హనుమత్ రక్షాయాగం ప్రారంభం.
>> Saturday, January 28, 2012
పరమగురువుల దీవెనలతో, పరమదయాళువైన పవనసుతుని అనుగ్రహం భక్తజనంపై ఉండాలని కోరుతూ ఈరోజు హనుమత్ రక్షాయాగం ప్రారంభమయింది . విఘ్ననాశకుడైన మహాగణపతి ని స్తుతించి ,తదుపరి గణపతి హోమం నిర్వహించటం జరిగింది . గోపాలకృష్ణమూర్తి భట్టు గారిచే నిర్వహించిన ఈ యాగంలో కోటి చాలీసా పారాయణ, యాగనిర్వహణకు భక్తులు సంకల్పం తీసుకున్నారు. గుంటూరు జిల్లాపరిషత్ సి .ఈ. ఓ. జయప్రకాష్ నారాయణ్ దంపతులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. ముందుగా శ్రీపంచమి పర్వదినసందర్భంగా సరస్వతీ దేవికి పంచామృతాభిషేకములు పుష్పార్చనలు జరుపబడ్డాయి .అనంతరం హనుమత్ స్వామివారికి విశేషద్రవ్యాలతో అభిషేకములు తమాలార్చనలు హారతులు జరుపబడ్డాయి. సకల భక్తజన రక్షణ ,ధర్మరక్షణ చేయాలని కోరుతూ హనుమత్ స్వామి వారి అనుగ్రహానికై యాగం ప్రారంభించబడింది. జైశ్రీరాం.
0 వ్యాఖ్యలు:
Post a Comment