శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రమణులు,సాక్షాత్తు ఈశ్వరులే!

>> Saturday, April 7, 2012

రమణులు,సాక్షాత్తు ఈశ్వరులే!

ఒకసారి నేను తిరువణ్నామళై నుంచి పుట్టపర్తి మీదుగా హైదరాబాద్ వస్తున్నప్పుడు, ఆ రోజున భగవాన్ సత్యసాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు గంటా నలబై నిమిషాల పాటు స్వామి మాట్లాడారు. ఆ తరువాత ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వస్తుండగా షర్ట్ పట్టుకుని లాగి, "రమణులంటే ఎవరనుకున్నావ్? సాక్షాత్తు ఈశ్వరుడు. మరవకు బంగారూ! అంటే రమణులు దేవుడా? గురువా? సాధకుడా? యోగా? ఈ విషయాల గురించి ఆలోచించడం మనపని కాదు. రమణుల్ని అడిగారు. "జ్ఞాని వలన ఈ జగత్తుకు ప్రయోజనం ఏమిటీ అంటే, ఏ అవసరమూ లేకపోయినా, మానవ దే హాన్ని ధరించి, ఈ జగత్తులోకి రావడమే ఈ జగత్తుకు వారు చేసిన మహోపకారం. ఇక వీరా ఇక్కడ ఉండి ఏం చేశారు? తమ శక్తిని తమ లోపల ఉన్న దివ్యత్వాన్ని తమకోసం వాడుకున్న సన్నివేశాలు ఏనాడూ లేవు.

ఇవ్వడం ఒక్కటే... అంతా జగ త్తుకు ఇవ్వడమే. అందుకే "దేవుడు ఎప్పుడూ ఇచ్చేవాడే తప్ప తీసుకునే వాడు కాదు.'' అంటాడు బాబా. ఇది తీసుకునేది కాదు. ఎప్పుడూ ఇచ్చేదే అన్నారు. గురుస్వరూపాలు చూడండి, అవి ఇవ్వడమే తప్ప ఏమీ తీసుకోవు. ఏమి ఇస్తాయి? అంటే కర్మలను తీసుకుంటాయి. కర్మఫలాలను మనకు అందిస్తాయి. మన కర్మలను నిశ్శేషం చేస్తాయి. యోగ భూమికలోకి తీసుకువెళతాయి. షిరిడీ బాబా రెండు అణాలు తీసుకున్నారు. మరొకరు ఇంకేద న్నా తీసుకుంటారు. ఏమి తీసుకున్నా, తీసుకున్న దానికి కొన్ని కోటానుకోట్ల రెట్లు ఇస్తారు. మనమంతా కర్మమాల వేసుకుని వచ్చాం. అనేక జన్మలు ఎత్తాం. అనేక జన్మలు ఎత్తినా, "బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే.''

ఇదీ ప్రయోజనం ఇక్కడికి వచ్చి ధ్యానమంటే ఏమిటి? యోగమంటే ఏమిటి? యోగి అంటే ఎవరు? యోగి దొరికితే ఏమి లాభం? అంటే, మహాత్ములను అశ్రయిస్తే ఏమైనా లాభం ఉందా? అంటే లాభం ఉంది. మహాత్ముని ఆవరణలోకి వెళ్లినప్పుడు నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు భక్తుడవుతాడు. భక్తులు ప్రేమైక జీవి అవుతాడు. ప్రేమైక జీవనంలోంచి జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయిన తరువాత అన్ని రసాలూ అతన్ని ఆశ్రయిస్తాయి. ఆయన దేన్నీ అనుసరించడు.

వదిలేద్దామనుకుంటే.... ఒకానొక మహారాణి వెండి గ్లాసు తీసుకు వచ్చి, "భగవాన్! దీనితో మీరు ప్రతిరోజూ మంచి నీళ్లు తాగాలి. ఆ రకంగా నాకు, మీకు మధ్య బంధం ఉండాలి.'' అంది. భగవాన్ వెంటనే పరిచార కుణ్ని పిలిచారు. "ఈ గ్లాసును ఆఫీసులో అప్పచెప్పి, ముట్టింది అని ఆవిడకు ఒక రసీదు ఇవ్వండి. నన్ను విముక్తం చెయ్యండి అన్నారు. ఎందుకంటే ప్రతిరోజూ ఆ గ్లాసు తోముకోవాలప్పా! ప్రతిరోజూ ఆ గ్లాసులో తాగాలప్పా! తాగినప్పుడల్లా ఆమెను గుర్తు తెచ్చుకోవాలప్పా! అన్నీ వదిలేద్దామనుకున్న నాకు ఈ గుర్తులెందుక ప్పా! అక్కర్లేదు.'' అన్నారు. మనం కూడా గురువుల వలె ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడూ అటునుంచి తీసుకోవడమే కాకుండా, ఇటునుంచి కూడా ఇవ్వగలగాలి. మనం ఏది ఇవ్వగలమో అది ఇవ్వాలి. గీయగలిగిన వాడు గీయాలి. చెప్పగలిగిన వాడు చెప్పాలి. ఏమి చెప్పాలి? గురుతత్వాన్ని చెప్పాలి. గురు సంకీర్తనం చేయాలి. గురు విశేష వైభవాన్ని జగత్తుకు అందించాలి. ం 

విఎస్ఆర్ మూర్తి, 
ఆ«ధ్యాత్మిక శాస్త్ర వేత్త

2 వ్యాఖ్యలు:

srini April 7, 2012 at 11:15 PM  

Thanks for your good article.

srini April 7, 2012 at 11:16 PM  

thanks for sharing your valuable memories of Ramana and baba.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP