అణువు అణువూ అమ్మే నాయె ! నేనివ్వగలిగనదేదీ కనపడలేదాయె !!!! [లక్ష్మీ వార పూజల పూర్ణాహుతి]
>> Thursday, January 17, 2013
మార్గశిర లక్ష్మీవారపూజలు ఈరోజు తో పూర్తయ్యాయి. మార్గశిరమాసంలో నాలుగు గురువారములు ఈ పుష్యమాసంలో ఒక గురువారం కలసి ఐదువారాలు భక్తులగోత్రనామాలతో అమ్మవారికి విశేషఅర్చనలు జరుపబడ్డాయి . క్షీరాభిషేకములు, కలువలతో అర్చనలతో అమ్మ దేదీప్యమానంగా వెలుగొందుతూ తన బిడ్డల సంరక్షణా బాధ్యత తనదేనని అభయప్రదానం చెస్తూ దర్శనమిస్తున్నది .
వాస్తవానికి ఈ చివరి వారం కలువలు కోయటానికి పడవ నడిపే పిల్లవాడు ఊరెల్లటం వలన పూలు దొరకవని పూజకు ఆటంకం వస్తున్నదని దిగులు చెందాము. కానీ రాడనుకున్న ఆకుఱవాడు ఊరినుంచి అనుకోకుండా రావటం పడవలో చెరువులోకి వెల్లి పూలుకోసుకుని వచ్చి పూజచేయగలగటం కేవలం అమ్మలీల మాత్రమే. బిడ్దలకిష్టమైన పనిని తానే నెరవేర్చటం అమ్మ కరుణగాక మరేమిటి ? !!!
2 వ్యాఖ్యలు:
మనందరికీ శోభనిచ్చే తల్లి ఎంత శోభానుమయంగా ఉంది.
మీ సంకల్ప సిద్దికి అభివందనం.
chala bavundi swami...santosham
Post a Comment