శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శుక్రవారం అభ్యంగనస్నానం నిషేధమట..!?

>> Friday, April 20, 2012

శ్లో|| రవౌ పుష్పం గురౌ దూర్వా భౌమవారే చ మృత్తికా |
గోమయం శుక్రవారే చ తైలాభ్యంగో నదోష భాక్ ||
శుక్రవారం అభ్యంగనస్నానం చేస్తే దుఃఖం కలుగుతుంది. శుక్రశోణితాలతో శుక్రగ్రహానికి సంబంధముంది. ఈ రోజు అభ్యంగనస్నానం చేయడం వల్ల ఉడుకు ఎక్కువై శుక్రశోణిత వ్యాధుల వల్ల నానాబాధలు పడవలసి వస్తుంది. అందువల్ల శుక్రవారం అభ్యంగనస్నానము నిషేధమని పండితులు చెబుతున్నారు. కానీ మహిళలు శుక్రవారం, పురుషులు శనివారం అభ్యంగనస్నానం చేయవచ్చునని వారంటున్నారు. 

అయితే శనైశ్చవగ్రహము శీతల గుణము కలది. ఈనాటి అభ్యంగనస్నానము వల్ల సుఖము కలుగుతుంది. హాయిగా ఉంటుంది. ఇక ఆదివారం అభ్యంగన స్నానం చేయవలసి వస్తే తైలమర్దనం వల్ల కలిగే ఉష్ణాధిక్యతను పోగొట్టుకోవడానికి నూనెలో పూలను వేయాలి. గులాబీ మొదలగు పూలలో వేడిని తగ్గించి చల్లబరచే గుణముంది.

గురువారము నూనెలో గరికె వేసి తలంటు స్నానం చేయడం మంచిది. గరికె పుష్టిని కలిగించే మూలిక. కాబట్టి నూనెలో గరికెవేసి తలంటుకుంటే దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్యము చేకూరుతుంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP