శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విక్రమ సింహపురిలో విద్యార్థుల విజయం కోసం జరిపిన హనుమత్ రక్షాయాగం

>> Tuesday, February 28, 2012


విక్రమ సింహపురిలో విద్యార్థుల విజయం కోసం జరిపిన హనుమత్ రక్షాయాగం



ఈనెల ఇరవై ఆరు ఆదివారం నాడు నెల్లూరులో విద్యార్థుల జయం కోసం హనుమరక్షాధారణా కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. నెల్లూరు రాజాజీ వీధిలోని ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో సరస్వతీ హోమము,హనుమద్రక్షాధారణకు విద్యార్థులు విశేషంగా హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో జయాన్ని సాధించేందుకు హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ఎలా సాధన జరపాలో వివరింఛటం జరిగింది. స్వామి ఉన్నచోట విజయం ఉంటూంది కనుక మనమనస్సులలో స్వామిని నిలుపుకుని ఆయనవలె సుగుణాలను పెంపొందించుకుని హనుమకు ప్రతిరూపాలుగా రూపొందాలని విద్యార్థులకు పిలుపునివ్వటం జరిగింది.హనుమాన్ చాలీసా సామూహికగానంతో విద్యార్థులు పులకించిపోయారు .


హనుమత్ మహిమలను గూర్చి వివరిస్తున్నప్పుడు విద్యార్థులు చేస్తున్న జయజయధ్వానాలతో ఆప్రాంతం మారుమోగింది. తదనంతరం సరస్వతీ హోమ పూర్ణాహుతి ,హనుమత్ రక్షాధారణ లోపాల్గొన్న విద్యార్థులు తమకు స్వామి వెన్నంటి ఉన్నాడని భయమనే పదానికిక చోటు రానివ్వమని తమ అభిప్రాయాలు నాతో పంచుకున్నారు. హనుమద్రక్షాయాగంలో తాముకూడా పాలుపంచుకుంటామని వారి అనుమానాలను అడిగి మరీ నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలు ఆథ్యాత్మిక సంస్థలు తమ సహకారాన్ని అందించాయి. ప్రత్యేకంగా ఈకార్యక్రమానికి సమయం వెచ్చించి శ్రమించిన చంద్రశేఖర్ గారికి కార్యకర్తలకు స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్ధిస్తున్నాము . జైశ్రీరాం



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP