శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లక్ష్మీ దేవి చిరునామా ఎక్కడ ?

>> Saturday, November 23, 2013

లక్ష్మీ దేవి ఎక్కడెక్కడ ఉండేదీ, అలక్ష్మి ఎక్కడెక్కడ ఉండేది చెప్పడానికి సంస్కృత భాషలో అనేక శ్లోకాలున్నాయి.  మచ్చుకి రెండింటిని చూద్దాం. 

యత్ర పుత్రో గురోః పూజాం దేవానాం చ తథా పితుః 
పత్నీ చ భర్తుః కురుతే తత్రా అలక్ష్మీ భయం కుతః 
ఏ ఇంట పుత్రులు తల్లిదండ్రులను,  గురువులను, దేవతలను పూజిస్తూ ఉంటారో, భార్య భర్తను పూజిస్తూ ఉంటుందో అక్కడ అలక్ష్మీ భయం అనగా దారిద్ర్యానికి అవకాశం ఉండదు.  అలాగే ... 

పంక్తి భేదే పృథక్పాకే పాకభేదే తథాకృతే 
నిత్యం చ గేహకలహే భవితా వసతి స్తవ 
ఒకే పంక్తి లోని వారికి భేదంగా వడ్డించే చోట, వేరు వేరు పొయ్యిలు పెట్టి వండుకునే చోట, ఒకే ఇంట్లో ఎవరికి వారు తమకు తోచిన రకాలుగా వంటలు వండుకునే చోట, అసలే వండుకోని ఇంట, కుటుంబ కలహాలతో నిండి ఉన్న ఇంట పెద్దమ్మ కాపురం చేస్తుంది.  చిన్నమ్మ అనగా లక్ష్మీ దేవి అటువంటి ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.
[కె.బి.ఎన్.శర్మ]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP