శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆహా! ఆర్తితో పిలచేటివారికి అందివచ్చిన రామనామము ???!!!

>> Tuesday, November 6, 2012

నిన్న సాయంత్రం స్కూలు కెళ్ళిరాగానే ఇంటివైపు కాక బండిని లక్ష్మీపురం గ్రామంవైపు పోనిచ్చాను. అక్కడపూర్ణచంద్రరావుగారిని కలసి హనుమత్ రక్షాయాగంలో రామనామ జపం  చేసేవారందరికీ రామ నామజప లిఖితము కొరకై ప్రతులను పంపిణీచేయాలని వెళ్ళాను. ఒక్కో ఊరిలో ఒక్కో కార్యకర్తకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాము.
సరే ! వెళ్ళేసమయానికి ఆయన లేరు పొలం వెళ్లారని చెప్పారు .  వెళ్ళేప్పుడు మున్సబు గారి ఇంటిమీదగా నే వెళ్లాను. కానీ వారి ఇంటికి వెళ్లబుద్ధికాలేదు. మునుసుబు గారి భార్య చాలా సాత్వికురాలు మంచి గురుభక్తురాలు. సత్తెనపల్లి  తాలూకాలో సిధ్ధిని పొందిన ఫిరోజీ గురుదేవుల సాంప్రదాయీకురాలు . గురుబోధ పొందినవారు. వయస్సు అరవై అయిదుపైనే. ఈమధ్యనే  పడటం వలన కాలు విరిగినదని రాడ్ వేసి ఆపరేషన్   చేశారని మంచం లోనే ఉన్నారని విన్నాను.  గతంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆవిడకుకూడా కబురు చేసేవాల్లం .  అయితే ఈ మధ్య ఆవిడ ఏదో మతమార్పిడికి గురయినదని అని విని నాకెందుకో ఆవిడను కలుసుకోవడం పట్ల మనస్సంగీకరించలేదు . ఇంత సాధనచేసి గురుబోధనుపక్కనపెట్టి ఏదో కష్టం రాగానే పామరులలాగా మతం మార్చుకున్నామెదగ్గరకు వెళ్ళి మాట్లాడటమెందుకు? సమయం దండుగ అని నాకొక అభిప్రాయం ఏర్పడిఉన్నది మనస్సులో. అందుకనే గత రెండు సంవత్సరాలుగా వారి తోమాట్ళాడే అవసరం కలుగలేదు.

   అయితే చిత్రం ఇక్కడే జరిగింది . నేను వెళ్ళిన వ్యక్తి లేడు కనుక బండి వెనక్కు తిప్పి వస్తున్నాను. మునసుబుగారి ఇల్లు దాటాను . కానీ ఎవరో బలంగా బండి తిప్పమని ఆదేశించినట్లు అనిపించటం తో నాప్రమేయం లేకుండానే తిరిగినట్లు చేతులు హాండిల్ తిప్పటం వారి ఇంటివద్దకు వెళ్లటం జరిగింది . నేవెళ్లగనే ఆవిడ మంచం మీదనుంచే ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఏం నాయనా ! అంతాబాగున్నారా? అస్సలు రావట్లేదు నీవు అంటూ ఆనందంగా మాట్లాడుతున్నది. ఇక ఆవిడ బాధలు కొన్ని చెప్పాక అసలైనవి ఆథ్యాత్మిక విషయాలు  మాట్ళాడటం మొదలెట్టింది. నాకేమో ఏదైనా ఆశ్రమంలో చేరి సత్సంగాలు వింటూ భగవన్నామ స్మరణలో కన్నుమూయాలని ఉంది. మీ బాబాయేమో ! ఈవయస్సులో కూడా కోర్టులు కేసులు అంటూ పిచ్చిభ్రమల్లో ఉన్నాడు . ఉన్న ఒక్కగానొక్క పిల్లకు పెళ్ళిచేశాం దానితిప్పలేవో అది పడుతుంది. వెళ్లి దానిదగ్గరుండటం భావ్యంకాదు. అటు అత్తామామలను ఇటుమమ్మలను నలుగురికి చాకిరీ చేయాలనటం ధర్మం కాదు . అంటూ ఇక ఏకాంతంలో ధ్యానంలో తనకు కలుగుతున్న అనుభవాలను కొన్ని చెబుతున్నది .
అంతలో  నేను  అమ్మా! హనుమత్ రక్షాయాగం మరలా ఐదవ ఆవృతిగా మొదలెట్టాము. మీరు రామనామ జపం
చేయండి  చుట్టుపక్కలవాల్లకు చెప్పి చేపించండి అని  యాగ ప్రతులనివ్వగనే  అవిడ ఆనందపరవశురాలయింది.
నాయనా దుర్గా ! ఎంత దయ నాపై స్వామికి ? మొన్నటినుండి రామనామ జపం చేయి అని మనస్సుపోరుతున్నది. చివరిదశలో రామకోటి వ్రాయాలని కోరిక పుట్టించాడు. ఇప్పుడు నీద్వారా ఇలాపంపించాడు అని ఆతల్లి ఉద్వేగంగా చెప్పింది.

 ఔరా ! గురువు మహిమ ? ఆయన కరుణ ఉంటే ఏదశలో ఉన్న భగవత్సాధన చేపించి దరిచేర్చుతాడు కదా అని పించినది నాకు.
అవునమ్మా ! ఇంత సాధనచేసి  గురువులనాశ్రయించి ఇలా  ఏమిటీ! మార్గం మార్చుకోవటం గురువులను అవమానించటం కాదా అని మెల్లిగా నాసందేహాన్ని బయటపెట్టాను.
అయ్యయ్యో ! ఎవరు చెప్పారునాయనా నేను మార్గం మార్చుకున్నానని? ఈ కట్టె గురువుల నిర్దేశానుసారం గా నడచేదే తప్ప దారి తప్పదు.    నాకు కాలువిరిగినప్పుడు  మా అమ్మాయి ఆఫోటోలు తెచ్చిపెట్టి నది .సరే ఆవిడ తృప్తిని నేనెందుకు కాదనాలి అని అక్కడుంచానే తప్ప నేను మారటం జరుగదు. కాకుంటే ఎవరడిగినా నాదగ్గరున్న రూపాయో అర్ధో ఇచ్చిపంపటం అలవాటు నాకు అంతే అని చెప్పింది. సర్వులఅరాధనలనూ గౌరవించటం .స్వీయ ఆరాధనామార్గాన్ని అనుసరించడం  .ఎంతచక్కని సంస్కారాన్ని ఇచ్చింది ఈ హైందవ సంస్కృతి .! దీనిని అర్ధం చేసుకోలేక మతమార్పిళ్లకు పాల్పడుతున్న కుహనాఅథ్యాత్మికవాదులకు  ఈ సంస్కారం ఎన్ని జన్మలెత్తినారాదు.
  ఆవిడకున్న గురుభక్తి  ఆవిడకదలలేకున్నా రామనామాన్ని ఆవిడదగ్గరకు చేర్చి పలికిస్తున్నది  ........ రామరామ యనురాదా రఘుపతి రక్షకుడని వినలేదా ....... జైశ్రీరాం

2 వ్యాఖ్యలు:

మనోహర్ చెనికల November 6, 2012 at 5:08 AM  

సరిగా చెప్పేరు

anrd November 6, 2012 at 7:26 AM  

నిజమేనండి, దైవం దయామయులు. జైశ్రీరాం .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP