భగవాన్‌తో భాగవతుడు
>> Tuesday, July 17, 2012
భక్తుడు, భగవంతుని కీర్తనలో మనోనర్తనం చేస్తాడు. స్వానందుడై ఉన్మత్త
స్థితికి చేరుకుని, అక్కడే నిలకడ చెంది, ఒక స్థితిలో కైవల్యానందం
సిద్ధించుకుని, ఏదో ఒకనాడు ఏమీ అక్కరలేని నికామస్థితిలో సంస్థితుడౌతాడు.
శ్రీకైవల్య పదం కోరి పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించినా, జగద్ధితం కోరి
నన్నయాదులు భారతాన్ని తెలుగు చేసినా లక్ష్యం ఒక్కటే! అది భగవంతుని అనుగ్రహం
పొందటమే. జాతికి సంస్కృతిని, సంస్కారాన్ని, భావ సంపదను, భాషా
వైదుష్యాన్ని వరదానం చేసిన వీరందరూ సద్భక్తులే.
వీరిలో ఏ ఒక్కరూ నేల విడిచి సాముచేయరు. లోకమును వీడి రసం లేదంటారు. వారి నుంచి వెలువడే ప్రతి అక్షరమూ స్వాదువుగా, సాధువుగా, మధువుగా పారుతుంది. పరవశమై పల్లవిస్తుంది. పరదైవం వైపు మనసును మళ్ళిస్తుంది.భాగవతుడు, భగవంతుడు ఏకమయ్యే మహాయోగాన్ని కల్పిస్తుంది. ఈ కోవకుచెందినవాడే, మహర్షితో మమేకమైన మురుగనార్, ఒక మహాభక్తుడు.
అరుణాచలం అన్న ఒక్కమాట ఎట్లాగైతే రమణులను తిరువణ్ణామలై వైపు నడిపించిందో , 'అరుణాచలపంచకం' మురుడనార్‌కి పరముక్తి ఫలాన్ని అనుగ్రహించే అరుణాచల రమణులవైపు నడిపించడం యాదృచ్ఛికం కాదు. పుస్తకం మస్తకాన్ని ప్రభావితం చేయడం ఒక అపురూప సన్నివేశం. సహజంగానే తమిళా భాషాభిమానం, భాషా ప్రావీణ్యం, కవితావేశం, అభివ్యక్తి, హృదయంగమస్థితి ఉన్న మురుగనార్, తమ ప్రథమ దర్శనంలోనే కమనీయ కవితాత్మక భావాన్ని ప్రకటించిన తీరు ఆయన మనోస్థితికి దర్పణం.
"రెప్పలార్పటమెరుగని, తన రెండు దివ్యనేత్రాంచలాలలోంచి ప్రసరించిన దివ్యకాంతి, నన్ను నా జీవితాన్ని కైవసం చేసుకన్నాయి''. ఈ బావమే మురుగనార్ చిరస్మరణీయ భక్తుడిగా కడదాకా నడిపించింది. మురుగనార్ తను ఏది రాసినా భగవాన్‌కి చూపటం ఒక నిత్యసాధనమైతే, కర్మాతీతులైన రముణులు దానిని సరిద్దిడం, మెరుగులు అద్దండం, అవసరమైన చోట్ల స్యయంగా రచించి, ఆ రచనకు శాశ్వతత్వాన్ని ఇవ్వడం భగవాన్ అనుగ్రహం.
రాసింది రాయకుండా ముప్ఫైవేల ముఖాలుగల మహర్షిదివ్యతాన్ని, సౌందర్యాన్ని, విశిష్టతను వేనోళ్ల కీర్తించడం మురుగనార్ భక్తి పారమ్యానికి పరాకాష్ట. 'ఉపదేశసారం' వంటిమహోత్కృష్ట రమణ బోదలోకానికి అందటానికి కారణం మురుగనార్. రమణనామం చెవి సోకినంతనే శరీర పులకలు తేలినా, రమణ తలపు మనసున మొలవగానే కనులలో ఆనందాశ్రువులు. పొంగి పొరలినా, రమణరూపం కళ్లెదుట కనిపించగానే మాటలెరుగని మౌనం ముంచెత్తినా... ఆ అనుభవం, అనుభూతి మురుగనార్ సొంతం.
అకర్తృత్వమే నిజమైన త్యాగమని, గురుభక్తే సర్వశక్తియని, శరణాగతిని మించిన వినయపూర్వక సమర్పణలేని స్థిరంగా నమ్మి ఆచరించిన సద్భక్తుడు మురుగనార్. అసంఖ్యాక గ్రంథాలు మురుగనార్ ఆధ్యాత్మనిష్ఠకు మాపెరుగని ముద్రలు. గురువు పట్ల అతనికున్న అనన్య అచల భక్తి పరిణామం చెంది అతన్ని ముక్తస్థాయికి చేర్చటమూ ఒక అనుభవమే. పరమేశ్వరుడనుగ్రహించిన కవితాశక్తిని భక్తితో జోడించి, గురురమణుల సన్నిధానంలో గురువే దైవం అన్న భావాన్ని అనుభూతిగా దర్శించుకున్న ముక్తుడు మురుగనార్. రమణుల మహాపరినిర్వాణానంతరమూ అతని భావనలో మార్పులేదు. భగవంతుడు స్వరూపమా, అరూపమా అన్న సంశయం అజ్ఞాన పరిధిలోనిది. మురుగనార్, భక్తిని జ్ఞానంగా మలచుకున్నవాడు. రమణులు శాశ్వతులన్న భావనలో నిలకడ చెందినవాడు.
"నాకేది మంచిదో, నాకేది చెడుపో నాకంటే బాగుగా, నా స్వామి కెరుక
అతని చేరిన వారికి, అతడాయె తల్లిదండ్రి అతని బిడ్డను నేను ఇతరము నాకేల?''అన్న సంపూర్ణ శరణాగతితో భగవాన్ దివ్య సన్నిధిని సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులలో పూర్ణానుభూతిని పొంది, విభూతిస్థితినందుకున్న మురుగనార్ పట్ల గురురమణుల దృష్టి ఏకదృష్టి, నిత్యదృష్టి, అచలదృష్టి, అమలదృష్టి, అనుగ్రహ మహావృష్టి. - వి.యస్.ఆర్.మూర్తి

0 వ్యాఖ్యలు:
Post a Comment