శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్నంపెట్టేవానికోసం ఒక్క అవార్డుకూడా ఇవ్వలేరా అయ్యా ????

>> Friday, January 25, 2013

ఆహా  సృష్టిలో ఎన్నిరకాల కళలలనో గుర్తించి గౌరవిస్తున్నాం . ఎన్నో  వేదికలపై వాటిలో విశేష కృషిచెసినవారిని గుర్తించి గౌరవిస్తున్నాం .  కళ లేవైనా కడుపునిండితేనే కదా  వాటిని గూర్చి ఆలోచించేది .జీవరాసులలో లక్షల,కోట్ల  సంఖ్యలో ఉన్న బుధ్ధిజీవులైన మానవులకు సమయానికి ఓముద్ద పడకపోతే కాలు ముందుకు పడదు. అందరరికీ తిండి సమకూర్చాలి ముందు.అలాంటి ముఖ్యబాధ్యతను నిర్వహిస్తూ తాను  పస్తులున్నా పదిమందికి కడుపు నింపాలనే ధ్యేయంతో   ప్రకృతి వైపరీత్యాలలో, పురుగూ పుట్రలతో పోరాడుతూ ఎంతో నైపుణ్యంతో  నాటు నుండి కోతవరకూ కాపాడుతూ  పంట పండించి వండివారుస్తున్నాడే రైతు.!!!   కృతజ్ఞత ఉండక్కరలేదాండి మనకు. ఒక్క ముక్క మెచ్చుకోలు మాట. ఒక్క చిన్న అవార్డు చెక్క ముక్క . ఇవ్వాలని అనిపించటం లేదేమిటి మనకు ?  ఎన్ని సంవత్సరాలు గడచిపోయాయి స్వాతంత్ర్యం కూడా పొంది.???  . ఎన్ని పండుగలు చెసుకున్నాం ??? ఎన్ని అవార్డులు ,భూషణలు,విభూషణలు, రత్నాలు ఇవ్వలేదు !!!     ఇన్ని రోజులలో ఒక్కరోజు... ఒక్కరోజు కూడా  ఒక్కనిమిషమన్నా  రైతుగూర్చి ఆలోచించాలనిపిచటం లేదు మనకు, మనమెన్నుకున్న ప్రభుత్వాలకు??? . అసలు రైతు మనిషన్న సృహ మనకున్నదా ??  రైతు చావుబ్రతులలో ఉన్నాడు నేడు. నమ్ముకున్న కన్నతల్లి నేలతల్లిని వదలలేక, పదిమందికి పట్టెడన్నం పెట్టే అదృష్టాన్ని వదులుకోలేక  . అరవై నాలుగు రిపబ్లిక్ దినోత్సవాలు గడచిపోయాయి . నకిలీ త్యాగశీలులకు జైకొట్టే మనం నిజమైన త్యాగశీలిని గుర్తించలేమా ? అయ్యా ! ఇకనైనా వ్యవసాయాన్ని ఒక వృత్తిగా గుర్తించండి. కోట్లాది భారతీయ రైతుల విజ్ఞానాన్ని గౌరవించండి . నిజమైన భారత రత్నలు బ్రతకి ఉండటానికి బాటలు వేయండి. క్షమించాలి. ఇది ప్రభుత్వాలు చేయాల్సినపనికాదు . ఆప్రభుత్వాలను ఏర్పాటు  చేస్తున్న   మనం  ఆప్రభుత్వాలచే చేయించవలసిన పని .

1 వ్యాఖ్యలు:

Unknown January 26, 2013 at 12:03 AM  

nijam chepparu sir

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP