శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శాస్త్రం కూడా వెంట్రుకలను తీవ్రముగా పరిగణించడానికి కారణం ఏమిటి??

>> Tuesday, January 29, 2013

ఎంత శుద్ధమైన ప్రదేశములో చేసిన ఆహారమైన, ఎంత శుచిగా ఉన్నవారు చేసినా, దానిలో వెంట్రుక గానీ, గోరు గానీ పడితే అది తినడానికి పనికిరాకుండా పోతుంది. అంతే కాకుండా దైవ కార్యాలలో కూడా దేనిలోనైనా వెంట్రుక కనపడితే స్నానం చేసి మళ్ళీ మొదలుపెట్టాలంటారు. అసలు వెంట్రుక అంత నిషేధం ఎందుకయ్యింది. తినే అన్నములో వెంట్రుకపడితే జుగుప్స కలగడం సహజం. శాస్త్రం కూడా వెంట్రుకను అంత తీవ్రముగా పరిగణించడానికి కారణం ఏమిటి??


మనము చేసిన పాపాలు, పాప ఫలాలు అన్ని కూడా వెంట్రుకలలో నిక్షిప్తము ఐయి ఉంటాయి. అందుకనే వేంకటేశ్వర స్వామి కి మనము తల నీలాలు సమర్పించి మన పాపాలు పోగొట్టుకున్టాము అని గురువు గారు ప్రవచనాలలో చెప్పారు.   వెంట్రుకలు అంటే అవి మన పాపాలకి storage tank కదా.    బహుశా అందుకనే అది అంత నిషిద్ధం అయి ఉంటుంది. ఎవరికీ అయినా ఇతరుల పాపాలు అంటే భయమే కదా.
--
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

1 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు January 29, 2013 at 10:10 AM  

నెపోలియన్ చక్రవర్తి ప్రవాసంలో ఉన్న కాలంలో ఆయనకి ఇంగ్లీషువారు విష ప్రయోగం చేసి చంపారని అనుకొనేవారు. ఆ తరువాత రెండు వందల సంవత్సరాల తరువాత ఒక మ్యూజియంలో ఉన్న నెపోలియన్ వెంట్రుకలని పరీక్ష చేసి ఆయన ఆర్సెనిక్ ప్రయోగం వల్ల చనిపోయాడని నిర్ధారించారు శాస్త్రవేత్తలు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP