తల్లులూ ! ఈనెల 28 మీ అన్నదమ్ములకు భోజనంపెట్టి శుభాలుపొందండి
>> Monday, October 24, 2011
కార్తీకమాసం మహాపుణ్యకాలం . అంతేనా అనుబంధాలను పటిష్టం చేసేకాలంకూడాను. కార్తీక విదియ రోజున భగినీ హస్తభోజనం అనే పేరుతో ఓ పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈరోజు యమున తన సోదరుడైన యముని సత్కరించినదని ఈరోజు సోదరునికి భోజనంపెట్టిన మహిళలకు ఆసోదరులకు అపమ్రుత్యుభయంలేకుండా వరమిచ్చాడని పురాణములు చెబుతున్నాయి. తరిగిపోతున్న మానవసంబంధాలను కాపాడుకునేందుకైనా మనం ఈ పడుగలను జరుపుకోవాలి.
ఈనెల ఇరవైఎనిమిది శుక్రవారం రోజున విదియతిథి వస్తుంది కనుక ఇప్పుడే మీ సోదరులకు ఫోన్లుచేసి ఆహ్వానించండి. వాల్లు ఎన్నిపనులున్నా మీఇంటికొచ్చి భోజనం చేయాలని చెప్పండి . యముని అనుగ్రహాన మీ సోదరులకు ఆపదలురాకుండా వరం పొందండి . అన్నదమ్ముల ఆప్యాయతలను మరోసారి రుచిచూడండి . ఇంకో విషయం మీరు స్వయంగా వండి వడ్డించాలి మరచిపోకండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment