కర్మఫలితం వెంటబడి తరుముతుంటే ఎవరు చెప్పినా వినబుధ్ధి కాదు.
>> Tuesday, November 20, 2012
మానవజీవితంలో ప్రతిచర్య కర్మఫలితాన్ననుసరించే జరుగుతుంది. అందులో చెడు కర్మప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు నష్టమొచ్చే అవకాశమున్న పనులలోనే వేలుపెట్టాలని బలమైన కోరిక మొదలవుతుంది. లేదా అలాంటి పరిస్థితులు ఆమనుషులను అలా లాగుతాయేమో!
ఈమధ్య పీఠానికి భక్తునిగా ఉన్న మా ...రెడ్డి మాట్లాడుతూ స్వామీ ! కొన్నిసార్లు మీరు చెప్పే విషయాలు నమ్మబుధ్ధికాదుగానీ ,అవి వాస్తవంలో అనుభవానికొచ్చినప్పుడు మాత్రం అర్ధమవుతున్నాయి. ప్రస్తుతం నేను తెలిసి తెలిసి అడుగువేసి తెచ్చుకున్న ఇబ్బందులు చాలా కష్టాలు చూపిస్తున్నాయి . స్వామి అనుగ్రహం మనపై ఉండి కష్టాలమార్గం నుండి తప్పించినా మనమే కష్టాలకు ఎదురువెళ్ళి ఆహ్వానిస్తుంటే ఆయనేం చేయగలడు అని విచారం వ్యక్తం చేశాడు .
ఈ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగి ఓ స్థలం కొని[భారీధరలకు] ఆర్ధికంగా పరిస్థితి తల్లకిందులవటమే గాక ఇంకా ప్రమాదకరి పరిస్థితులలోకి జారిపోనున్న తరుణంలో పీఠానికి రావటం ,అమ్మ అనుగ్రహం వలన హనుమద్దీక్ష చేసి ఆసాధనా బలంతో ఆ ప్రమాదం నుంచి ఇబ్బందులనుంచి బయటపడ్డాడు. అయితే చిత్రంగా కొందరు మితృల బలవంతంతో మరో టౌన్ లో ఓస్థలంలో పెట్టుబడి పెట్టడం రియల్ ఎస్టేట్ రంగంలో స్థబ్దతరావటం డబ్బులన్నీ ఇరుక్కుని ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి.
ఇక ఇంకొక కుర్రవాడున్నాడు మాగ్రామసమీపంలో గ్రామం . ఈ పిల్లవాడు ఓపదిసంవత్సరాలక్రితం ఇక్కడ రకరకాల పనులుచేస్తూ సరైన మార్గం లేక [సరైన మార్గంలో నడక కూడా లేదు] తిరుగుతూ ఉండేవాడు. ఓసారి పీఠంలో జరిపిన గాయత్రీ హోమానికొచ్చాడు . అందులో మేమడిగిన దేవదక్షిణ గా తన త్రాగుడు అలవాటును వదలివేశాడు. ఇక అక్కడనుండి అమ్మ అనుగ్రహం వలన అతనికి చక్కని మార్గం ఏర్పడటం హైదరాబాద్ వెళ్ళి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా బాగా ఎదిగాడు.
ఒక సంవత్సరంగా ఈ కుఱ్వాడీ ఆలోచనలు మారాయి. రూపాయికి వెతుక్కున్న రోజులనుండి లక్షలు చేతిలో ఆడుతుండే స్థితికి చేరుకున్నే సరికి జీవితంలో జరిగే కర్మఫలితాలను అర్ధం చేసుకోలేకపోయాడు. సినిమా పిచ్చి మొదలైంది . సినిమానిర్మించాలని కొందరితో కలసిదారి మల్లాడు. నేను తిడతానని నాకు ముందుగా చెప్పలేదు. నాకు వేరే వాల్లద్వారా తెలిసి అయ్యో! దారితప్పాడే అని నాఅంతట నేను ఫోన్ చేసి అడిగితే ..విపరీతమైన ఆనందంలో భ్రమలో ఉన్నాడు. సినిమా తీయకముందే పెట్టుబడంతా తిరిగి వచ్చినట్లుగా మాట్ళాడాడు. ఇంకేం చెబుతాం ?
జాగ్రత్త ! అదొక మాయాలోకం .అని చిన్న హెచ్చరిక చేసి వదిలేశాను. ఈ పనిలో పడి ఆవ్యాపారం కూడా పట్టించుకోవటం లేదని ..అప్పుల భారం బాగాపెంచుకుంటూన్నాడనితెలిసింది . మొన్నఫోన్ చేస్తే సెన్సార్ ఆఫీస్ ముందు ఉన్నానని ఈనెలలో సినిమా విడుదల అని చెప్పాడు.
ఏమి ఖర్మరా ! వీనికి భగవంతుని అనుగ్రహం వలన చక్కని బాట దొరికినా ఎండమావులవెంటబడి చక్కని భవిష్యత్తును పాడుచేసుకుంటూన్నాడని బాధకలిగింది ? చక్కగా ఆవ్యాపారాన్నే ఇంకా వృధ్ధి చేసుకుంటే
జీవితం ఎంత ప్రశాంతిగా ఉంటుంది ! కానీ వినరే ?
అందుకే పెద్దలన్నారు "బుధ్ధి కర్మానుసారణి " అని
0 వ్యాఖ్యలు:
Post a Comment