబుల్ తోటలు కొట్టడానికి వచ్చిన కూలీలు ఈరోజు వచ్చారు. అందరి మెడలలో ఆంజనేయస్వామి బిళ్ళ వేలాడుతున్నది. కాంట్రాక్ట్ గా తీసుకుని పని పూర్తిచేసి వెళ్ళారు . కాస్త కూలీ ఎక్కువైనా సమయానికి సహాయపడ్డారు.
రేపూద్దుటే మాకు స్కూల్ గ్రాంట్స్ ఆడిట్ అని కబురొచ్చింది. ఈనెల ఏడున  నాకు  ఎన్నికల డ్యూటీ తెనాలి వేశారు. ఈలోపల స్లాబ్ వేయాలి. చెక్క సెంట్రింగ్ పెట్టడానికి మూడు రోజులు  ,ఐరన్ కట్టుకోవడానికి రెండు రోజులు కావాలి. మరి స్వామి అనుగ్రహం ఎలాఉందో !  గ్రావెల్ సింక్ అవటానికి ఈరాత్రి మేలుకుని నీళ్ళు పెడుతున్నాను. అందుకే మధ్యలో ఇలా అర్ధరాత్రి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

జైశ్రీరాం

1 వ్యాఖ్యలు:

Vamshi Krishna May 8, 2014 at 7:30 AM  

Meeru chese posts kosam roju okasaryna blog open chestunna. Akkada jaruguthunna vishayaalu thelusu kovadam maaku chala asakthiga undi.

Bagavanthuni anugraham valla, sakaalaniki anukunna panulu poorthi kavalani ashisthunamu.


  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP