బెర్ముడా ‘కోణం’లో... మర్మమేమిటి?
>> Monday, June 25, 2012
ఆ సముద్ర ప్రాంతం పై ఎగిరే విమానాలు
అకస్మాత్తుగా కూలిపోతాయి. ఆ ప్రాంతంలో పయనించే నౌకలు ఒక్కసారిగా... ఏదో
అదృశ్య శక్తి తనలోకి లాగేసుకున్నట్టుగా అమాంతం మునిగిపోతాయి. వాటి అవశేషాలు
కూడా లభించవు. ఒకటి కాదు రెండు కాదు... గత శతాబ్ద కాలంలో సుమారు 30కి పైగా
ఇలాంటి సంఘటనలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి. విమానాలు, నౌకల పాలిట
మృత్యుకుహరంగా ఎందరో ప్రాణాల్ని హరించి... ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా
మిగిలిన ఆ ప్రాంతమే ‘బెర్ముడా ట్రయాంగిల్’. ‘డెవిల్స్ ట్రయాంగిల్’గా
కూడా పిలవబడే ఈ ప్రాంతంలో ఇంతకీ ఏం జరుగుతోంది? ఆ ప్రాంతంలో అసలేముంది?
అక్కడ జరిగిన సంఘటనల్లో అసలు నిజమెంత? మృత్యుకోణం నిజానిజాలను ఆవిష్కరించే ఓ
ప్రయత్నం...

ఇంతకూ జరిగిందేమిటంటే ఈ ప్రాంతం మీ దుగా వెళ్ళిన దాదాపు 40 విమానాలు ఇం కా ఎన్నో చిన్నచిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏమి అయి పోయాయో తెలియకుండా పోయాయి. అం దులో ప్రయాణించిన వేలాదిమంది ప్రయాణీ కుల ఉనికి తెలియకుండా తయారయింది.
బెర్ముడా ముక్కోణపు ప్రాంతాన్ని ఎందరో శాస్తవ్రేత్తలు సందర్శించారు. వీరికి ఏవిధమైన అద్భుతాలు అక్కడ కనబడలేదు. కాకపోతే కొంత సైన్స్ సమాచారాన్ని సేకరించగలిగారు. సార్గాసో సముద్రంలో ఎన్నో ఆసక్తికరమైన పరిణామాల్ని కనుగొన్నారు. అక్కడ బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. వాతావరణ తుపానులను పోలిన ఈ సుడి గుండాలు జలాల పొరల్లో ఏర్పడతాయి. వీటి వ్యాసం 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ మ్యాకర్షణ శక్తికి సంబంధించి రోటేటింగ్ వస్తువు బరువును కోల్పోతుంది. ఆ తిరగడం ఒక నిర్దిష్ట, వేగాన్ని చేరుకున్నాక అది నెగిటివ్ బరువును పొందుతుంది. ఈ పరిశీలనల ఆధారంగా రూపొందించిన సిద్ధాంతాన్ని ఎవరూ ఆమోదించలేదు. 1970లో ఒక విమానం అమెరికాలోని మియామి విమానాశ్రయంలో దిగడానికి 20 నిమిషాల ముందు రాడార్ స్క్రీన్‌ల మీద కొంతసేపు కనిపించకుండా పోయింది. 10 నిమిషాల తరువాత రాడార్‌లు దానిని తిరిగి కనుగొన్నాయి. విమానం ప్రయాణీకులతో బాటు సురక్షితంగా భూమిమీద దిగింది.
గడియారం కథ...
విమానం పయనిస్తున్న సమయంలో అందు లోని సిబ్బందికి ఏదీ వింతగా కన్పించలేదు. అయితే విమానంలోని గడియారాలన్నీ సరైన సమయంకన్నా పదినిమిషాలు తక్కువ సమ యం చూపుతున్నట్లు గమనించారు. విమానం బయలుదేరే ముందు గడియారాల న్నీ సరిచూసుకున్నారు. అప్పుడు భూమి మీద గడియారాలు, విమానంలోని ఒకే సమయా న్ని చూపుతున్నాయి. గడియారంలో కన్పించి న తేడా ప్రయాణ కాలంలోనే జరిగింది. వి మానం కాంతివేగంతో ప్రయాణించినట్లయితే ఈ విధమైన వ్యత్యాసాలు వస్తాయి. ఇదీ ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం చెప్పే నిజం. కాని వి మానం ఏదీ అంతవేగంతో ప్రయాణించలేదు.
మరి విమానాలు రాడార్‌లకు కనుమరుగవ డం, గడియారాలు ఆలస్యంగా తిరగడం వం టి సంఘటనలకు వాయుగుండాలకు ఏమైనా సంబంధం ఉందా? విమానం ఎటువంటి వానికి లోనుకాకుండా బెర్ముడా ట్రయాంగిల్ నుండి బయటపడిందా? ఇదెలా సాధ్యం? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. శాస్తవ్రేత్తలు కొందరు ఇవన్నీ సాధ్యమేనంటు న్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం విశ్వం, అం తరిక్షం సమ తలంగా లేవు. అందువల్ల విమానం కొంత సమయం కనుమరుగవ్వడానికి వీలుంది అం టున్నారు. విశ్వంలోని వంపువల్ల గడి రా లు పది నిమిషాలు వెనుకకు పోయాయి అని శాస్త్ర వేత్తలు వివరణలు ఇస్తున్నారు.
ఇది మరో వివరణ...
విమానం చిక్కుకున్న ప్రాంతంలో విమానం బరువు రెండింతలు పెరిగివుంటుంది. అంత బరువు విమానాన్ని ఇంజన్ లాగగలదు. కాబ ట్టి విమానానికి ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదు. వాయుగుండం కేంద్ర స్థానానికి విమా నం చేరి ఉంటే దాని పని గల్లంతు అయ్యేది. దానికి కొంచెం దూరంలో విమానం వెళ్లి ఉం డవచ్చునని కొంతమంది వివరణ. విమానం నుండి వెలువడిన సంకేతాలు వం పు తిరిగిన విశ్వం అంచుల నుండి ఎటో వెళ్ళి పోవడం వల్ల రాడార్ తెరమీద అది కనబడ ేదని అంటారు. బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏదో భూతం నౌకల్ని, విమానాల్ని మింగే స్తోందని ప్రజల్లో అలజడి. ఆభూతం కేవలం వాతావర ణం మాత్రమేనని, దాని ప్రభావం వల్లనే ఇటువంటి విడ్డూరాలు జరిగాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
సాక్ష్యాలు లేవు...
ఈ ప్రమాదాలు జరిగినపుడు అచట బలమై న గాలులు వీచిన సాక్ష్యాలు లేవు కదా? అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. దానికి సమాధా నంగా గురుత్వాకర్షణశక్తిని తెరమీదకు తెస్తు న్నారు. అంతరిక్ష పరిశోధకులకు ఈ గురు త్వాకర్షణశక్తి, ప్రభావం బాగా అనుభవంలో ఉంటుందని వివరణగా చెబుతున్నారు. ఒకరాకెట్ అంతరిక్షంలో వెళుతుంటే ఒక పెద్ద ద్రవ్యరాశి గల గ్రహం దగ్గరగా సమీపిం చేసరికి ఆ రాకెట్ వేగం పెరుగుతుంది. బెర్ము డా ట్రయాంగిల్‌లో సముద్రం, వాతావరణం లో వోర్టీసెస్ ఏర్పడి బరువులలో మార్పులు రావడం జరిగింది. అటువంటి ప్రదేశాలకు వచ్చిన విమానాలు అత్యంత వేగంతో ముం దుకు దూసుకుపోతాయి. ఫలితంగా నిర్ణీత సమయం కన్నా ముందుగానే గమ్యాన్ని చేరు తాయి. ఇంధనం ఖర్చులో తేడా ఉండదు.

బెర్ముడా త్రికోణం పరిధి, హద్దులు...
‘బెర్ముడా త్రికోణం’ అని ప్రసిద్ధమైనా గాని ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువి శాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొ క్క రచయితా ఈ త్రికోణాన్ని వివిధ హద్దు లతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరిబియన్ దీవి, అజోరెస్‌కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం - వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశ మే బర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీల కులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మె క్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రి కోణం శీర్షాలు షుమారుగా - ఫ్లోరిడా అట్లాం టిక్ తీరము, సాన్ యువాన్, పోర్టోరికో, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి.
ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీ గా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరీ బియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచు కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని (ఓషన్ కరెంట్) ప్రవహిస్తుం టుంది. దీని 5 లేదా 6 నాట్‌ల (ఓౌ్టట) ప్రవాహ వేగం కొన్ని ఓడలు అదృశ్యం కావ డానికి కొంత దోహ దం చేసి ఉండవచ్చును. అంతే కాకుండా ఇక్కడ హఠాత్తుగా తుపా నులు చెలరేగి, మళ్ళీ సమసిపోవడం జరుగు తూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతు చిక్కకుండా మాయమై ఉండ వచ్చును. ము ఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందకముందు.
బెర్ముడా త్రికోణం కథ మొదలు...
ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, ది క్సూచి కొలత లు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని తన అక్టోబర్ 11, 1492 లాగ్ బుక్‌లో వ్రాసాడు. అయితే ఈ దృశ్యా న్నింటికీ సహే తుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకు లు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూసి న వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకొనే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు.
1950 సెప్టెంబరు 16న ఇ.వి.డబ్ల్యు జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమయన ఊహాగానాలకు, లెక్క లేననన్ని పరిశోధనలకు ఆద్యం. తరువాత రెండేళ్ళకు ‘ఫేట్’ అనే పత్రి కలో ‘సీ మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్’, అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత వ్రాసా డు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన ఐదు అవెంజర్ బాంబర్ విమానాలు - అన్నిం టినీ కలిపి ఫ్లైట్-19 అంటారు - అదృశ్యమ వ్వడాన్ని వర్ణించాడు. తరువాత ఫ్లైట్-19 ఘ టన ఒక్కటే వివరంగా అమెరికన్ లీజియన్ అనే పత్రిక ఏప్రిల్ 1962 సంచికలో వచ్చిం ది. ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్నమాటలు - ‘‘మే ము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నా ము. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది.

కుశ్చే వివరణ...
అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుశ్చే అనే పరిశోధకుడు అప్ప టివరకూ ఉన్న వివిధ రచనలను పరిశీలించి, 1975లో ‘ది బెర్మూడా ట్రయాంగిల్ మిస్టరీ: సాల్వడ్’ అనే పుస్తకం ప్రచురించాడు. ఇందు లో అప్పటివరకూ ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాలు చేశాడు. అతని పరిశీలనల ప్రకారం...
* ఈ బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగిన వని చెబుతున్న అదృశ్యఘటనలు చాలా వర కు అతిశయోక్తులతోనూ లేదా అసంపూర్ణ పరిశోధనతోను లేదా అస్పష్ట సమాచారం తోను తెలుపబడ్డాయి.
* కొన్ని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటన లు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పబడ్డాయి.
* తుపానులు తరచూ వచ్చే ఇలాంటి ఇతర రద్దీ రవాణా సముద్ర ప్రాంతాలలో జరిగే ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి ఎక్కువేమీ కాదు.
మొత్తానికి కుశ్చే ఇలా తేల్చాడు - బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన. అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాఛితంగా గాని లేదా ఉద్దేశ్య పూర్వకంగా గాని ఇది ఒక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారు.
మరి కొన్ని అభిప్రాయాలు...
నౌకా యానంతోనూ, సముద్ర ప్రయాణాల తోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయ డ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, అమెరికా తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏ మీ కాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాలవంటివే ఇక్కడా జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించిన సంచలనాత్మక మైన కథనాలు చాలా వరకు నిరాధారమైనవి అని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమా దంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదే హం మాత్రం కాఫీ కప్పును పట్టుకొన్న భంగి మలో ఓడలో మిగిలి ఉందని ఒక త్రికోణం రచయిత వ్రాసాడు. కాని నిజానికి దాదాపు అందరు మరణించినవారి శరీరాలను తీరభద్రతా సంస్థ వెలికితీసింది.
పత్రికలు, పుస్తకాలు అధికంగా సంచలనం కలిగించే విషయాలపై మొగ్గు చూపుతారని, అందువల్లనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనలకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం. (నోవా / హారిజోన్ - కార్యక్రమం ‘ది కేస్ ఆఫ్ ది బెర్మూడా ట్రాయంగిల్’ 27-06- 1976) - ఇతర సముద్ర ప్రాంతాలలోనూ, తుపానులలోనూ ఓడలు, విమానాలు ఎలా పనిచేస్తాయో, ఎలా విఫలమవుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతున్నది. ఎర్నస్ట్ ట్రావ ెస్, బ్యారీ సింగర్ వంటి హేతువాద పరిశోధ కులు కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చా రు. ఈ త్రికోణం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద నగరాలు, ఓడరేవులు, విమానాశ్ర యాలు కలిపి ఏటా లక్షలలో వాహనాల రాకపోకలకు కేంద్రంగా ఉన్నాయి.
ప్రకృతి సహజ వివరణలు...

దిక్సూచి చలనాలు: బెర్ముడా త్రికోణంలో జరి గిన అనేక ఘటనలలో దిక్సూచి పని చేయక పోవడం లేదా అనూహ్యంగా ప్రవర్తించడం గురించి ప్రస్తావనలున్నాయి. ఇక్కడేదో ప్రత్యే కమైన లేదా బలమైన అయస్కాంత శక్తి ఉండ వచ్చునని ఊహలున్నాయి కాని అటువంటి ఆధారాలు ఇంతవరకూ ఏవీ బయట పడలే దు. అంతే కాకుండా భూమిమీద వివిధ ప్రాం తాలలో భౌగోళిక ఉత్తర ధృవం, అయస్కాం త ఉత్తర ధృవం ఒకటి కాదు. కనుక ఇలాంటి పెద్ద ప్రాంతంలో ఓడలు ప్రయాణిం చేటపుడు దిక్సూచి సూచకాలలో తేడాలు రావడం అసహజం కాదు.
తుపానులు: అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో బలమైన తుఫా నులు తరచు సంభవిస్తుంటాయి. వీటికార ణంగా ఎంతో జననష్టం, ఆస్తి నష్టం సంభవిం చింది. 1502లో ఫ్రాన్సిస్కో డె బోర్బడిల్లా నాయకత్వంలోని స్పానిష్ ఫ్లీటు మునిగిపోవ డం చరిత్రలో తుఫాను కారణంగా నమోద యిన మొదటి నౌకాభంగం. బెర్ముడా త్రికో ణం ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలు ప్రధాన కారణం తుఫానులు కావచ్చును.

అసాధారణమైన అలలు: ప్రశాంతమైన సము ద్రంలో కూడా ఒకోమారు అసాధారణంగా పెద్దవైన అలలు (అసహజ అలలు) హఠాత్తు గా సంభవిస్తుంటాయి. 1982లో అలాంటి ఒక మహాతరంగం కారణంగా న్యూ ఫౌండ్ లాండ్ సమీపంలోని సముద్రంలో ఓషన్ రేం జర్ అనబడే అప్పటి అతిపెద్ద ఆయిల్ ప్లాట్ ఫారమ్ వూరికే తిరగబడిపోయింది. అయితే బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఇలాంటి మహా తరంగాలకు గురించిన ఆధారాలు లేవు. అం దునా వాటి కారణంగా అయితే విమాన ప్ర మాదాలకు వివరణ ఇవ్వడం సాధ్యం కాదు.
మానవ చర్యలు...
పొరపాట్లు: తమ విధుల నిర్వహణలో వ్యక్తు లు తెలిసి గాని, తెలియక గాని తప్పిదాలు చే యడం సహజం. అందునా విపత్కర పరిస్థితు లలో ఇలాంటి చర్యలు జరిగే అవకాశం మ రింత ఎక్కువ. ఇలాంటి తప్పిదాలే బెర్ముడా ట్రయాంగిల్‌లో జరిగిన అనేక ఘటనలకు కారణాలు కావచ్చునని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఉదాహరణకు 1972లో వి.ఎ. ఫాగ్ అనే ట్యాంకర్ విధ్వంసానికి కారణం - తేలికగా నిప్పు అంటుకొనే బెంజీన్ మరకల ను తుడవడానికి తీసుకోవాలసిన జాగ్రత్త గు రించి ఆ పనిచేసే వ్యక్తికి తగినంత శిక్షణ ఉం డకపోవడమే. అలాగే 1958 జనవరి 1న హార్వే కొనొవర్ అనే వ్యాపారవేత్త మొండిగా వ్యవహరించి ఫ్లారిడా వద్ద తన పడ వను తుపాను మధ్యలోకి తీసుకువెళ్ళినందు వల్ల దానిని కోల్పోయాడు. చాలా కేసులలో ధ్వంసమైన నౌకల లేదా విమానాల శకలాలు లభించనందువలన నిర్దిష్టమైన ఆధారాలు లభించడంలేదని పలు అధికారిక నివేదికలలో చెప్పబడింది.
దురుద్దేశ పూర్వకమైన చర్యలు: యుద్ధం, పైర సీ (సముద్రపు దోపిడి), దోపిడి వంటి కారణా ల వల్ల కూడా కొన్ని అదృశ్య ఘటనలు జరిగి ఉండవచ్చు. ప్రపంచ యుద్ధాలలో జలాంతర్గా ముల దాడి ద్వారా, లేదా సముద్రం పై ఓడల దాడి ద్వారా అనేక నావలు నాశనం చేయబ డ్డాయి. వీటిలో కొన్ని రికార్డులలో కూడా న మోదు కాలేదు కనుక ఇదమిత్థంగా నిర్ధారంచ డం సాధ్యం కాలేదు. ఉదాహరణకు 1918 లో యు.ఎస్.ఎస్. సైక్లోప్స్ అనే యుద్ధ నౌక, తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రొటీ యస్, నెరియస్ అనే నౌకలు జలాంతర్గాము ల దాడులవల్ల అదృశ్యమయ్యాయని అభిప్రా యం ఉంది కాని జర్మనీ రికార్డులలో ఈ విషయం నిర్ధారణ కావడంలేదు.

సముద్రం మీద దోపిడి చేసే పైరేటులే కాకుం డా తీర ప్రాంతంలో మాటు వేసి, ఓడలను త ప్పు దారి మళ్ళించి, వాటిని దోపిడి చేసే ము ఠాలు ఉన్నాయి. వీరు సంపదలను దోచుకొని ఓడలో జనాలను చంపివేసేవారు. వీరిని (బాం కర్స్ లేదా రెక్కర్స్) అంటారు. తీరం నుండి లైట్ల ద్వారా ఓడలను తప్పుదారి పట్టించడం వీరవలంబించే పద్ధతులలో ఒకటి. నాగ్స్ హెడ్, ఉత్తర కరోలినా తీరంలో ఒక గుర్రానికి లాంతరు కట్టి, దాని నడక ద్వారా ఓడలను భ్రమింపజేసే విధానం ప్రసిద్ధం.
ప్రసిద్ధ ఘటనలు...
బెర్ముడా త్రికోణం ప్రాంతంలో అనేక సంఘ టనలు జరిగినట్లుగా భావింపబడుతుంది, వా టిలో కొన్ని సంఘటనలు బాగా ప్రసిద్ధమయ్యా యి. బెర్ముడా త్రికోణం సంఘటనలుజబితా
ఫ్లైట్ 19: ‘ఫ్లైట్ 19’ అనేది అమెరికా నౌకా దళానికి చెందిన టి.బి.ఎమ్. అవెంజర్ బాం బురు విమానాల శిక్షణా ప్రయాణం. ఇది డిసెంబరు 5, 1945న అట్లాంటిక్ అసము ద్రంలో అదృశ్యమయ్యింది. అప్పుడు దిక్సూచి (కంపాస్) సరిగా పనిచేయలేదని, వాతావర ణం ప్రశాంతంగా ఉందని, ప్రమాదానికి కార ణాలు తెలియడంలేదని, శిక్షణా పైలట్ లెఫ్టి నెంట్ ఛార్లెస్ కరోల్ టేలర్ అనుభవజ్ఞుడైన నాయకుడని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాలపై వివిధ సందేహాలున్నాయి. కొ న్ని ముఖ్యమైన వివరాలు లభించలేదు. ఉదా ఆ పైలట్ ఇంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెండు మార్లు దారి తప్పి న సందర్భాలు ఉన్నాయి. అతనికి ఈ ప్రాం తం సుపరిచితం కాదు. సంభాషణల రిపో ర్టులో దిక్సూచి సమస్యల ప్రస్తావన లేదు.
మేరీ సెలెస్టి: 1872లో మేరీ సెలెస్టీ అనే పేరు గల ఓడ పోర్చుగల్ తీర్రపాంతంలో వదలివే యబడింది. అంటే దీనికీ, బెర్ముడా త్రికోణా నికీ ఏమీ సంబంధం లేదు. ఈ ఘటన ఆధా రంగంగా ప్రఖ్యాత డిటెక్టివ్ నవలారచయిత (అర్థర్ కోనాన్ డోయల్) మేరీ సెలెస్టీ అనే చిన్నకథ వ్రాశాడు. ఇకపోతే మేరీ సెలెస్టీ అనే ఇలాంటి పేరే ఉన్న ఒక ఓడ సెప్టెంబర్ 13, 1864న బెర్ముడా తీర ప్రాంతంలో మునిగిపో యింది. ఈ చివరి ఘటన మాత్రం బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగింది కాని, మొదటి ఘటన(1872)ను, దానిపైన ఆధారపడి వ్రాసి న కల్పిత కధలోని విషయాలను ఈ 1864 లో జరిగిన ఓడ ప్రమాదంతో కలగలిపి వర్ణించడం జరుగుతుంది.
ఎల్లెన్ ఆస్టిన్: వివిధ కధనాల ప్రకారం ఎల్లెన్ ఆస్టిన్ అనే నౌకకు 1881లో ఒక వదలివేయ బడిన నౌక తారసపడింది. ఆ నౌకలో కొంత మంది సిబ్బందిని ఉంచి న్యూయార్క్ తోడ్కొని పోవాలని ప్రయత్నించారు. ఆ అజ్ఞాత నౌక మధ్యలో అదృశ్యమయ్యింది. మళ్ళీ కనిపిం చేసరికి అందులో సిబ్బంది ఎవరూ లేరు. మళ్ళీ ఒకమారు అదృశ్యమై తరువాత ఇంకొ క సిబ్బందితో కనిపించిందట. లాయడ్స్ వారి రికార్డులు పరిశీలిస్తే మెటా అనే నౌకను1854 లో నిర్మించారు. 1880లో ఆమెటా పేరు ఎల్లె న్ ఆస్టిన్గా మార్చారు. ఆ నౌకకు సంబంధించి న ఏ విధమైన మరణాలు (లేదా అదృశ్యమైన సిబ్బంది) నమోదు కాలేదు. అజ్ఞాత నౌకలో ఉంచిన సిబ్బంది అదృశ్యమైతే అవి ఎల్లెన్ ఆస్టిన్ నౌకా సిబ్బంది మరణాలుగా నమోదు కావాల్సి ఉంది.
యు.ఎస్.ఎస్. సైక్లోప్స్: అమెరికా నౌకాదళం చరిత్రలో యుద్ధం లేకుండా ఎక్కువ మంది సైనికులు మరణించిన ఘటన (యు.ఎస్. ఎస్. సైక్లోప్స్) అదృశ్యమవ్వడం. మార్చి 4, 1918న బార్బడోస్‌లో బయలుదేరిన ఈ యుద్ధనౌక, 309 మంది సిబ్బందితో సహా అంతులేకుండా అదృశ్యమైంది. స్పష్టమైన కారణం ఏమీ కనిపించడంలేదు. తుపానులు, శత్రువుల దాడి, మునిగిపోవడం వంటి అనేక కారణాలను పరిశోధకులు ఊహిస్తున్నారు.
అసలు కారణం ‘అర్గోసీ’..!
బెర్ముడా ట్రయాంగిల్ విషయంలో నిజానిజా లను పక్కనపెడితే దానిపై జరిగిన విపరీతమై పబ్లిసిటీ బెర్ముడా ట్రయాంగిల్‌కు ప్రపంచవ్యా ప్తంగా ఆదరణ తీసుకొచ్చింది. ఈ విషయం లో ముందుగా ప్రస్తావించదగినది ‘అర్గొసీ’ అనే వారపత్రిక. 1960లలో అమెరికాలో వె లువడిన ఒకానొక మసాలా వారపత్రిక ఇది. పాఠకులకు ఉపయోగపడే విషయాలకన్నా సంచలనాత్మకమైన పల్ప్ ఫిక్షన్ తరహా వ్యా సాలు, కథలు, వగైరా విశేషాలతో అమ్మకాలు పెంచుకునే వందలాది చెత్త పత్రికల్లో ఒకటి. ఇందులో ప్రచురితమయ్యే వార్తల్లో వాసి నా స్తి, వదంతులు జాస్తి. బస్టాండుల్లోనూ, రైల్వే స్టేషన్లలోనూ కొని చదివి అవతల పారేసే టైం పాస్ తరహా వీక్లీ అన్నమాట. కాలక్షేపం బఠా నీలు వండి వార్చటంలో పెన్ను తిరిగిన విన్సెం ట్ గడ్డిస్ అనే రచయిత 1964 ఫిబ్రవరిలో అర్గొసీ కోసం ఓ ముఖపత్ర కథనం రాశాడు.
‘ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్’ పేరుతో వచ్చిన ఆ కథనంలో ఆచూకీ తెలియకుండా పోయిన ఐదు అవెంజర్ విమానాల ఘటనకి మరి కొ న్ని ఊహాజనిత సంఘటనలు జోడించి అద్భు తమయిన మసాలా వంటకం తయారు చేశా డు. ఫ్లోరిడా రాష్ట్ర తీరం, బెర్ముడా దీవి, ప్యూ ర్టోరికో దీవుల మధ్యనుండే అట్లాంటిక్ సము ద్ర ప్రాంతానికి ‘బెర్ముడా ట్రయాంగిల్’ అనే పేరు ఇతనే మొదటగా వాడుకలోకి తెచ్చాడు. ఆ ప్రాంతంలో శాస్త్రం వివరించలేని అతీంద్రి య శక్తులేవో ఉన్నాయని, వాటి ధాటికి అటు నుండి వెళ్లే నౌకలూ విమానాలూ అంతుచిక్కని రీతిలో మాయమైపోతాయనీ రాసిన ఈ కాల్ప నిక గాధ ఎంతగా పండిందంటే, చదివిన చాలామంది ఇది నిజమే ననుకున్నారు!
ఇంతకీ మిస్టరీ వెనుక ఏముంది?
అసలక్కడ మిస్టరీయే లేదు. అంటే, అక్కడ నౌకలు, విమానాలు మాయమైపోవటంలో ని జం లేదా? అంటే... అవెంజర్ విమానాలని తీసేస్తే అక్కడ మాయమయిన విమానాలు ఏవీ లేవు. అవెంజర్లు కూడా మానవ తప్పిదం వల్ల కూలిపోయుంటాయనేది అమెరికన్ నౌకాదళం అసలు నివేదిక చెప్పే సత్యం. పైగా, అవి బె ర్ముడా త్రికోణంలోనే కూలిపోయాయనేదానికీ ఆధారాల్లేవు. ఇక నౌకల మాయం విషయాని కొస్తే, ఆ ప్రాంతంలో గల్లంతైన నౌకలు ఎన్నో ఉన్నాయి. కానీ, మిగతా సముద్ర ప్రాంతాల్లో ఏ కారణాలతో నౌకలు గల్లంతయ్యాయో అవే ఇక్కడ కూడా కారణాలు. తుపానులు, మాన వ తప్పిదాలు, భీకరమైన అలలు, వగైరా.
బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇప్పటికీ చాలామందిలో ఉన్న అపోహ... ఆ ప్రాంతం గుండా నౌకా, విమానయానాలు నిషేధించబ డ్డాయి. ఇది పూర్తిగా అసత్యం. అట్లాంటిక్ మహాసముద్రం లోని ప్రముఖ జల రవాణా మార్గాల్లో ఒకటైన ఫ్లోరిడా జలసంధి బెర్ముడా ట్రయాంగిల్ గుండానే సాగుతుంది. అమెరి కన్ ఎయిర్ ఫోర్స్‌తో సహా కమర్షియల్ ఎయి ర్ లైనర్లు ఎన్నో ఈ ప్రాంతం మీదుగా ప్రతి రోజూ విమానాలు నడుపుతుంటాయి. బెర్ము డా ట్రయాంగిల్ పరిధిలోకొచ్చే బహామా దీవు ల్లోని ఫ్రీపోర్ట్ నగరం నుండి ఏటా యాభై వేల కి పైగా విమాన సర్వీసులు ప్రపంచంలోని పలు ప్రాంతాలకు నడుస్తుంటాయి. ఇదే నగరం లోని ఓడరేవు అట్లాంటిక్ మహాస ముద్రంలో అత్యంత రద్దీగా ఉండే నౌకా రవాణా కేంద్రాల్లో ఒకటి. దీనినిబట్టి ‘మృత్యుకోణం’ కథ నేతిబీరకాయలో నేతిలాంటిదని తేలిపోలేదూ..
[from surya telugu daily]
5 వ్యాఖ్యలు:
Good, much informative
మంచి పరిశోధనతో కూడిన వ్యాసం...
really very informative...
@శ్రీ
మంచి పరిశోధనతో కూడిన వ్యాసం...
really very informative...
@శ్రీ
మరి మీరు వెళ్ళి ఆ శాస్త్రవేత్తలకు కూడా కళ్ళు తేరిపించండి... పిచ్చి వెధవలు, మీ అంత జ్ఞానం లేక ఇంకా డబ్బు వృధా చేసుకుంటున్నారు.
Good and informative post...
Keep it up.
Post a Comment