శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పశుసంపద విలువే తెలియని తరం రానున్న రోజులలో కనుమ పండుగ ఎలాచేస్తారో ?????

>> Tuesday, January 15, 2013

సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ . ఈరోజు పశుసంపదను పూజించటం ప్రధానమైన కార్యక్రమం. నాడు దేశమంతా పాడిపంటలతో కళకళ లాడటానికి ఈ పశుసంపదే ఆధారం. నేడు స్థితి మారింది . దేశంలో ప్రధాన వృత్తివ్యవసాయం ఈనాటికీ . కానీ రైతుకు పెద్దకొడుకులా సహాయపడి పొలాలు దిన్నిన ఎద్దులు, దున్నలు మాయమవుతున్నాయి. పశుసంపదఅధారంగా సాగిన వ్యవసాయం నాడు దిగుబడితక్కువైనా రైతును మోసం చేయలేదు. కానీ ఆధునిక వ్యవసాయరీతులు ఆచరించి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు సాధిస్తున్నా వ్యవసాయం దండుగ అనేమాట కొచ్చింది పరిస్థితి . .  ఇకరాబోయే తరాలకు వ్యవసాయం ఒక వృత్తి కాబోదేమో !!

దానికనుగుణంగానే రైతులపిల్లలంతా పొలాలకు దూరమవుతున్నారు. పంటలుపండే భూములు పరిశ్రమల పాలవుతున్నయి.
 మొన్న డిశంబర్ 31 న నేనూ వేరే పాఠశాలకు బదిలీ అయ్యాను . కొత్తగాచేరిన స్కూల్లో పిల్లలకు జంతువులు ఉపయోగాలు అనే పాఠం బోధిస్తూ   ఏఏ జంతువులవల్ల ఏమి ఉపయోగాలురా ? అనడుగు తున్నాను . నేను ఒక్కో జంతువు గూర్చి అడుగుతూ  ఆవులు  గేదెలు ,ఎద్దులు,దున్నపోతుల ఉపయోగం ఏంటిరా ?అని  అడిగాను. ఎద్దులు వాల్లఊర్లో లేవు. ఆవులు పాలిస్తాయని తెలుసు. గేదెలంటే ప్రతి ఇంటా ఉన్నాయిప్పుడు పాలపరిశ్రమ అభివృద్ధి వలన. ఇక మాప్రాంతంలో గతంలో దున్నపోతులతో  వ్యవసాయం ఎక్కువ  .నేను ఈవిషయం చెబుతారు  కదా అని  దున్నపోతుల వల్ల ఉపయోగం ఏంట్రా అనడిగాను . అవా !!  గేదెలు ఎదకొచ్చినప్పుడు తీసుకెళతారు సార్! వాటిదగ్గరకు అని చెప్పారు. తల తిరిగి పోయింది  వాల్ల   అవగాహన విని. వాల్లకు తెలిసి వాటి ఉపయోగం అదే. ఊరికో విత్తనం దున్న ఉన్నదిప్పుడు పాలకేంద్రాల ఆధీనంలో మిగతావెప్పుడో అమ్మేశారు  "కోతకు".  పశువుల  అధారంగా  వ్యవసాయరంగా ఇకపై సాగలన్నా సాగదు. వున్నపశువులన్నింటినీ రాక్షసులలాగా తినటమేజరుగుతుంది. ఉన్న ఒకటో రెండో లక్షల రూపాయలు వెచ్చించి ఏ బ్రెజిల్ వాడో కొనుక్కుని విమానం ఎక్కించేసుకుని పోతున్నాడు . పాలిచ్చి తల్లిలా పోషిస్తున్న పాడి గేదెలను ఆవులను కసాయితనంతో కబేళాలకు తరలిస్తున్నారు వట్టిపోయాక .  వచ్చే తరానికి పశువులతోటీ ,పొలాలతోటీ అనుబంధం తెగిపోతుంటే , పండుగలలోనూ  కృతిమత్వమే కనపడదూ మరి !!!

1 వ్యాఖ్యలు:

Archana August 3, 2022 at 10:05 AM  

ఈ వ్యాసం/ఆర్టికల్ చాలా బావుంది. సమాచార పరంగా. ఇందుండి ఒక పేరాగ్రాఫ్ నేను నా ఆర్టికల్ కి వాడతాను . ఎడ్లు, దున్నపోతుల ఉనికి ఎలా కనుమరుగవుతుంది అన్న ఓ కవితకి మూలం తెలియజేస్తాను. ధన్యవాదాలు.
ఉమాభారతి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP