శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జైలు నుండి విముక్తం చేయగలవారెవ్వరు ?

>> Thursday, April 5, 2012

జైలులోపల ఖైదీల హృయవిదారక స్థితి కి జాలి చెందిన ఒక పరోపకారి వారికి చల్లని నీరు దొరకదు అని తలచి కొన్ని బస్తాల పంచదార ,మరియు మంచుగడ్డలు తెప్పించి చల్లని పానీయం చేపించి ఖైదీలకు ఇప్పించాడు . వారంతా ఆయన దయాగుణాన్ని మెచ్చుకుంటారు. ఇంకొక పరోపకారి వారికి మంచి భోజనం దొరకడం లేదని ,వారంతా కేవలం జొన్నరొట్టెలే తింటున్నారని చూసి కొన్ని మణుగుల మిఠాయీలు ఇతర మేలైన భోజనపదార్థాలు తెప్పిమ్చి పమ్చి పెడతాడు. మొదటి పరోపకారికన్నా ఈయన ఇంకా గొప్ప దయాగుణం కలవాడని ఖైదీలు పొగుడుతారు . ఇంకో పరోపకారి వీరికి సరైన గుడ్డలు,దుప్పట్లు లేవని చలికి వణుకుతున్నారని తలచి వారందరికీ ఎంతో ధనాన్ని వెచ్చించి వారందరికీ దుప్పట్లు కట్టుకోవటానికి వస్త్రాలు అందజేశాడు. ఆయనగూర్చి ఖైదీలంతా బహుగొప్పగాచెప్పుకుని ఆయనను కీర్తిస్తారు . అయినా ఇంకా వారంతా జైలులోనే ఉన్నారు.

ఇక నాలుగో పరోపకారి వచ్చాడు ఆయన దగ్గర జైలు తాళపు చెవి వున్నది . వీరందరూ ఇలాబంధింపబడి ఉన్నారని జాలి తలచి తాళాలుతీసి వారందరికీ స్వేచ్చను ప్రసాదించాడు.
ఇక్కడ పై నలుగురిలో ఎవరు గొప్పవారు ? ఎవరిద్వారా ఎక్కువ మేలు జరిగినది ?
ఖచ్చితంగా నాలుగవ పరోపకారి ద్వారానే.

పై ముగ్గురూ మేలు చేకూర్చినా ఎనభైనాలుగు లక్షల జీవరాసులుగా సాగుతున్న జన్మపరంపరనుండి విడుదలలేదు.
కానీ నాల్గవ పరోపకారి సద్గురువు . ఆయన చెతిలో భగవన్నామము అనబడే తాళం చెవి ఉంది . జన్మపరంపర అనబడే ఈ ఖైదునుండి విడుదలై జీవుడు స్వేచ్చాలోకాలకు వెళ్లటానికి, తన నిజధామాన్ని చేరుకోవటానికి మార్గం చూపేవాడు నాలుగవ పరోపకారైన సద్గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది


  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP