కార్తీకమాసపూజలకు గోత్రనామాలు పంపండి,కార్తీక సాధనా శిబిరంలో పాల్గొనండి
>> Tuesday, October 29, 2013
శ్రీరామ
కార్తీకమాస సాధనా శిబిరం
-----------------------------
సంవత్సరంలో కార్తీకమాసం విశిష్టమైనది. శివకేశవులకిరువురకూ ప్రీతికరమైన మాసం.
ప్రత్యేకంగా శివారాధనతోను,దీక్షలతోనూ ఆథ్యాత్మిక సాధనలతో,భగవన్నామస్మరణలతో ప్రకృతి పులకించిపోతుంది
ఈకాలంలో చేసే ప్రాతః స్నానం వలన పాపాలు,రోగాలు నశించి ,తేజస్సు,ఆరోగ్యం చేకూరుతుంది.
దానికితోడు భగవంతుని అర్చనాదికములు మనిషికి మనోబలాన్ని ,జయాన్ని ప్రసాదిస్తాయి.
మీమీ జీవితాలలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి.
భగవంతుడు మనకిచ్చిన 24గంటలలో కేవలం రెండుగంటలు ఇందుకొరకు వినియోగిస్తే,
మన చెడుకర్మలు నశించి ,గ్రహదోషాలు,జాతకదోషాలు తొలగిపోయి,ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి.
ఈ కార్తీక మాసంలో ఆథ్యాత్మికసాధనలో భాగంగా కార్తీకసాధనాశిబిరం 'రవ్వవరం కాలువ సమీపంలో,శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం నిర్వహిస్తున్నది.సాధారణ జీవనానికి,ఇంటిపనులకు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఈ సాధన సాగుతుంది.
[ప్రత్యక్షంగా పాల్గొనేపీఠసమీప ప్రాంతాలవారికోసం]
ప్రారంభం
------
4-11-2013 కార్తీక శుధ్ధపాఢ్యమి ,సోమవారం నుండి 2-12-2013 కార్తీక అమావాస్య ,సోమవారం వరకు.
కార్యక్రమ వివరాలు
-------------------ఉదయం 4 నుండి 4-45 వరకు నదీస్నానం[పీఠ సమీపంలో, కృష్ణానదీ జలములు ప్రవహించుచున్న కాలువలో]
4-45 నుండి 5-00 వరకు సేవాకార్యక్రమం
5- నుండి 5-30 వరకు శివాభిషేకం
5-30 నుండి 6-00 పంచాక్షరీ జపం,ధ్యానం
కేవలం ఈ రెండుగంటలు సాధనలో గడపండి . మీజీవితంలో సకల దోషాలు.దారిద్ర్యములు తొలగించి సర్వశుభాలు కలుగుతాయి.
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం
ప్రధాన సేవకులుః బి.వి.బి దుర్గేశ్వర రావు .
9948235641
పరోక్షంగా సాధనా శిబిరంలో పాల్గొనదలచుకున్నవారికోసం
------------------------------------------------
నిత్యము మీరు పై విధానంలో[వీలుకానివారు ఇంటివద్దనే] సాధన కొనసాగించవచ్చు
మీ పూజామందిరంలో చిన్న శివలింగం లేక బంకమట్టితో పార్థివ లింగాన్నినిర్మించుకుని అర్చించుకొనవచ్చు.
మీకు సశాస్త్రీయంగా పూజా విధులు తెలియవని బెంగవద్దు. భక్తిభావనతో ఓ చెంబుడు నీళ్లతో మీకు వచ్చిన శివనామస్మరణతో,స్తుతులతో అభిషేకించుకుని ,అర్చన చేయవచ్చు. మీరడిగితే మాకు తెలిసినంతవరకు ,మరియు పెద్దలద్వారాతెలుసుకుని మీకు సందేహాలు తీర్చ యత్నిస్తాము.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కార్తీకం పూర్తయ్యేవరకు మాంసాహారాదులను విడిచిపెట్టుట మంచిది.
మీ గోత్రనామాలు తెలుపుతూ durgeswara@gmail.com కు మెయిల్ పంపండి
ఇక్కడ అర్చనలో మీగోత్రనామాలతో పూజజరుపబడుతుంది.
[మనవిః ఈసూచనలు శివారాధనా తత్పరులైన ,విశేషార్చనాపరులైనవారికోసం కాదు .కార్తీకమాస ఆరాధనా ఫలితాలను అందరికీ అందాలని సాగిస్తున్న ఈ సాధనా శిబిరంలో పాల్గొననున్న మావంటి సామాన్యజనులకోసం.మాత్రమే]

1 వ్యాఖ్యలు:
nijamgaa kaarteeka masam lo niyama nistalato puja cheste sarva dosha haranam ani maa pedda vaallu chepparu.totalgaa [ost adubutamgaa undi.
http://www.googlefacebook.info/
Post a Comment