శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్తోత్రం చేయటం చేపించటం మొదలు పెడదాం .మనజీవితాలు బాగవుతాయి

>> Wednesday, February 29, 2012


స్తుతించటం అంటే పొగడటం . మనకు బాగానచ్చిన వాళ్లను పొగుడుతాం.అంతేకాదు మనకు ఎవరివల్ల ప్రయోజనం లాభం కలుగుతాయో వారినికూడా పొగుడుతాం. భవంతుణ్ణి స్తుతించటం హిందూ సాంప్రదాయం.ఈ స్తోత్రపఠనం అతిచిన్నవయసులోనే పెద్దలనుండి పిల్లలు నేర్చుకుంటారు.. అర్దం తెలియకపోయినా వీరిస్తుతిస్తే భగవంతుడు సంతోషిస్తాడు అన్న నమ్మకంతో స్త్రోత్రాలను పిల్లలు ఎంతో ఇష్టంతో నేర్చుకుంటారు. క్రమశిక్షణతో న్చుకునే ప్రక్రియ నెమ్మదిగా అంతరిస్తోంది నేర్పేవాళ్లు,నేర్చుకునే వాళ్లు కరువవ్వుతుండటంతో .
దీనికోసం సంగీతసధనచేయవలసిన అవసరం లేదు స్వరజ్ఞానం ఉంటేచాలు .పాడడం

తెలియకపోయినా గుక్కతిప్పుకోకుండా కూనిరాగాలు తీస్తూ ఎన్నిపాటలు ఖూనీచేయటం లేదు ! కావలసింది దేవునిపై భక్తి.

శ్రీ విష్ణు సహస్రనామం,లలితా సహస్రనామం అత్యంత ప్రసిధ్ధికెక్కిన స్తోత్రాలు,ఇంకాదేవీదేవతలపై స్తుతులెన్నో ఉన్నాయి. ఆధునిక యుగంలో స్తోత్రపఠనం యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించటం లేదు . దీనివల్ల లబ్దిపొందినవారి నుండిమాత్రమే మనం అర్ధం చేసుకోగలం .భగవంతునిమీద భక్తి పరిపక్వతను పొందినప్పుడు మాత్రమే స్తోత్రాలలోని గంభీరమైన అంతరార్థం మనం గ్రహించగలుగుతాం . ప్రతిరోజూ స్తోత్రపఠనం ఒక గంగా స్నానం లాంటిది. జర్మనీలో "గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదసింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" అనుకుంటూ స్నానం చేసే వ్యక్తికీ, మన నగరాల్లో మైఖేల్ జాక్సన్ పాట వింటూ జలకాలాడె కుర్రకారుకు ఉండేతేడా నక్కకూ నాగలోకానికీ మధ్యవున్న వ్యత్యాసాన్ని గుర్తుచేస్తాయి. స్తోత్రపఠనంతో మనస్సుకు నిలకడ లభిస్తుంది. అలా కాకుండా మనస్సుకు ఉద్రేకపరచే విషయాలను అందిస్తే ,స్వామి వివేకానందులవారన్నట్లు మనసొక సారాయి తాగిన పిచ్చికోతి అవుతుంది. దానికి ఉండేచంచలత్వం ఇంకాపెరిగి ఆనందానికి బదులు ఆవేదనకు గురవుతుంది.ఎండుటాకులా అవుతుంది. ఈ కారణం వల్లనే నేటిసమాజంలో ప్రతిరోజొకకొత్త టివీ ఛానల్ పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగుల్లా .

మనస్సు ఎండిపోకుండా ఎలా కాపాడాలి ? స్వామీ అద్భుతానందజీ శ్రీరామకృష్ణుల ప్రత్యక్శ్హ శిష్యులు . ఆయన జీవితం సరళం,మాటలు భావగర్భితం .ఒకసమ్దర్భంలో ఆయన ఇలా అన్నారు "ఒక ముంతను నీటితో నింపి పెడితే కొన్నాళ్లతరువాత ముంతలోని నీరు ఆవిరవుతుంది. అదేముంతను గంగానదిలోముంచి ఉంచితే ఎంతకాలమైనా నిండుగానే ఉంటుంది .

భగవంతుడే ఆ గంగానది .మనం ముంత .ముంతలో ఉన్న కొద్దిపాటి నీరే మనలో ఉన్న భగవద్భక్తి . విషయవాంఛలు [కోరికలు]అనే వేడితో ముంతలో ఉన్న కొద్దిపాటి నీరు ఆవిరయిపోతుంది .దీన్ని ఎలా అరికట్తాలి ? ఈ సమస్య పరిష్కారమేమిటీ ?

మొదటిగా భగవంతునిపై భక్తి కలగాలి . ముంతయొక్క అల్పత్వాన్ని గ్రహించి కోరికలను అదుపులో ఉంచుకోవాలి .ఎల్లప్పుడు భగవంతుని చింతనలో గడపవలసిన ఆథ్యాత్మిక సాధకునికి స్తోత్రపఠనం మొదటి మైలురాయి. పట్టుదలతో ప్రతిరోజూ ఐదునిమిషాలన్నా స్తోత్రపఠనం చేసి చూద్దాం ! పిల్లలు చెడిపోతున్నారే అని వాపోయేకన్నా మనం ఏచిన్నవీశ్హయమైనా ఆచరించి చూపినప్పుడు వారు నేర్చుకుంతరో లేదోనన్నది తెలుసుకుందాం. మరెందుకాలస్యం ? ప్రయోగం ఆరంభిద్దామా ?


[స్వామి సుప్రియానంద రచనలనుండి]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP