కార్తీక మాసం పూజలకు గోత్రనామాలు పంపండి
>> Wednesday, October 26, 2011


పరమపవిత్రమైన కార్తీకమాసం ప్రారంభమైనది. ఈమాసంలో విశేషమైన పూజాకార్యక్రమాలు ఆథ్యాత్మిక కేంద్రాలలో నిర్వహించబడుతుంటాయి . శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో నిత్యం శివాభిషేకములు,శ్రీవారికి ప్రత్యేకార్చనలు ,అమ్మజగన్మాత దుర్గాదేవికి విశేషపూజలు జరుపబడుతుంటాయి లోక హితం కోసం జరిగే ఈ భగవత్ సేవలలో మీగోత్రనామాల తో అర్చనలు జరుపబడతాయి .అందుకోసం మీగోత్రనామాలను ఈక్రింది మెయిల్ కు పంపండి.
అయితే చిన్న షరతు. మీ తరపున ఇక్కడ అర్చనలు జరుపబడే కాలంలో మీశక్త్యానుసారం మీ గృహాలలోకూడా భగవదారాధన చేయాలి .అలాచేయగలిగితే భగవదానుగ్రహం శీఘ్రమేకలుగుతుంది. జైశ్రీరాం .
durgeswara@gmail.com




2 వ్యాఖ్యలు:
మరి ఆ పూజలకు, రుసుం ఎలా చెల్లించాలి?
అయ్యా
మీరు గమనించలేదేమో పీఠం లో పూజలకు ఎవరూ ఏమీ చెల్లించనవసరం లేదు. ఎవరైనా ఈ భగవత్ సేవాకార్యక్రమాలలో తాముకూడా పాలుపంచుకోవాలని సంకల్పిస్తే వారు స్వయంగా వచ్చి పూజాద్రవ్యాలు,యాగాలకు .అన్నదానాలకు కావల్సిన సామాగ్రిని అందజేయటం ,వారు స్వయంగా అయాకార్యక్రమాలలో పాల్గొనటం చేయవచ్చు. ఇంకా వారు వ్యక్తిగతంగా రావటానికి వీలుకాని స్థితిలో వారి అభ్యర్థనమేరకు ఆయా సామాగ్రి కొనుగోలుచేయటానికి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించటం జరుగుతుంది.ఇప్పటిదాకా పీఠంలో కార్యక్రమములు ఇలానేజరుగుతున్నది అలాసాగుతూనే ఉంటుంది జగన్మాత అనుగ్రహం . ధన్యవాదములు . జైశ్రీరాం
Post a Comment