హనుమద్రక్షాయాగం పూర్ణాహుతిలో పాల్గొనండి
>> Saturday, January 19, 2013
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం నందు "నందన" నామ సంవత్సర విజయదశమి నుండి ప్రారంభమై రాష్ట్రవ్యాపితంగా హనుమాన్ చాలీసా, రామనామ జపములతో సాగుతున్న హనుమద్రక్షాయాగం మాఘశుద్ధ ఏకాదశి గురువారం [feb 21 ,2013] పూర్ణాహుతి కార్యక్రమములతో సంపూర్ణము కానున్నది. ఐదవ ఆవృతిగా జరుగుతున్న ఈ యాగంలో విశేషపూజలు జరుపబడుతున్నాయి.
సకల దోషాలను పరిహరించి ఇష్టకామ్యసిధ్ధిని ప్రసాదిమ్చగల హనుమదుపాసనద్వారా ప్రతిఒక్కరూ మేలు పొందాలని ,స్వయంగా స్వామినాశ్రయించి ఆయన అనుగ్రహం పొందటం అనే ఆథ్యాత్మిక ప్రయోగంగా జరుపుతున్న ఈ యాగం నిర్వహించిన గత నాలుగు ఆవృతులలోనూ పాల్గొన్నవారికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో వారిజీవితములలో అద్భుతమైన ఫలితములు ప్రసాదింపబడుతున్నాయి. . ఎన్నోసమస్యలలోఉండి బాధపడుతున్నవారు హనుమదుపాసనతో తమసమస్యలను తొలగించుకుని తమజీవితంలో హనుమత్ కృపను స్వయంగా సాధించుకున్నారు. ఈ ఆవృతిలో ఇప్పటికే పలుప్రాంతములలో భక్తులు తమ సంకల్పములను చెప్పుకుని చాలీసాపారాయణములు,రామనామ జపములు సాగిస్తున్నారు. ఇంకా మొదలుపెట్టనివారు వెంటనే మొదలుపెట్టవచ్చును.
అవసరమైన రామనామ లిఖితమునకు ప్రతులను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకొనవచ్చు
ఇక పూర్ణాహుతి కార్యక్రమంలో సాధకులచేత స్వయముగా యాగం చేపించబడుతుంది . యాగాన్ని వీక్షించుటకొచ్చే వారికి ప్రత్యేకనియమాలు లేవు. కానీ యాగంలో పాల్గొనేవారు ఈక్రింది నియమములు తప్పనిసరిగా పాటించాలి.
౧ . యాగానికి ఇరవై ఒక్కరోజులముందు నుంచి అంటే ఫిబ్రవరి ఒకటి నుండి మద్యం.మాంసాహారం,గుడ్లు స్వీకరించరాదు.
౨. ఫిబ్రవరి 10 నుండి దంపతులురివురూ బ్రహ్మచర్య దీక్షలో లో ఉండాలి/
౩. బ్రహ్మచారులుకూడా ఈ యాగంలో పాల్గొనవచ్చు.
౪ ఈనెల 30 లోగా తమ గోత్రనామాలను తెలుపుతూ యాగంలో పాల్గొంటున్న విషయం ధ్రువీకరించి తమపేర్లు నమోదు చేసుకోవాలి.యాగకుండము వద్దకు భార్యాభర్త లిద్దరిని మాత్రమే అనుమతిస్తారు.
౫ ఎప్పటిలాగే యాగద్రవ్యములకగు ఖర్చు [రు.1008] లను చెల్లించటం ద్వారా మీకు యాగసమయంలో పూజాద్రవ్యాలన్నీ కార్యకర్తలద్వారా అందజేయబడతాయి .యాగం దర్శించుటకు వచ్చేవారేమీ చెల్లించనవసరం లేదు. మీరేమీ తీసుకుని రావలసిన అవసరం లేదు.
స్వయంగా యాగములో పాల్గొనటానికి వీలుకలగనివారి తరపున కూడా యాగము జరిపించబడుతుంది.కానీ వారు ఖచ్చితంగా జపము చేసి జపసంఖ్యను తెలుపవలసిఉంటుంది .
౬. యాగంలోనూ ఆరోజు సాయంత్రం జరిగే శ్రీవేంకటేశ్వర కళ్యాణం. శివకళ్యాణములలో పాల్గొనవచ్చు. ఈకార్యక్రమములలో కైంకర్యములకు ,అన్నదానాది కార్యక్రమములకు మీ ఇచ్చితానుసారంగా సహాయపడవచ్చు.
యాగానంతరం వారికి ప్రసాదములు పంపబడతాయి .
౭. మీరు జపము చేసి లిఖించిన రామనామ ప్రతిని ఇక్కడ సమర్పిస్తే అవి భద్రాచలరాముని సన్నిధికి చేర్చబడతాయి.
౮. మీరు కోరినచో ఎక్కౌంట్ నంబర్ తెలియపరచబడుతుంది. దానికి మాత్రమే .మీరు మీసహాయమును అందించగలరు.
ఇంకావివరములు కావాలనుకున్నవారు ఫోన్ ద్వారా సంప్రదించగలరు
దుర్గేశ్వర
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం
గుంటూరు జిల్లా
cell 9948235641
durgeswara@gmail.com
1 వ్యాఖ్యలు:
aa hanumaMtuni naamasmarana ku prerana istunna mIru dhanyulu
Post a Comment